IT Raids: మంత్రి సబిత బంధువుల ఇళ్లలో ఐటీ అధికారుల తనిఖీలు
II Raids Today In Hyderabad: తెలంగాణలో ఐటీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. సోమవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువులు, సంబంధికుల ఇళ్లపై ఆదాయపన్ను అధికారుల దాడులు నిర్వహించారు.
IT raids Today In Hyderabad Latest News: హైదరాబాద్: తెలంగాణలో ఐటీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. సోమవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువులు, సంబంధికుల ఇళ్లపై ఆదాయపన్ను అధికారుల దాడులు నిర్వహించారు. హైదరాబాద్ సిటీలో మొత్తం పలు చోట్ల ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. పది బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు.. ఆర్సీపురంలోని నాగులపల్లి, అమీన్‌పూర్‌లోని పటేల్‌గూడ, గచ్చిబౌలిలోని మైహోమ్ భుజాలో సోదాలు చేస్తున్నారు.
గచ్చిబౌలిలోని మై హోం బూజాలో ఉంటున్న ప్రదీప్ అనే వ్యక్తి నివాసంలో ఇన్‌కం టాక్స్ అధికారులు సోదాలు చేపట్టారు. దానితో పాటు ప్రముఖ ఫార్మా కంపెనీలో తనిఖీలు నిర్వహించారు. ఫార్మా కంపెనీ సీఈఓ, డైరెక్టర్ల ఇంటితో పాటు సిబ్బంది ఇళ్లల్లో సోదాలు చేశారు. సంస్థకు సంబంధించి ఆదాయ పన్ను చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్లు సమాచారం. కాగా, ఐటీ సోదాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.