అన్వేషించండి

NCET: ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ సీట్ల భర్తీకి ఎన్‌సెట్‌ నోటిఫికేషన్ వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. నేషనల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(NCET) పేరిట జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

ఇంటర్‌ విద్యార్హతతో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సులో ప్రవేశాలకు 2023-24 విద్యా సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(NCET) పేరిట జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆసక్తి ఉన్నవారు జూన్ 27 నుంచి జులై 19 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పరీక్షల తేదీలను ఎన్టీఏ తర్వాత ప్రకటించనుంది.

నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా బీఏ-బీఈడీ, బీఎస్‌ఈ-బీఈడీ, బీకాం-బీఈడీలను ప్రవేశపెట్టాలనే కేంద్రం నిర్ణయం మేరకు ఆ కోర్సులను రాష్ట్రంలో ఐఐటీలు, ఎన్‌ఐటీలు, కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఈ సంవత్సరమే కొత్తగా ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లు ఐదు ఉండగా వాటిలో ఉన్న కోర్సుల్లో సీట్ల భర్తీకి జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష జరుపుతారు.

4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సును దేశ వ్యాప్తంగా 2023-24  విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నారు. ఇందులో ప్రవేశాల కోసం నేషనల్‌ కామన్‌ ఎంట్రన్స్ టెస్ట్(ఎన్‌సీఈటీ)-2023ను నిర్వహిస్తారు. ఈ పరీక్షను ఎన్‌టీఏ నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్‌టీఏ జారీ చేసింది. దరఖాస్తుల ప్రక్రియను జులై 19 వరకు కొనసాగించనున్నారు. జులై 21, 22 తేదిల్లో దరఖాస్తు చేసిన వాటిలో తప్పులను సరి చేసుకోవడానికి అవకాశం కల్పించారు.

దేశ వ్యాప్తంగా 178 నగరాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం ప్రాంతీయ భాషలతో కలిపి 13 భాషల్లో పరీక్షను నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అడ్మిట్‌ కార్డులను పరీక్షకు మూడు రోజుల ముందునుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. పరీక్ష తేది, సమయాన్ని త్వరలో ప్రకటించనున్నారు. 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సును ఇంటిగ్రేటెడ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌(ఐటీఈపీ) పేరుతో కొనసాగనుంది.

తెలంగాణలో 3 విద్యా సంస్థల్లో  4 సంవత్సరాల బీఈడీ కోర్సుకు ప్రవేశాలకు అవకాశం కల్పించారు. హైదరాబాద్‌లోని ఉర్థూ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో, వరంగల్‌లోని ఎన్‌ఐటీలో, అలాగే మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అడ్మిషన్లకు అవకాశం కల్పించారు. హైదరాబాద్‌లోని ఉర్థూ సెంట్రల్‌ యూనివర్సిటీలో మూడు కోర్సులకు అవకాశమిచ్చారు. బీఎస్సీ బీఈడీ, బీఏ బీఈడీ, బీకామ్‌ బీఈడీ కోర్సులకు అవకాశం ఇచ్చారు. ఒక్కో కోర్సులో 50 సీట్లకు అనుమతి ఇచ్చారు. వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎన్‌ఐటీ)లో బీఎస్సీ బీఈడీ కోర్సుకు అనుమతి ఇవ్వగా 50 సీట్లను భర్తీ చేయనున్నారు. ఇక మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బీఈ బీఈడీ కోర్సుకు అనుమతి ఇచ్చారు. ఇందులో 50 సీట్లను భర్తీ చేయనున్నారు.

Notification

Online Application

ALSO READ:

ఇక తెలుగులోనూ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష! ఐఐటీ కౌన్సిల్‌లో నిర్ణయం!
జాయింట్‌ ఎంట్రన్స్ ఎగ్జామ్‌(జేఈఈ) అడ్వాన్స్‌డ్‌‌కు హాజరయ్యే తెలుగు విద్యార్థులకు కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. నీట్‌, జేఈఈ మెయిన్‌ తరహాలోనే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షనూ తెలుగు సహా 11 ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఐఐటీ కౌన్సిల్‌, ఐఐటీ ఢిల్లీని ఆదేశించింది. ప్రధానంగా ఐఐటీల్లో డ్రాపౌట్ల నివారణకు తీసుకోవల్సిన చర్యలపై ఐఐటీ కౌన్సిల్‌ దృష్టి పెట్టింది. డ్రాపౌట్స్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసి  నివేదికను ఇవ్వాలని ఐఐటీ ఖరగ్‌పూర్‌ను కౌన్సిల్‌ ఆదేశించింది. గత ఏప్రిల్‌లో జరిగిన ఐఐటీ కౌన్సిల్‌ మీటింగ్‌కు సంబంధించిన  తీర్మానాలను కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Manmohan Singh: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
TG TET 2024 Halltickets: తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
Daaku Maharaaj: 'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP DesamPir Panjal Rail Tunnel | ఇండియాలో లాంగెస్ట్ రైల్వే టన్నెల్ ఇదే | ABP Desamరాయల చెరువులో డ్రాగన్ బోట్ రేస్‌ ప్రారంభంఎంతో అందమైన ఈ వైజాగ్ వ్యూ పాయింట్ గురించి మీకు తెలుసా..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Manmohan Singh: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
TG TET 2024 Halltickets: తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
Daaku Maharaaj: 'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
Rohit Sharma News: రోహిత్ కెప్టెన్సీపై మాజీల మండిపాటు - ఆ విషయంలో విఫలమయ్యాడని విమర్శలు, టెస్టు కెరీర్ ముగింపునకు వచ్చేసినట్లేనా?
రోహిత్ కెప్టెన్సీపై మాజీల మండిపాటు - ఆ విషయంలో విఫలమయ్యాడని విమర్శలు, టెస్టు కెరీర్ ముగింపునకు వచ్చేసినట్లేనా?
Charith Balappa Arrested: లైంగిక వేధింపులకు పాల్పడిన టీవీ నటుడు - అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో అరెస్ట్
లైంగిక వేధింపులకు పాల్పడిన టీవీ నటుడు - అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో అరెస్ట్
TTD News: తిరుమల శ్రీవారి దర్శనాలపై తెలంగాణ నేతల విమర్శలు - టీటీడీ కీలక నిర్ణయం
తిరుమల శ్రీవారి దర్శనాలపై తెలంగాణ నేతల విమర్శలు - టీటీడీ కీలక నిర్ణయం
Hyderabad News: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం - ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు దుర్మరణం, అతి వేగమే ప్రాణాలు తీసింది
హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం - ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు దుర్మరణం, అతి వేగమే ప్రాణాలు తీసింది
Embed widget