Meta AI: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఏఐ సిస్టమ్స్ ఎలా పని చేస్తాయి? - మీ స్క్రీన్ల మీదకి మీరు కోరుకునే ఫీడ్ ఎలా వస్తుంది?
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఏఐ ఎలా పని చేస్తుంది?
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వినియోగదారుల కోసం కంటెంట్ రికమండేషన్లు ఎలా జరుగుతాయో తెలిపే అల్గారిథమ్‌లను మెటా వివరించింది. మెటా సోషల్ మీడియా అల్గారిథమ్‌ల గురించి లోతైన సమాచారాన్ని ప్రచురించింది. ఈ బ్లాగ్ పోస్ట్‌లో మెటా గ్లోబల్ అఫైర్స్ ప్రెసిడెంట్ నిక్ క్లెగ్... తన అల్గారిథమ్‌ల వెనుక ఉన్న ఏఐ సిస్టమ్‌లపై సమాచారాన్ని అందించడం కంపెనీ పారదర్శకత, జవాబుదారీతనాన్ని సూచిస్తుందని తెలిపారు. ప్లాట్‌ఫారమ్‌లో వారు చూసే కంటెంట్‌ను మెరుగ్గా కంట్రోల్ చేయడానికి ఇది వినియోగదారులను అనుమతిస్తుంది.
ఏఐ సిస్టమ్ కంటెంట్‌ను ర్యాంక్ చేస్తుంది, రికమండ్ చేస్తుంది
జనరేటివ్ AI వంటి పవర్‌ఫుల్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్నందున, ప్రజలు దాని ద్వారా లభించే అవకాశాలను చూసి సంతోషిస్తున్నారని, అలాగే కొందరు నష్టాల గురించి ఆందోళన చెందుతున్నారని అర్థం చేసుకోవచ్చని క్లెగ్ తన బ్లాగ్‌లో తెలిపారు. ఆ ఆందోళనలకు ప్రతిస్పందించడానికి ఉత్తమ మార్గం పారదర్శకత అని తాము నమ్ముతున్నామన్నారు.
మెటా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఫీడ్‌లు, స్టోరీలు, రీల్స్, ఇతర మార్గాలను కవర్ చేసే 22 సిస్టమ్ కార్డ్‌లలో చాలా సమాచారం ఉందని ఆయన వివరించారు. ఏఐ సిస్టమ్‌లు కంటెంట్‌ను ఎలా ర్యాంక్ చేస్తాయి, ఎలా రికమండ్ చేస్తాయి అనే దాని గురించి పూర్తి క్లారిటీగా, యాక్సెస్ చేయగల సమాచారాన్ని ఈ కార్డ్‌లు అందిస్తాయి. ఉదాహరణకు, ఇన్‌స్టాగ్రామ్ ఎక్స్‌ప్లోర్-ఎ అనే ఫీచర్ ఎలా పని చేస్తుందంటే... యూజర్‌లు వారు ఫాలో అవ్వని ఖాతాల నుంచి ఫోటోలు, రీల్ కంటెంట్‌ని చూపించే ఫీచర్ ఆటోమేటెడ్ ఏఐ రికమండ్ ఇంజిన్ వెనుక ఉన్న మూడు దశల ప్రక్రియను వివరిస్తుంది. ఈ మూడు దశలు ఇవే.
1. ఇన్వెంటరీ కలెక్షన్: కంపెనీ క్వాలిటీ, ఇంటిగ్రిటీ రూల్స్‌కు కట్టుబడి ఉండే ఫోటోలు, రీల్స్ వంటి పబ్లిక్ ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్‌ను సిస్టమ్ కలెక్ట్ చేస్తుంది.
2. సిగ్నల్స్ అడ్వాంటేజ్ పొందడం: ఇన్‌పుట్ సిగ్నల్స్ అని కూడా పిలిచే ఈ ఫేజ్ ద్వారా సిమిలర్ కంటెంట్ లేదా ఇంట్రస్ట్‌లతో యూజర్లు ఎలా ఎంగేజ్ అయి ఉన్నారో ఏఐ సిస్టమ్ పరిశీలిస్తుంది.
3. కంటెంట్‌ను ర్యాంక్ చేయడం: పై దశ నుంచి కంటెంట్‌ను సిస్టం ర్యాంక్ చేస్తుంది. అది వినియోగదారునికి మరింత ఆసక్తిని కలిగిస్తుందని అనుకున్న కంటెంట్‌ను ముందుకు తరలించి, దాన్ని డిస్కవర్ ట్యాబ్‌లో ఉంచుతుంది.
ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు ఇన్‌ఫ్లుయెన్స్ చేయవచ్చు
ఇన్‌స్టాగ్రామ్ యూజర్ కంటెంట్‌ను సేవ్ చేయడం ద్వారా (సిస్టమ్ మీకు సిమిలర్ కంటెంట్‌ను చూపుతుందని సూచించడం) లేదా ఇంట్రస్ట్ లేనిదిగా మార్క్ చేయడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి కంటెంట్‌ను ఫిల్టర్ అవుతుందని కార్డ్ పేర్కొంది. డిస్కవర్ ఫిల్టర్‌లో ‘Not Personalized’ ఎంచుకోవడం ద్వారా వినియోగదారులు వారి కోసం ప్రత్యేకంగా ఎంపిక చేయని రీల్స్, ఫోటోలను కూడా చూడవచ్చు.
With rapid advances taking place in AI, people are understandably excited by the possibilities & concerned about the risks. The best way to respond to concerns is with openness. So we’re sharing more details about how our AI systems rank & recommend content on Facebook and…
— Nick Clegg (@nickclegg) June 29, 2023