అన్వేషించండి

Anantapuram News: వైసీపీ రెబల్ లీడర్ల వ్యాపార సంస్థల్లో తనిఖీలు - కక్ష సాధింపే అంటున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు

Anantapuram News: సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చెందిన ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలపై ప్రభుత్వ అధికారుల దృష్టి పెట్టారు. దాడులతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

Anantapuram News: ఆ ఎమ్మెల్యేలంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒకప్పుడు ప్రియ శిష్యులు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలే రాజకీయంగా బద్ధ శత్రువులయ్యారు. నిన్న మొన్నటి వరకు అధికార వైసీపీలో ఎమ్మెల్యేలుగా వారి ఆధిపత్యం కొనసాగించారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గాల్లో వైఎస్‌ఆర్‌ తరఫున కొత్త ఇంఛార్జీలు వచ్చారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేల దుస్థితి దయనీయంగా మారింది. 

వారి వ్యాపారాలపై దృష్టి

సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చెందిన ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలపై ప్రభుత్వ అధికారులు దృష్టి పెట్టారు. దాడులతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ కక్ష సాధింపే అంటున్నారు ఎమ్మెల్యే అనుచరులు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఇన్నేళ్లుగా చేస్తున్న మైనింగ్‌పై దాడులకు దిగారు వాణిజ్య పనుల శాఖ, మైన్స్ అధికారులు. బొమ్మనహాల్ మండలం నేమకల్లు సమీపంలో ఉన్న క్వారీల్లో తనిఖీలు చేపట్టారు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు. జీఎస్టీ లేకుండానే వ్యాపారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అన్నింటినీ ఆపేయాలంటూ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అనుచరులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. గురువారం సాయంత్రం నుంచి క్వారీ వద్ద ముడి సరుకు రవాణా లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అధికార పార్టీలో ఇన్నేళ్లుగా ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి చేస్తున్న అక్రమాలపై టీడీపీ ఆందోళన చేస్తే నిర్దాక్షిణ్యంగా అణిచివేశారు. తాజాగా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అధికార పార్టీకి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు రంగంలోకి దిగారు. తమను కాదని తమకు బైబై చెప్తున్నా వైసీపీని వీడి వెళ్తున్న నేతలపై అధికారపార్టీ పెద్దలు గరంగరం అవుతున్నారు.

కదిరిలోనూ

కదిరి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వైసీపీ నుంచి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న అధికార పార్టీలోని ముఖ్య నేతలనే ప్రభుత్వం టార్గెట్ చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వారి వ్యాపార కార్యకలాపాలపై వివిధ శాఖల అధికారులు దాడులు చేస్తున్నారని అంటున్నారు. కదిరి, రాయదుర్గం ఎమ్మెల్యేల వెంట వెళ్తున్న వైసీపీలోనే అసమ్మతి నేతలపై వైసీపీ అధిష్టానం ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోందని టాక్. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అనుచరులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపణలున్నాయి. తమను కాదని మరొక పార్టీలోకి వెళ్తే ఎంతటివారైనా వదిలేది లేదన్నట్లు వైసీపీ అధిష్టానం వ్యవహరిస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వాధికారులకు పట్టలేదని ఇప్పుడు మాత్రం దాడులు చేస్తున్నారని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget