Lokesh : ఏపీ బంద్‌కు టీడీపీ పిలుపు.. ఫ్యాన్ రెక్కలు విరిచేస్తామని లోకేష్ హెచ్చరిక !
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీయిజంపై నారా లోకేష్ మండిపడ్డారు. ఫ్యాన్ రెక్కలు విరిచేస్తామని హెచ్చరించారు. బుధవారం బంద్‌కు టీడీపీ పిలుపునిచ్చింది. రాష్ట్రపతి పాలన విధించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
తెలుగుదేశం పార్టీ నేతల ఇళ్లు, కార్యాలయాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దాడులు చేయడంపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ఇప్పటి వరకూ జగన్‌ను గారు అని సంబోధించానని ఇక నుంచి శాడిస్ట్.. డ్రగ్గిస్ట్ అని సంబోధిస్తానని ప్రకటించారు. టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులకు సంబంధించి స్పందనను ఏబీపీ దేశంతో లోకేష్ మాట్లాడారు. డ్రగ్స్‌పై గంజాయిపై మాట్లాడినందుకు టీడీపీ ఆఫీసులపై వైసీపీ దాడి చేస్తోంది. ఇలాంటి దాడులతో తాము అధైర్యపడబోమన్నారు లోకేష్. డ్రగ్స్, గంజాయిపై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తాం. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ సమస్యే కాదు. మొత్తం దేశానికి సంబంధించిన సమస్య కాబట్టి ఈ అంశంపై టీడీపీ పోరాటం కొనసాగిస్తుందని ప్రకటించారు.
తర్వాత సోషల్ మీడియాలోనూ తన స్పందనను పోస్ట్ చేశారు. అన్ని ఆనవాయితీలను బ్రేక్ చేసి.. ప్రజాస్వామ్యానికి పాతరేశారని.. టీడీపీ కార్యకర్తలు ఫ్యాన్ రెక్కలు విరిచి రాష్ట్రం నుంచి తరిమికొడతారని హెచ్చరించారు.
పరిపాలించమని ప్రజలు అధికారం అందిస్తే... పోలీసుల అండతో మాఫియా సామ్రాజ్యం నడుపుతావా? టిడిపి కేంద్రకార్యాలయాలపై గూండా మూకలతో దాడులకు తెగబడతావా? ఎన్నాళ్లిలా ఇంట్లో దాక్కుని నీ కుక్కలతో దాడులు చేయిస్తావు! నువ్వే రా తేల్చుకుందాం.(2/4)#YCPTerroristsAttack
— Lokesh Nara (@naralokesh) October 19, 2021
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడులతో ఏపీలో శాంతిభద్రతలు దిగజాయని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. బుధవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. తక్షణం ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు.
ఇదే నీ నిజ స్వరూపమా? నీ అరాచకాలు బయటపెడితే నీ వైసీపీ రౌడీ మూకలను ఉసిగొల్పి ఏపీ వ్యాప్తంగా తెలుగుదేశం కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులు చేయిస్తావా? పోలీసు వ్యవస్థ ఏం చేస్తోంది? ఏ మత్తులో జోగుతోంది?#YCPTerroristsAttack #DemocracyAttackedInAP #GoondaRajInAP pic.twitter.com/zcW9uvtZkt
— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) October 19, 2021