Weather Latest Update: నేడు వాయుగుండంగా మారనున్న అల్పపీడనం, ఏపీకి వర్ష సూచన: ఐఎండీ
Hyderabad Weather: హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతం అయి కనిపించనుంది. ఉదయం వేళల్లో హైదరాబాద్ నగరంలో పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంటుంది.
Weather Latest News: ఈ రోజు కింది స్థాయిలోని గాలులు ఈశాన్య, తూర్పు దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. వాతావరణ హెచ్చరికలు ఏమీ జారీ చేయలేదు.
హైదరాబాద్‌లో వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతం అయి కనిపించనుంది. ఉదయం వేళల్లో హైదరాబాద్ నగరంలో పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 20 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో తూర్పు, ఈశాన్య దిశల్లో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 31.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 20.6 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 71 శాతంగా నమోదైంది.
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం
ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులను ఆనుకుని అల్పపీడనం కేంద్రీకృతం అయిందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది నేడు పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది వాయువ్య దిశగా పయనించి రేపు ఆంధ్రప్రదేశ్ తీరంలో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. శుక్రవారం నాటికి ఇది ఉత్తర- ఈశాన్య దిశగా తిరిగి ఒడిశా తీరానికి చేరుకుంటుంది. దీని ప్రభావంతో నేడు కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు రెండు మూడు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు రెండు మూడు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.
రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు రెండు మూడు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.