అన్వేషించండి

Telangana Elections 2023 : ఎంపీ టు ఎమ్మెల్యే - ఎన్నికల బరిలో ఏడుగురు !

Telangana Elections 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఏడుగురు ఎంపీలు పోటీ చేస్తున్నారు. బీజేపీ తరపున ముగ్గురు , కాంగ్రెస్ తరపున ముగ్గురు...బీఆర్ఎస్ నుంచి ఒక ఎంపీ పోటీలో ఉన్నారు.

 

  
Telangana Elections 2023 MP Contest :  ఎంపీలుగా ఉన్న ఏడుగురు అసెంబ్లీ బరిలో దిగారు.  సాధారణగా ఏడు నియోజకవర్గాలు కలిపి ఒక ఎంపీ స్థానం. అయితే ఎంపీ కన్నా ఎమ్మెల్యే మాటే ఎక్కవ చెల్లుబాటు అవుతుంది. పైగా తెలంగాణ ఎన్నికలు అత్యంత కీలకం. అందుకే ఏకంగా ఏడుగురు ఎంపీలు తమ పార్టీల తరపున బరిలోకి దిగారు. 

ఎంపీ కన్నా ఎమ్మెల్యే పదవిపైనే నేతలకు గురి 

తెలంగాణ ఎన్నికల సమరంలో మొదటి అంకమైన నామినేషన్ల ఘట్టం పూర్తయే సరికి ఏడుగురు ఎంపీలు బరిలో మిగిలారు. కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న ముగ్గురు ఎంపీలు, బీజేపి నుంచి ఎన్నికైన నలుగురిలో ముగ్గురు పోటీ చేస్తున్నారు. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి మాత్రం ఒకరు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  టీ పీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో మేడ్చల్‌ మల్కాజిగిరి నుంచి పోటీ చేసి విజయం సాధించారు.  ప్రస్తుతం తన సొంత నియోజక వర్గమైన కొడంగల్‌తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోటీలో ఉన్న కామారెడ్డి నుంచి బరిలో దిగారు. 

నల్లగొండ ఇద్దరు ఎంపీలూ అసెంబ్లీ బరిలో 

మాజీ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హుజూర్‌ నగర్‌ నుంచి పోటీలో నిలబడ్డారు. 2018 శాసన సభ ఎన్నికల్లో ఆయన హుజూర్‌ నగర్‌ నుంచి గెలిచినప్పటికి, 2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో అధిష్టానం ఆదేశం మేరకు నల్గోండ నుంచి పోటీ చేసి గెలుపొందడంతో అసెంబ్లీకి రాజీనామా చేశారు. అదే సంవత్సరం జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి తన సతీమణి పద్మావతి రెడ్డిని హుజూర్‌నగర్‌ నుంచి బరిలోకి దించగా  బీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైది రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక మరో కాంగ్రెస్‌ నేత కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో  నల్లగొం  పోటీ చేసి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంచర్ల భూపాల్‌ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో భువనగిరి నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం నల్లగొండ  అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిచారు. 

అసెంబ్లీలో ఓడిపోయి పార్లమెట్ లో గెలిచి నేతలు

బీజేపీ   మాజీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కూడా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్తి గంగుల కమలాకర్‌ చేతిలో ఓడిపోయారు. 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో కరీంనగర్‌ నుంచి పోటీ చేసి బి.వినోద్‌ కుమార్‌పై గెలుపొందారు. 2019 ఎంపీ ఎన్నికల్లో నిజామాబాద్‌ నుంచి పోటీ చేసిన ధర్మపురి అర్వింద్‌   కేసీఆర్‌ కూతురు కల్వకుంట్ల కవితపై విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన జగిత్యాల జిల్లా కోరుట్ల అసెంబ్లీ నుంచి పోటీలో నిలిచారు. మరో బీజేపీ ఎంపీ సోయం బాబురావు 2019 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. తాజాగా ఆయన బోథ్‌ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి బరిలోకి దిగారు. 

బరిలో బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

బీఆర్‌ఎస్‌ నుంచి మెదక్‌ ఎంపీగా గెలిచిన కొత్త ప్రభాకర్‌ రెడ్డి ప్రస్తుతం దుబ్బాక అసెంబ్లీ నుంచి పోటీలో నిలబడ్డారు. ఎన్నికల ప్రచారంలో ఆయనపై ఓ వ్యక్తి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ ఆయన వీల్‌ చైర్‌లోనే వచ్చి నామినేషన్‌ దాఖలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ నుంచి మొత్తం ఏడుగురు ఎంపీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. :  ఇందులో ఎంతమంది గెలిచి తమ ఎంపీ పదవి వదులుకుంటారో డిసెంబర్‌ 3న తేలి పోనుంది.

టాప్ హెడ్ లైన్స్

CJP Protest: ధర్మేంద్ర ప్రధాన్ బలిపశువు అయ్యారు, చాలా బాధాకరం- కేంద్ర మంత్రి రాజీనామాపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
ధర్మేంద్ర ప్రధాన్ బలిపశువు అయ్యారు, చాలా బాధాకరం- కేంద్ర మంత్రి రాజీనామాపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
CJP GenZ Protest Success Story: కాక్రోచ్‌ల తొలి పోరాటమే సూపర్‌హిట్ - రాజకీయ పార్టీలకు సాధ్యం కానిది సాధించిన జెన్జీలు !
కాక్రోచ్‌ల తొలి పోరాటమే సూపర్‌హిట్ - రాజకీయ పార్టీలకు సాధ్యం కానిది సాధించిన జెన్జీలు !
Rahul Gandhi Student Paper Leak Protest: విద్యార్థుల పోరులో రాహుల్ గాంధీ వ్యూహం - మైలేజీ వచ్చిందా? ఉద్యమం కాంగ్రెస్ సొంతమైందా?
విద్యార్థుల పోరులో రాహుల్ గాంధీ వ్యూహం - మైలేజీ వచ్చిందా? ఉద్యమం కాంగ్రెస్ సొంతమైందా?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget