Top Headlines Today: వెనక్కి తగ్గే రెబెల్స్ ఎందరు? ఏపీ బీజేపీలో రగడ మొదలైందా! మార్నింగ్ టాప్ న్యూస్
Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
Top 10 Headlines Today:
పార్టీ గుండెళ్లో రెబెల్స్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బుధవారం అత్యంత కీలకం. నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం ఆఖరి రోజు. తెలంగాణలో ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. అత్యధిక నియోజకవర్గాల్లో ఫలితం చాలా స్వల్పంగా ఉంటుందని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రత్యర్థుల ఓట్ల చీలికతో పాటు తమ ఓట్లను సమైక్యం చేసుకోవడం అన్ని పార్టల అభ్యర్థులకు కీలకం. ఈ విషయంలో ఏ పార్టీకి ఎక్కువ ముప్పు ఉంది.. ఏ పార్టీకి ఎక్కవ అడ్వాంటేజ్ అవుతుందన్నది బుధవారం తేలుతుంది. నామినేషన్ల ఉపసంహరణ వరకూ రెబెల్స్ ను ( Rebel Candidates ) బుజ్జగించేందుకు అన్ని రకాల ప్రయత్నాలూ చేయనున్నారు. ఇక బరిలో ఉన్న వారితో పోరాడక తప్పదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
టీడీపీ నేత బీటెక్ రవి అరెస్టు
పులివెందుల: టీడీపీ నేత బీటెక్ రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప నుంచి పులివెందులకు వస్తుండగా కొందరు ఆయనను అదుపులోకి తీసుకున్నారని బీటెక్ రవి కుటుంబసభ్యులు తెలిపారు. పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవిని పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. అదుపులోకి తీసుకున్న అనంతరం బీటెక్ రవిని పోలీసులు వల్లూరు పీఎస్‌కు తరలించారు. అనంతరం కడపకు తరలించి రిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించి.. తరువాత మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. మొదట బీటెక్ రవిని అదుపులోకి తీసుకున్న తీరుతో కుటుంబసభ్యులతో పాటు టీడీపీ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను కిడ్నాప్ చేసి ఉండొచ్చునని బీటెక్ రవి భార్య ఆందోళనకు గురయ్యారు. టీడీపీ నేతకు ఏం జరిగినా పోలీసులదే బాధ్యత అని పార్టీ నేతలు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
పురందేశ్వరి తీరుపై సీనియర్ నేతల అసంతృప్తి
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో అంతర్గత సంక్షోభం రాజుకుంటోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని వ్యతిరేకించేవారు ఇంత కాలం సైలెంట్ గా ఉండేవారు. ఇటీవలి కాలంలో ఆమె పనితీరుపై బహిరంగ విమర్శలు చేస్తున్నారు. అలాంటి వారిని ఎప్పటికప్పుడు సస్పెండ్ చేస్తూండటంతో వారు ఇక స్వేచ్చ వచ్చిందని మరిన్ని విమర్శలు చేస్తున్నారు. తాజాగా రాయలసీమకు చెందిన ఏవీ సుబ్బారెడ్డి అనే నేత చేసిన ఆరోపణలు బీజేపీలో సంచలనం రేపుతున్నాయి. బీజేపీ అధ్యక్షురాలుగా టీడీపీ కోసం పని చేస్తున్నారని సుబ్బారెడ్డి ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
కొడంగల్‌లో కొట్లాట
మొన్న అచ్చంపేటలో జరిగిన సీన్ తాజాగా కొడంగల్ నియోజకవర్గంలోనూ రిపీట్ అయింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) నియోజకవర్గం కొడంగల్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం రాళ్లదాడికి దిగారు. నియోజకవర్గంలోని కోసిగి మండలం సజ్జకాం పేట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రచారానికి వెళ్లారు. అదే టైంలో కాంగ్రెస్ శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. బీఆర్ఎస్ కార్పొరేటర్ సోమశేఖర్ రెడ్డి వాహనాల్లో డబ్బు తరలిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఆ వాహనాలను అడ్డుకోవడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య (BRS and Congress activists attack in Kosgi) గొడవ రాళ్ల దాడికి దారితీసింది. రాళ్ల దాడిలో రెండు పార్టీలకు చెందిన కొందరు కార్యకర్తలు గాయపడ్డారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జ్ చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. గాయపడిన వారిని చికిత్స కోసం కోసిగి లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
బంగాళాఖాతంలో అల్పపీడనం
ఈ రోజు కింది స్థాయిలోని గాలులు ఈశాన్య, తూర్పు దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. వాతావరణ హెచ్చరికలు ఏమీ జారీ చేయలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఆ రోజుల్లో సెలవులు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో.. పోలింగ్ తేదీ(నవంబర్ 30)తోపాటు, ముందురోజు (నవంబరు 29) కూడా ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు చెందిన మొత్తం 1.06 లక్షల మంది ఉపాధ్యాయుల్లో.. 80 శాతం మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. అయితే పోలింగ్ కేంద్రాలుగా ఉండే ప్రభుత్వ పాఠశాలలకు సిబ్బంది ఒకరోజు ముందుగానే చేరుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 29న ఉదయం 7 గంటలలోపే ఈవీఎంలను తీసుకునేందుకు ఉపాధ్యాయులు నిర్ణీత కేంద్రంలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల నవంబర్ 29, 30 తేదీల్లో ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ఇవ్వాల్సిందే. పోలింగ్ జరిగే ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ఇచ్చే విషయాన్ని ఎన్నికల కమిషన్ సూచన మేరకు అధికారంగా ప్రకటించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
సుబ్రతా రాయ్ కన్నుమూత
సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ మంగళవారం (14 నవంబర్ 2023) ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. రిటైల్, రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో రాయ్ సువిశాల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఆయన ఆదివారం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చేరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
సెమీ పోటీకి సై
ప్రపంచకప్ లీగ్ దశలో పరాజయమే లేకుండా సెమీఫైనల్‌కు చేరుకున్న టీమిండియా.. కీలక పోరుకు సిద్ధమైంది. ముంబయిలోని వాంఖడే(Wankhede Stadium) వేదికగా న్యూజిలాండ్‌తో (New Zealand) నాకౌట్ మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న రోహిత్ సేన.. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించడం ఖాయమన్న అంచనాలు ఉన్నా సెమీస్ ఫోబియా అభిమానులను కలవరపెడుతోంది. ICC టోర్నీల్లో భారత్‌పై కివీస్ (India VS New Zealand)కు ఘనమైన రికార్డు ఉన్నా ఈ మ్యాచ్‌లో వాటన్నింటినీ పటాపంచలు చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది. గత ప్రపంచకప్ సెమీస్‌లో ఎదురైన పరాభవానికి ఈ సెమీస్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్ సేన కసిగా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
50 రూపాయలకే మంగళవారం
ఆర్ఎక్స్ 100'తో కల్ట్ క్లాసిక్ హిట్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి. కథానాయికను విలన్ చేయడంతో జనాలు కొత్తగా ఫీలయ్యారు. హీరో పాత్రలో ఆయన చూపించిన ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అయ్యాయి. 'ఆర్ఎక్స్ 100' తర్వాత 'మహా సముద్రం' తీసిన అజయ్ భూపతి తాజాగా దర్శకత్వం వహించిన సినిమా 'మంగళవారం'. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
రూ.30 వేల బడ్జెట్‌లో ఫోన్లు
రూ.30 వేల బడ్జెట్‌లో మంచి ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఏకంగా ఐఫోన్‌నే కొనేయండి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న ఆఫర్ల ద్వారా యాపిల్ ఐఫోన్ 12ని రూ.30 వేలలోపే కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి