Top Headlines Today: కేబినెట్‌లోకి కోదండరామ్?; జనసేన వైపు మరో సీనియర్ నేత చూపు- నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
కేబినెట్‌లో చేరేందుకు రెడీ - ఏబీపీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్యూలో కోదండరాం!
కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్ లోకి ఆహ్వానిస్తే తప్పకుండా చేరతామని టీజేఏస్ చీఫ్ కోదండరాం ( TJS Chief ) స్పష్టం చేసారు. తెలంగాణ ప్రజలకు మేలు చేసేందుకు ఏ బాధ్యత ఇచ్చినా స్వీకరించనున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వంలో , ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని రాహుల్ గాంధే స్వయంగా హమీ ఇచ్చినట్లు ఏబీపీ దేశం కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో తెలిపారు. పదవులు బాధ్యత తప్ప తమకు అవేమి అధికారాన్ని అనుభవించే అవకాశం కాదని చెప్పారు. తప పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోమని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని తమ మద్దతు కాంగ్రెస్ పార్టీకేనని తెలిపారు. ఇంకా చదవండి
బీఆర్ఎస్ చేజారిపోతున్న ద్వితీయ శ్రేణి క్యాడర్
తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాల్టీల్లో అవిశ్వాస ఘంటికలు మోగుతున్నాయి. గత బీఆరెస్ ప్రభుత్వం మూడేళ్ల పదవీకాలం అనంతరం చైర్మన్లు, వైస్ చైర్మన్లపై అవిశ్వాసం పెట్టవచ్చన్న నిబంధనను నాలుగేళ్లకు మార్చుతూ మున్సిపల్ చట్ట సవరణ చేసింది. అయితే గవర్నర్ తమిళిసై దీనిని ఆమోదించలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మున్సిపాల్టీ పాలక వర్గాల్లో ఒక్కసారిగా అసమ్మతి భగ్గుమన్నది. అవిశ్వాస తీర్మానాలకు తెరలేచింది. మున్సిపాల్టీల్లో కౌన్సిలర్ల బలాబలాల్లో వేగంగా మార్పులు చోటుచేసుకుని అవిశ్వాస తీర్మానాలు పెడుతున్నారు. గత నాలుగు రోజుల్లో నాలుగైదు పెద్ద మున్సిపాల్టీల్లో అధికారం చేతులు మారింది. ఇంకా చదవండి
దారులన్నీ సొంతూరి వైపే
సంక్రాంతి పండుగకు పల్లెలు సిద్ధమవుతున్నాయి. ఉపాధి నిమిత్తం పట్టణాలకు వచ్చిన వారు తమ సొంతూరికి ఉత్సాహంగా పయనమవుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ - విజయవాడ (Vijayawada) జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. చౌటుప్పల్ (Chowtuppal) పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ తో పాటు పలు కూడళ్లు వద్ద ట్రాఫిక్ నిలిచిపోతుంది. టోల్ గేట్స్ వద్ద హ్యాష్ ట్యాగ్ ఉన్నా.. నెమ్మదిగా వాహనాలు కదులుతున్నాయి. పంతంగి (Panthangi) వద్ద టోల్ ప్లాజా దాటేందుకు దాదాపు 10 నుంచి 15 నిమిషాలకు పైనే పడుతోంది. దీంతో ట్రాఫిక్ నియంత్రణకు జీఎమ్మార్ 30 మంది అదనపు సిబ్బందిని నియమించింది. ఇంకా చదవండి
జనసేన వైపు మరో ఉత్తరాంధ్ర సీనియర్ నేత చూపు
టీడీపీ, జనసేన కూటమి ఇతర పార్టీల నేతలకు హాట్ ఫేవరేట్ గా మారింది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఏదో ఓ పార్టీలో చేరేందుకు సీనియర్ నేతలు ప్రయత్నిస్ుతన్నారు. జాగా మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ త్వరలోనే జనసేన లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన ఆయన తర్వాత వైసీపీలో చేరి రాజకీయంగా దెబ్బతిన్నారు. చాలా కాలంగా ఖాళీగా ఉన్న ఆయన ఎన్నికలకు ముందు యాక్టివ్ అవుతున్నారు. ఆయన జనసేన నేతలతో టచ్ లోకి వచ్చిటన్లుగా తెలుస్తోంది. ఇంకా చదవండి
వైసీపీ రెబల్ లీడర్ల వ్యాపార సంస్థల్లో తనిఖీలు
ఆ ఎమ్మెల్యేలంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒకప్పుడు ప్రియ శిష్యులు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలే రాజకీయంగా బద్ధ శత్రువులయ్యారు. నిన్న మొన్నటి వరకు అధికార వైసీపీలో ఎమ్మెల్యేలుగా వారి ఆధిపత్యం కొనసాగించారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గాల్లో వైఎస్‌ఆర్ తరఫున కొత్త ఇంఛార్జీలు వచ్చారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యేల దుస్థితి దయనీయంగా మారింది. ఇంకా చదవండి