అన్వేషించండి

Donald Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు బిగ్ షాక్ - ఆ ఆదేశాలు తాత్కాలికంగా నిలిపేసిన ఫెడరల్ కోర్టు, భారతీయులకు బిగ్ రిలీఫ్

Birthright Citizenship: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ఇది నిజంగా బిగ్ షాక్. వలస వచ్చిన వారి పిల్లలకు జన్మతః వచ్చే పౌరసత్వ రద్దు నిర్ణయాన్ని ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా నిలిపేస్తూ ఆదేశాలిచ్చింది.

Federal Court Blocks Donald Trump Order On Birthright Citizenship: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు (Donald Trump) బిగ్ షాక్ తగిలింది. వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే.. ఆ చిన్నారులకు సహజంగా వచ్చే పౌరసత్వ హక్కును (Birthright Citizenship) ట్రంప్ రద్దు చేయగా.. ఈ ఆదేశాలను సియాటెల్ ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా నిలిపేసింది. ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఈ నెల 20న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు. వాటిలో పారిస్ ఒప్పందం సహా డబ్ల్యూహెచ్‌వో నుంచి వైదొలగడం, ప్రభుత్వ ఉద్యోగుల ఇంటి నుంచి పని విధానాన్ని రద్దు చేయడం, ప్రభుత్వ నియామకాలపై నిషేధం, క్యాపిటల్ హిల్‌పై దాడి చేసిన వారికి క్షమాభిక్ష పెట్టడం, వలస వచ్చిన వారి పిల్లలకు జన్మతః వచ్చే పౌరసత్వ రద్దు నిర్ణయం వంటివి ఉన్నాయి.

ట్రంప్ నిర్ణయాన్ని పలు రాష్ట్రాలు తీవ్ర వ్యతిరేకించాయి. ఆ ఆదేశాలు చెల్లవని 22 రాష్ట్రాలు లా సూట్స్ దాఖలు చేశాయి. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అధ్యక్షుడు ఆదేశాలు ఇచ్చారని వాటిని అమలు చేయడానికి లేదని లా సూట్స్‌లో పేర్కొన్నాయి. అమెరికా రాజ్యాంగం 14వ సవరణ ప్రకారం.. పౌరసత్వ చట్టం నిబంధనలకు ట్రంప్ ఆదేశాలు వ్యతిరేకమని వాదించాయి. అమెరికాలో ఎవరు పుట్టినా అమెరికా వారసత్వం లభించడం అనేది రాజ్యాంగపరంగా వచ్చిన హక్కు.  దాన్ని ఎవరూ కాదనలేరని న్యాయవాదులు కోర్టులో వాదించారు. ఏ దేశానికి అయినా రాజ్యాంగమే ఫైనల్ అని.. అమెరికా రాజ్యాంగాన్ని అత్యంత పకడ్బందీగా రూపొందించారు. దీంతో సియాటెల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ జాన్ కాఫ్నర్.. జన్మతః పౌరసత్వ రద్ద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

అసలేంటి "బర్త్ సిటిజెన్ షిప్"?

అమెరికన్ లా ప్రకారం వేరే దేశపు తల్లిదండ్రులకు అమెరికాలో పిల్లలు పుడితే ఆ పిల్లలు ఆటోమేటిక్‌గా అమెరికన్ పౌరులుగానే గుర్తించబడతారు. భారతదేశానికి సంబంధించిన చాలామంది తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు అలానే అమెరికన్ పౌరులుగా జీవిస్తున్నారు. ఆ పిల్లలు పెద్దైన తర్వాత వారి అనుమతితో  తల్లిదండ్రులు కూడా సిటిజన్షిప్ తీసుకుంటారు. అయితే మొదటి నుంచి 'అమెరికా ఫస్ట్' నినాదంతో జాతీయ  భావాల ఆధారంగా రాజకీయాలు చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆ పద్ధతికి చెక్ పెట్టేశారు. అమెరికాలో పుట్టినంత మాత్రాన వేరే దేశపు తల్లిదండ్రుల పిల్లలు అమెరికన్లు అయిపోరు అంటూ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి బాధ్యతలు స్వీకరించిన వెంటనే చిన్నారులకు సహజంగా వచ్చే పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఈ ఆదేశాలతో అక్కడి భారతీయులతో పాటు, యూఎస్‌కు వలస వెళ్లిన వారిలో తీవ్ర ఆందోళన కలిగించాయి. ఫిబ్రవరి 20 తర్వాత పుట్టిన వారికి సిటిజన్ షిప్ రాదనే ట్రంప్ నిర్ణయంతో కొందరు ముందుగానే డెలివరీలు చేయించుకునేందుకు ఆస్పత్రులకు పరుగులు తీశారు. అయితే, ట్రంప్ ఆదేశాల నిలిపివేతతో భారతీయులు సహా వలస వెళ్లిన వారికి బిగ్ రిలీఫ్ దక్కినట్లయింది.

Also Read: Bill Gates : నాలుగో తరగతిలో బిల్ గేట్స్ రాక్స్ - టీచర్ షాక్స్ - ఆవు మూత్రపిండాలు తీసుకెళ్లాడట మరి !

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

US Iran War: ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget