అన్వేషించండి

Inter Results: ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్, అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేస్తున్నాయ్!

తెలంగాణలో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు మరికొన్ని రోజుల్లో వెలువడనున్నాయి. అంతా సజావుగా జరిగితే వారంరోజుల్లోపు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

తెలంగాణలో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు మరికొన్ని రోజుల్లో వెలువడనున్నాయి. అంతా సజావుగా జరిగితే వారంరోజుల్లోపు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. మరో రెండ్రోజులు పట్టే అవకాశం ఉండడంతో అవి పూర్తి చేసిన తర్వాత రెండు మూడు రోజుల్లో ఫలితాలను వెలువరించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంతో జులై 7లోపు ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 12 నుంచి 20 వ‌ర‌కు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉదయం ఫస్టియర్‌ విద్యార్థులకు, మధ్యాహ్నం సెకండియర్‌ వారికి పరీక్షలు జ‌రిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 933 పరీక్షాకేంద్రాల్లో ఈ ప‌రీక్షల‌ను నిర్వహించారు. ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌కి క‌లిపి మొత్తం 4,12,325 మంది విద్యార్థులు ఈ పరీక్షలను రాశారు. ఇందులో ఫస్టియర్‌కి 2,70,583 మంది, సెకండియ‌ర్‌కి 1,41,742 మంది విద్యార్థులు ఈ ప‌రీక్షల‌కు హాజ‌ర‌య్యారు.

ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫ‌లితాల‌ను వీలైనంత త్వర‌గా విడుద‌ల‌ చేసేందుకు ఇంట‌ర్ బోర్డ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే దోస్త్‌, ఇంజ‌నీరింగ్, ఇత‌ర‌ ప్రవేశాల ప్రక్రియ జ‌రుగుతున్న నేప‌థ్యంలో.. ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫ‌లితాల‌ను త్వర‌గా విడుద‌ల చేసేందుకు ఇంట‌ర్ బోర్డ్ అధికారుల క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫ‌లితాల‌ు విడుదలైన తర్వాత https://tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

ALSO READ:

త్వరలో నీట్ యూజీ కౌన్సెలింగ్ షెడ్యూలు, ముఖ్య నోటిసు విడుదల చేసిన ఎంసీసీ!
మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నీట్ కౌన్సెలింగ్ షెడ్యూలును వెల్లడించనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జూన్ మొదటివారంలో నీట్ ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. నీట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఎంబీబీస్, బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్నారు. నీట్ యూజీ కౌన్సెలింగ్ షెడ్యూలు వెలువడగానే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) నీట్ కౌన్సెలింగ్ షెడ్యూలును వెల్లడించనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జూన్ మొదటివారంలో నీట్ ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. నీట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఎంబీబీస్, బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ సీట్ల భర్తీకి ఎన్‌సెట్‌ నోటిఫికేషన్ వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!
ఇంటర్‌ విద్యార్హతతో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సులో ప్రవేశాలకు 2023-24 విద్యా సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(NCET) పేరిట జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆసక్తి ఉన్నవారు జూన్ 27 నుంచి జులై 19 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పరీక్షల తేదీలను ఎన్టీఏ తర్వాత ప్రకటించనుంది.
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

ఇక తెలుగులోనూ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష! ఐఐటీ కౌన్సిల్‌లో నిర్ణయం!
జాయింట్‌ ఎంట్రన్స్ ఎగ్జామ్‌(జేఈఈ) అడ్వాన్స్‌డ్‌‌కు హాజరయ్యే తెలుగు విద్యార్థులకు కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. నీట్‌, జేఈఈ మెయిన్‌ తరహాలోనే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షనూ తెలుగు సహా 11 ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఐఐటీ కౌన్సిల్‌, ఐఐటీ ఢిల్లీని ఆదేశించింది. ప్రధానంగా ఐఐటీల్లో డ్రాపౌట్ల నివారణకు తీసుకోవల్సిన చర్యలపై ఐఐటీ కౌన్సిల్‌ దృష్టి పెట్టింది. డ్రాపౌట్స్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసి  నివేదికను ఇవ్వాలని ఐఐటీ ఖరగ్‌పూర్‌ను కౌన్సిల్‌ ఆదేశించింది. గత ఏప్రిల్‌లో జరిగిన ఐఐటీ కౌన్సిల్‌ మీటింగ్‌కు సంబంధించిన  తీర్మానాలను కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
JNVST 2027 Registration: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశానికి ఇదే చివరి అవకాశం! ఫారం నింపడానికి నేడే లాస్ట్‌ డేట్! 
నవోదయ విద్యాలయాల్లో ప్రవేశానికి ఇదే చివరి అవకాశం! ఫారం నింపడానికి నేడే లాస్ట్‌ డేట్! 

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget