Konatala Ramakrishna Janasena : జనసేన వైపు మరో ఉత్తరాంధ్ర సీనియర్ నేత చూపు - చర్చలు కూడా పూర్తయ్యాయా ?
Janasena : అనకాపల్లికి చెందిన సీనియర్ నేత కొణతాల రామకృష్ణ జనసేనలో చేరే అవకాశం కనిపిస్తోంది.
Konatala Ramakrishna is likely to join in Janasena : టీడీపీ, జనసేన కూటమి ఇతర పార్టీల నేతలకు హాట్ ఫేవరేట్ గా మారింది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఏదో ఓ పార్టీలో చేరేందుకు సీనియర్ నేతలు ప్రయత్నిస్ుతన్నారు. జాగా మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ త్వరలోనే జనసేన లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన ఆయన తర్వాత వైసీపీలో చేరి రాజకీయంగా దెబ్బతిన్నారు. చాలా కాలంగా ఖాళీగా ఉన్న ఆయన ఎన్నికలకు ముందు యాక్టివ్ అవుతున్నారు. ఆయన జనసేన నేతలతో టచ్ లోకి వచ్చిటన్లుగా తెలుస్తోంది.
అనకాపల్లిలో తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసుకుని జనసేనలో చేరికపై కొణతాల క్లారిటీ ఇస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. పవన కల్యాణ్ తో ఇప్పటికే మాట్లాడారని అంటన్నారు. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగాలని కొణతాల భావిస్తున్నారు. కొణతాల రామకృష్ణ. కాంగ్రెస్ హయాంలో ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు.. ఉమ్మడి విశాఖజిల్లాలో బలమైన గవర సామాజిక వర్గం ప్రతినిధిగా చెలామణీ అయ్యారు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవంలో పదేళ్లు పదవుల్లో ఉన్నారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరపున అనకాపల్లి ఎంపీగా పోటీ చేసిన కొణతాల.. కేవలం తొమ్మిది ఓట్లతో గెలిచారు. ఒక ఎంపీ సింగిల్ డిజిట్ మెజారిటీతో గెలవడం ఇప్పటికీ రికార్డే.
అయితే 2009లో ఓడిపోయినప్పటికీ కొంత కాలం ఆయన హవా నడిచింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ ను వీడి వైసీపీలో చేరారు. అప్పట్లో పార్టీకి సంబంధించిన ముఖ్య నిర్ణయాల్లో ఆయన భాగస్వామ్యం ఉండేది. 2014లో పార్టీ ఓడిపోవడం, విశాఖ ఎంపీ సీటులో ఎదురైన వైఫల్యాలు కొణతాలను వైఎస్ జగన్ దూరం పెట్టారు. ఆ తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ పక్కన పెట్టేసిన రామకృష్ణ సైలెంట్ అయిపోయారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం పలు అధ్యయన వేదికలు, సభలు నిర్వహించేవారు. రైతు సమస్యలపై దృష్టి పెట్టారు. చెరకు సాగు ఇబ్బందులు, సహకార రంగంలో షుగర్ ఫ్యాక్టరీలు మూత పడటం వంటి వాటిని అజెండాగా పెట్టుకుని వీలున్నప్పు డల్లా నియోజకవర్గాల్లో తిరుగుతూ వచ్చారు..
గత ఎన్నికల ముందు టీడీపీ ఆహ్వానం మేరకు చంద్రబాబును కలిశారు. టీడీపీలోచే రుతారని అనుకున్నారు కానీ.. టీడీపీ నేతల వర్గ పోరాటం వల్ల చేరలేకపోయారు. ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడు కొణతాల రామకృష్ణ జనసేన వైపు చూస్తున్నారు. సీట్ల సర్దుబాటులో ఉత్తరాంధ్రలో అనకాపల్లి పార్లమెంట్ సీటు జనసేనకు వస్తే బలమైన అభ్యర్థి అయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.