Top Headlines Today: ఏపీ ప్రజలకు ప్రభుత్వం దసరా కానుక! కేటీఆర్‌పై కొండా సురేఖ సంచలన ఆరోపణలు - నేటి టాప్ న్యూస్
Andhra Pradesh News | ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నేటి టాప్ న్యూస్ ఇలా ఉన్నాయి. కేటీఆర్ సినిమా వాళ్లను డ్రగ్స్ కు అలవాటు చేసి వారి జీవితాలతో ఆడుకున్నాడని కొండా సురేఖ ఆరోపించారు.
Telangana News Today | ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షను తిరుమల శ్రీవారి సన్నిధిలో విరమించారు. 11 రోజుల పాటు సాగిన ఆయన దీక్షలో భాగంగా ఇటీవల చోటు చేసుకున్న కొన్ని పరిణామాల నేపధ్యంలో సనాతన ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత భుజాలకెత్తుకుని ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. మంగళవారం రాత్రికి అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకున్న పవన్ కళ్యాణ్ గారు బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో తన ఇద్దరు కూతుళ్లు కుమారి ఆద్య కొణిదెల, కుమారి పొలెనా అంజలి కొణిదెలలతో కలసి మహాద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామి వారిని దర్శించుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీఎం చంద్రబాబు మూడు గుడ్ న్యూస్‌లు చెప్పారు. ఇవాళ్టి నుంచి చెత్త పన్ను వసూలు పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించారు. అంతే కాకుండా డ్వాక్రా సంఘాలను ఇకపై చిన్నతరహా పరిశ్రమలుగా గుర్తిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్న వారి కోసం ప్రత్యేకంగా గ్రూప్‌లు ఏర్పాటు చేయబోతున్నట్టు వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
డ్రగ్స్ అలవాటు చేసి హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారు - కేటీఆర్‌పై కొండా సురేఖ సంచలన ఆరోపణలు
తెలంగాణ రాజకీయాల్లో సోషల్ మీడియాలో ట్రోలింగ్ వ్యక్తిగత విమర్శల స్థాయికి చేరింది. తనపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ట్రోలింగ్ ను కేటీఆర్ సమర్థించినట్లుగా మాట్లాడటంతో.. కొండా సురేఖ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేటీఆర్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. కేటీఆర్ హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నాడని.. హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేశాడని కొండా సురేఖ ఆరోపించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన
గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే లీడర్లు ముందు మందు మానేయాల్సిందేనంటూ కార్యకర్తలకు హితవు పలికారు. మద్యపానం మానేసి వాళ్లకే ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇప్పిస్తామంటూ చెప్పుకొచ్చారు. మంచిర్యాలలోని దండెపల్లిలో గాంధీజయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఈ ఏడాది 48 లక్షల పెళ్లిళ్లు, రూ.6 లక్షల కోట్ల ఖర్చు - ముహూర్తాలు ఎప్పుడంటే?
అక్టోబర్ ప్రారంభంతో పండుగ సీజన్ తారస్థాయికి చేరుకుంది. అక్టోబర్ 31న దీపావళితో మన దేశంలో పెద్ద పండుగల సీజన్ ముగుస్తుంది. ఆ తర్వాత పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమవుతుంది. ఈ ఏడాది నవంబర్-డిసెంబర్ నెలల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. సుముహూర్తాల్లో దాదాపు 48 లక్షల వివాహాలు జరుగుతాయని అంచనా. దాదాపు రూ.6 లక్షల కోట్లను భారతీయులు ఖర్చు చేయబోతున్నారు. వ్యాపారస్తులతో పాటు భారత ఆర్థిక వ్యవస్థ కూడా వీటి వల్ల గొప్ప ప్రయోజనం పొందొచ్చు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి