(Source: ECI/ABP News/ABP Majha)
Mangalavaaram : 50 రూపాయలకు 'మంగళవారం' సినిమా - ఏపీ, తెలంగాణలో టికెట్ రేట్లు చూశారా?
Mangalavaaram Show Timings : అజయ్ భూపతి దర్శకత్వంలో 'ఆర్ఎక్స్ 100' తర్వాత పాయల్ రాజ్ పుత్ నటించిన సినిమా 'మంగళవారం'. ఈ సినిమా టికెట్ రేట్స్ ఎలా ఉన్నాయి? ఏంటి?
Mangalavaaram movie ticket price in hyderabad : 'ఆర్ఎక్స్ 100'తో కల్ట్ క్లాసిక్ హిట్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి. కథానాయికను విలన్ చేయడంతో జనాలు కొత్తగా ఫీలయ్యారు. హీరో పాత్రలో ఆయన చూపించిన ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అయ్యాయి. 'ఆర్ఎక్స్ 100' తర్వాత 'మహా సముద్రం' తీసిన అజయ్ భూపతి తాజాగా దర్శకత్వం వహించిన సినిమా 'మంగళవారం'.
'ఆర్ఎక్స్ 100'తో తెలుగు చిత్రసీమకు పరిచయమైన పంజాబీ భామ, కథానాయిక పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput). అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ మరోసారి నటించిన సినిమా 'మంగళవారం'. ఈ శుక్రవారం (నవంబర్ 17, Mangalavaaram Release Date) థియేటర్లలో విడుదల అవుతోంది. మరి, ఈ సినిమా టికెట్ రేట్స్ ఎలా ఉన్నాయి? మల్టీప్లెక్స్ థియేటర్లలో ఎంత ఉంది? సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఎంత? అనేది చూస్తే...
తెలంగాణలో మ్యాగ్జిమమ్ 350... మినిమమ్ 50!
తెలంగాణలో 'మంగళవారం' టికెట్ రేట్లు మ్యాగ్జిమమ్ రూ. 350 అయితే... మినిమమ్ రూ. 50! సూపర్ స్టార్ మహేష్ బాబు భాగస్వామిగా ఉన్న ఏఎంబీ మల్టీప్లెక్స్ (Payal Rajput Mangalavaaram Movie Ticket Price)లో ప్లాటినమ్ టికెట్ రేటు 350. గోల్డ్ రేటు రూ. 295. ప్రసాద్ మల్టీప్లెక్స్ సహా మిగతా అన్ని మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్ రేటు రూ. 295గా నిర్ణయించారు.
చంద్రకళ, విశ్వనాథ్, బీఆర్ హైటెక్ వంటి థియేటర్లకు వస్తే... మ్యాగ్జిమమ్ టికెట్ రేటు 150 రూపాయలు. మినిమమ్ టికెట్ రేటు 50 రూపాయలు. అదీ సంగతి!
మరి, ఏపీలో 'మంగళవారం' టికెట్ రేట్లు ఎలా ఉన్నాయ్?
విశాఖలో శరత్ సంగమ్ వంటి మల్టీప్లెక్స్ థియేటర్లలో మ్యాగ్జిమమ్ టికెట్ రేటు 145 (బాక్స్ సీట్స్) ఉంది. మినిమమ్ టికెట్ రేటు రూ. 100 (నాన్ ప్రీమియం) ఉంది. శ్రీ లీలా మహల్ థియేటర్ టికెట్ రేట్లు కూడా అంతే! నటరాజ్ థియేటర్ విషయానికి వస్తే... ఫస్ట్ క్లాస్ టికెట్ రేటు రూ. 145, సెకండ్ క్లాస్ టికెట్ రేటు రూ. 70గా నిర్ణయించారు. విజయవాడలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మ్యాగ్జిమమ్ టికెట్ రేటు 112 రూపాయలు ఉంది. మినిమమ్ రూ. 80 ఉంది.
Also Read : నేను అడిగితే బన్నీ చరణ్ సినిమాలు చేస్తారు - స్వాతి రెడ్డి గునుపాటి
'మంగళవారం' టీజర్, ట్రైలర్, పాటలు ప్రేక్షకుల్లోకి బాగా వెళ్లాయి. ముఖ్యంగా పాయల్ రాజ్‌పుత్‌ను అజయ్ భూపతి చూపించిన విధానం జనాల్ని అట్ట్రాక్ట్ చేసింది. సినిమాపై విపరీతమైన బజ్ నెలకొంది. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగింది. దాంతో 300 పెట్టి సినిమా చూడటానికి ప్రేక్షకులు ఆలోచించడం లేదని చెప్పవచ్చు.
Also Read : స్వాతి కోసం బెంగళూరు కాలేజీకి వెళ్ళిన బన్నీ - అప్పుడు ఏం జరిగిందంటే?
పాయల్ జోడీగా 'రంగం' ఫేమ్ అజ్మల్ అమీర్ నటించిన 'మంగళవారం' సినిమాలో నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి ఇతర ప్రధాన తారాగణం. ఈ సినిమాతో ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కుమార్తె స్వాతి రెడ్డి గునుపాటి నిర్మాతగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు అజయ్ భూపతికి చెందిన 'ఏ' క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై ఎం. సురేష్ వర్మతో కలిసి చిత్రాన్ని నిర్మించారు. నవంబర్ 17న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల అవుతోంది.