Top Headlines Today: నేడు సుప్రీంలో బాబు పిటిషన్ విచారణ; కేంద్రానికి కేటీఆర్ హెచ్చరిక? - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
మా వాదన వినిపించుకపోతే ప్రజా ఉద్యమం గ్యారంటీ - కేంద్రానికి కేటీఆర్ హెచ్చరిక
లోక్ సభ నియోజకవర్గాల్ని పునర్విభజించే (డీలిమిటేషన్) అంశంపై దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. దీనిపై దక్షిణాది రాష్ట్రాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి కేంద్రం తీసుకోవాలని కేటీఆర్ కోరారు. దేశంలో ఆర్థికపరంగా ఉత్తమంగా పర్ఫామ్ చేస్తున్న రాష్ట్రాల వారసులుగా దక్షిణాది ప్రజలు గర్వపడుతున్నారని అన్నారు. అలాంటి దక్షిణ భారతంలో లోక్ సభ సీట్లు తగ్గితే బలమైన ప్రజా ఉద్యమం వస్తుందని అన్నారు. ఇంకా చదవండి
న్యాయమూర్తుల దూషణలపై హైకోర్టులో ఏజీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు
న్యాయమూర్తుల దూషణలపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషణ్ దాఖలు చేశారు అడ్వకేట్ జనరల్. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు తదనంతర పరిణామాల్లో హైకోర్టు జడ్జిలు, దిగువ కోర్టు న్యాయమూర్తులపై దూషణల పర్వం కొనసాగింది. దీనిపై ఏజీ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తులను దూషిస్తున్నారని ఇప్పటికే అనేక ఫిర్యాదులు వచ్చాయని పిటిషన్లో వెల్లడించారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో కోరారు. ఇంకా చదవండి
బీజేపీపార్టీ ప్రతినిధా, రాష్ట్ర గవర్నరా? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం
తెలంగాణ మంత్రి హరీశ్ రావు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రి మండలి సిఫార్సు చేసిన కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌ల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడం దారుణమన్నారు. బీఆర్ఎస్ సభ్యులుగా ఉన్నారన్న కారణంతోనే అనర్హులు అంటూ తిరస్కరించడం సరికాదన్నారు. ఒక పార్టీకి ఉపాధ్యక్షురాలిగా ఉన్న వ్యక్తిని గవర్నర్‌గా నియమించొచ్చా ? అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఇంకా చదవండి
గవర్నర్ నియామకమే అప్రజాస్వామికం - మంత్రి వేముల
తెలంగాణ గవర్నర్ తమిళిసై గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను తిరస్కరించడంపై అధికార పార్టీ నేతల నుంచి విమర్శలు మొదలయ్యాయి. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గవర్నర్ తీరును తప్పుబట్టారు. మంత్రి ప్రశాంత్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్‌గా కొనసాగే నైతిక అర్హత తమిళిసై సౌందర రాజన్‌కి లేదని అన్నారు. ఆమె రాజ్‌భవన్‌ను రాజకీయ అడ్డాగా మార్చుకుని రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను రాష్ట్ర క్యాబినేట్ ఆమోదం తెలిపితే గవర్నర్ తిరస్కరించడం ఏంటని మండిపడ్డారు. వారికి రాజకీయ నేపథ్యం ఉందని రిజెక్ట్ చేయడం అత్యంత దుర్మార్గం అని అన్నారు. ఇంకా చదవండి
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్
ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం లేకుండా తీసుకు వచ్చిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు సరికాదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) పేర్కొంది. 2020-21 ఆర్థిక ఏడాదికి సంబంధించిన నివేదికలను సమర్పించిన కాగ్.. వార్డు కమిటీలు లేకుండా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తన ఆడిట్ రిపోర్టులో వెల్లడించింది. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థల ఏర్పాటు పాలన వికేంద్రీకరణ కోసమే అని కాగ్ తన నివేదికలో పేర్కొంది. ఇంకా చదవండి
ఎన్డీఏ కూటమికి అన్నాడీఎంకే గుడ్ బై - అన్నాదురైపై బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలతో కీలక నిర్ణయం
బీజేపీతో అన్నాడీఎంకే తెగదెంపులు చేసుకుంది. ఇకపై ఎన్డీఏ భాగస్వామిగా ఉండబోవడం లేదని ప్రకటించింది. తమిళనాడులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన పార్టీ కీలక నేతల సమావేశం తర్వాత ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ద్రవిడ దిగ్గజం సీఎన్ అన్నాదురైపై తమిళనాడు బీజేపీ చీఫ్ కె.అన్నామలై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుంది. ఇంకా చదవండి
మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి
లేడీ సూపర్ స్టార్ నయనతార, జయం రవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఇరైవన్'. ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ కి ఐ. అహ్మద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌లు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తెలుగులో 'గాడ్' పేరుతో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా తెలుగు వెర్షన్ ట్రైలర్ ను రిలీజ్ చేసారు. ఇంకా చదవండి
ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే
దక్షిణ కొరియాకు చెందిన వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ ఇటీవలే తన ఎక్స్‌టర్ మైక్రో ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఎక్స్‌టర్ నేరుగా టాటా పంచ్‌తో పోటీపడుతుంది. భారతీయ కస్టమర్లలో ఎక్స్‌టర్‌కు మంచి స్పందన ఉంది. కంపెనీ ఇప్పటికే 50,000 కంటే ఎక్కువ బుకింగ్స్ అందుకుంది. దీన్ని బట్టి ఎక్స్‌టర్ హైప్‌ను అంచనా వేయవచ్చు. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సన్‌రూఫ్‌తో కూడిన మొదటి మూడు వేరియంట్‌లు మొత్తం బుకింగ్‌లలో 75 శాతం వాటాను కలిగి ఉన్నాయి. దీని తర్వాత ఏఎంటీ, సీఎన్‌జీ వేరియంట్‌లను ఇష్టపడుతున్నారు. ఇంకా చదవండి
సీఎంకు కాబోయే అల్లుడిగా రామ్ - ‘స్కంద’ కొత్త ట్రైలర్ చూశారా?
ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni), బోయపాటి శ్రీనుల (Boyapati Sreenu) దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ సినిమా ‘స్కంద’ (Skanda). ఈ సినిమా గురువారం (సెప్టెంబర్ 28వ తేదీ) విడుదలకు రెడీ అవుతోంది. దీంతో ప్రమోషన్ల విషయంలో టీమ్ జోరు పెంచింది. మరో కొత్త ట్రైలర్‌ను (Skanda Release Trailer) కూడా విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో యాక్షన్‌తో పాటు ఎమోషన్‌కు కూడా పెద్ద పీట వేశారు. ఇంకా చదవండి
భారత్, ఆస్ట్రేలియా మూడో మ్యాచ్ పరిస్థితి ఏంటి? - వర్షం ఆటంకం కలిగిస్తుందా?
మూడు వన్డేల సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో భారత్ 99 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. తద్వారా సిరీస్‌ను కూడా టీమిండియా 2-0తో గెలుచుకుంది. ఇప్పుడు ఇరు జట్ల మధ్య సిరీస్‌లో మూడో వన్డే సెప్టెంబర్ 27వ తేదీన రాజ్‌కోట్‌లో జరగనుంది. రాజ్‌కోట్ వన్డే భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. మూడో వన్డేలో విజయం సాధించడం ద్వారా కంగారూలను క్లీన్‌స్వీప్ చేయాలని భారత జట్టు భావిస్తోంది. అదే సమయంలో ఆస్ట్రేలియా జట్టు తొలి విజయంపై కన్నేసింది. ఇంకా చదవండి