Konda Surekha : డ్రగ్స్ అలవాటు చేసి హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారు - కేటీఆర్‌పై కొండా సురేఖ సంచలన ఆరోపణలు
Congress : డ్రగ్స్ అలవాటు చేసి హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారని కొండా సురేఖ ఆరోపించారు. సమంత విడాకులకు, కొంత మంది త్వరగా పెళ్లి చేసుకోవడానికి కేటీఆరే కారణమన్నారు.
Konda Surekha alleged that KTR played with the lives of heroines by making her addicted to drugs : తెలంగాణ రాజకీయాల్లో సోషల్ మీడియాలో ట్రోలింగ్ వ్యక్తిగత విమర్శల స్థాయికి చేరింది. తనపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ట్రోలింగ్ ను కేటీఆర్ సమర్థించినట్లుగా మాట్లాడటంతో.. కొండా సురేఖ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేటీఆర్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. కేటీఆర్ హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నాడని.. హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేశాడని కొండా సురేఖ ఆరోపించారు. నాగచైతన్య- సమంత విడాకులకు అతనే కారణమని.. ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడి వ్యక్తిగత విషయాలు తెలుసుకుని వాళ్లను బ్లాక్ మెయిల్ చేశారన్నారు. కొంత మంది హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయకుండా త్వరగా పెళ్లి చేసుకోవడానికి కూడా కేటీఆరే కారణమని ఆరోపించారు. దుబాయ్ లో మనుషుల్ని పెట్టి.. పోస్టులు పెట్టిస్తున్నారని ఆరోపించారు.
కొండా సురేఖవి దొంగ ఏడుపులన్న కేటీఆర్
అంతకు ముందు ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మీడియా ప్రతినిధిలతో కేటీఆర్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఆ సందర్భంగా కొండా సురేఖపై సెటైర్లు వేశారు. కొండా సురేఖ దొంగ ఏడుపులు, పెడబొబ్బలు దేనికి? కొండా సురేఖ గారు గతంలో ఉచ్చ ఆగడం లేదా అని అనలేదా?… ఇంకా ఆమె గతంలో మాట్లాడిన బూతు మాటలు గుర్తు తెచ్చుకోవాలని సలహా ఇచ్చారు. మా పార్టీ తరఫున ఆమె పై ఎవరు మాట్లాడలేదని.. ఇదే సోషల్ మీడియాలో మాపైన ట్రోలింగ్ పేరుతో దాడి జరగడం లేదా అని కేటీఆర్ ప్రశ్ించారు. గతంలో ఇదే కొండా సురేఖ గారు మాట్లాడిన వీడియోలు పంపిస్తా మీకు కావాలంటే. ఇదే కొండా సురేఖ గారు హీరోయిన్ల ఫోన్లు టాప్ చేశారని కామెంట్లు చేశారన్నారు.
ఆమె ఆరోపణలు చేసిన వాళ్లు మహిళలు కాదా? వాళ్లకు మనోభావాలు ఉండవా అని మండిపడ్డారు. మాపైన అడ్డగోలు ఆరోపణలు చేసినప్పుడు మా ఇంట్లో ఉన్న మహిళలు బాధపడ లేదా? వాళ్ళు ఏడ్వరా…? అని ప్రశ్నించారు.
కేటీఆర్ వ్యాఖ్యలకు కొండా సురేఖ తీవ్ర ఆరోపణలతో కౌంటర్
కేటీఆర్ తనపై పెట్టిన సోషల్ మీడియా పోస్టులను ఖండించకపోగా సమర్థించడంతో కొండా సురేఖ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. కేటీఆర్ ఇప్పటి వరకూ గుసగుసలుగా ఉన్న ఆరోపణలన్నింటినీ మీడియా ముందు వల్లే వల్లే వేశారు. కేటీఆర్ పై సోషల్ మీడియాలో చేసే ఆరోపణల్ని నేరగా చేశారు కొండా సురేఖ. గతంలో సమంత, నాగ చైతన్య విడిపోవడానికి కూడా కేటీఆర్ కారణం అని.. వారి ఫోన్లను ట్యాప్ చేయించారని కొండా సురేఖ ఆరోపించారు. ఇప్పుడు మరో హీరోయిన్ పెళ్లి అంశాన్ని కూడా తెచ్చారు. డ్రగ్స్ కూడా అలవాటు చేశారని కొండా సురేఖ చెప్పడం కూడా సంచలనం రేపనుంది.
హరీష్ రావుపై కొండా సురేఖ ప్రశంసలు
హరీష్ రావును కొండా సురేఖ పొగిడారు. ఆయన మంచి మనసున్న వ్యక్తిగా స్పందించారన్నారు. కొండా సురేఖపై ట్రోలింగ్ కు పాల్పడిన వ్యక్తి బీఆర్ఎస్ కార్యకర్త అయితే తాము చిందిస్తున్నామని.. ఎవరూ అలాంటి పోస్టులు పెట్టవద్దని హరీష్ రావు వివరణ ఇచ్చారు. కేటీఆర్ సైలెంట్ గా కూడా ఉండకుండా.. ఆ పోస్టులను సమర్థిస్తున్నట్లుగా మాట్లాడటంతో కొండా సురేఖ కేటీఆర్ పై రివర్స్ ఆరోపణలు ప్రారంభించారు.