Top Headlines Today: నాంపల్లి మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు; చెప్పులతో తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే, నారా లోకేష్ - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
నాంపల్లి ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల సాయం ప్రకటించారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి కేటీఆర్ ఈ మేరకు పరిహారం ప్రకటించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. ఇప్పటివరకూ 9 మంది మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ముగ్గురు గాయపడగా, 21 మంది అపస్మారక స్థితిలో ఉన్నారు. వీరిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉండగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా చదవండి
మంత్రి సబిత బంధువుల ఇళ్లలో ఐటీ అధికారుల తనిఖీలు
తెలంగాణలో ఐటీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. సోమవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువులు, సంబంధికుల ఇళ్లపై ఆదాయపన్ను అధికారుల దాడులు నిర్వహించారు. హైదరాబాద్ సిటీలో మొత్తం పలు చోట్ల ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. పది బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు.. ఆర్సీపురంలోని నాగులపల్లి, అమీన్‌పూర్‌లోని పటేల్‌గూడ, గచ్చిబౌలిలోని మైహోమ్ భుజాలో సోదాలు చేస్తున్నారు. ఇంకా చదవండి
చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసుల వివరాలేంటీ?
టీడీపీ అధినేత (Tdp Chief ) చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu )పై కేసుల పరంపరను జగన్ ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఇప్పటి వరకూ సీఐడీ (Cid)లో ఆయనపై మొత్తం 8 కేసులు నమోదు చేసింది. ఈ కేసులన్నింటిలోనూ ప్రభుత్వంలో వివిధ పదవుల్లో ఉన్న వారేనంటూ టీడీపీ ఆరోపిస్తోంది. వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకున్న అనుచర బృందమేనని కామెంట్ చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో అమలైన ఉచిత ఇసుక విధానం, మద్యం విధానంపైన నమోదు చేసిన కేసుల్లో ప్రభుత్వాధికారులు ఫిర్యాదులిచ్చారు. నైపుణ్యాభివృద్ధి కేసు, ఫైబర్‌గ్రిడ్ కేసుల్లో నామినేటెడ్ పదవులు పొందిన అధికార పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అమరావతి ఎసైన్డ్ భూముల కేసుల్లో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత చంద్రబాబుపై వరుసగా ఐదు కేసులు నమోదయ్యాయి. ఇంకా చదవండి
చెప్పులతో తరిమికొట్టే రోజులు దగ్గర్లో ఉన్నాయి - నారా లోకేష్ ఆగ్రహం
టీడీపీ నేతలపై వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న దాడులపై నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నంద్యాల జిల్లా కొలిమిగండ్లలో తెలుగు యువత అధికార ప్రతినిధి మంద విజయ్ గోపాల్ పై వైఎస్ఆర్‌సీపీ నేతలు చేసిన దాడిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఖండించారు. విజయ్ గోపాల్‌ను వైసీపీ సైకోలు చెప్పులతో కొట్టి అవమానించారని… అవే చెప్పులతో ప్రజలే వారిని తరిమితరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. అధికార పార్టీ నాయకులు ఫ్యాక్షనిస్టుల కంటే దారుణంగా దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. ఇంకా చదవండి
ఎంపీ టు ఎమ్మెల్యే - ఎన్నికల బరిలో ఏడుగురు !
ఎంపీలుగా ఉన్న ఏడుగురు అసెంబ్లీ బరిలో దిగారు. సాధారణగా ఏడు నియోజకవర్గాలు కలిపి ఒక ఎంపీ స్థానం. అయితే ఎంపీ కన్నా ఎమ్మెల్యే మాటే ఎక్కవ చెల్లుబాటు అవుతుంది. పైగా తెలంగాణ ఎన్నికలు అత్యంత కీలకం. అందుకే ఏకంగా ఏడుగురు ఎంపీలు తమ పార్టీల తరపున బరిలోకి దిగారు. ఇంకా చదవండి