అన్వేషించండి

Power Point : ప్రజలకు కోతలు విధించి ఎక్స్ఛేంజీలలో కరెంట్ అమ్మకం .. కొన్ని రాష్ట్రాలపై కేంద్రం ఆగ్రహం !

ప్రజలకు కరెంట్ కోతలు విధించి కరెంట్‌ను ఎక్స్ఛేజీలలో అమ్ముకుంటున్నారని కొన్ని రాష్ట్రాలపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి రాష్ట్రాలకు అదనపు విద్యుత్ ఇవ్వబోమని స్పష్టం చేసింది.


దేశంలో పలు రాష్ట్రాలు విద్యుత్ సంక్షోభంలో కూరుకుపోవడంపై కేంద్రం దృష్టి పెట్టింది. బొగ్గు సరఫరాను పెంచేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐదు రోజులకు సరి పడా ఉండేలా ప్రతి రాష్ట్రానికి బొగ్గు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో కొన్ని రాష్ట్రాలు విద్యుత్ ను బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటున్న విషయం కేంద్రం దృష్టికి వెళ్లింది. దీంతో ఆయా రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఎవరికైనా మిగులు విద్యుత్ ఉంటే ఇతర రాష్ట్రాలకు ఇవ్వాలి కానీ అత్యధిక రేటుకు పవర్ ఎక్స్ఛేంజ్‌లలో అమ్మడం కరెక్ట్ కాదని హెచ్చరించింది. అలాగే కొన్ని  రాష్ట్రాలు ప్రజలకు కోత విధించి మరీ అమ్ముకుంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

Also Read : గుడ్ న్యూస్.. పిల్లలకు టీకా.. కొవాగ్జిన్ వ్యాక్సిన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

దేశంలో కరెంట్ సంక్షోభంపై కేంద్రం సీరియస్‌గా దృష్టి కేంద్రీకరించింది. ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఇప్పటికే నేరుగా ప్రధానమంత్రికి లేఖ రాశారు. ఈ క్రమంలో పరిస్థితిని చక్కదిద్డానికి కేంద్రం సిద్ధమయింది. ముందుగా రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది.  కేంద్రం వద్ద ఉన్న కేటాయించని విద్యుత్ వాడుకోవాలని ఆఫర్ ఇచ్చింది. అదే సమయంలో కొన్ని రాష్ట్రాలు అధిక ధరలకు విద్యుత్ విక్రయిస్తున్నాయిని... వినియోగదారులకు ఇవ్వకుండా విద్యుత్ అమ్ముకోకూడదని స్పష్టం చేసింది.ఎక్కువ ధర కోసం విద్యుత్ అమ్ముకునే రాష్ట్రాలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అలా చేస్తే కేటాయించని విద్యుత్ వాడుకునే వెసులుబాటు తొలగిస్తామని హెచ్చరించింది. 

Also Read : తెలంగాణలో కలిసేందుకు మహారాష్ట్ర, కర్ణాటక సరిహ్దదు ప్రాంతాల ఆసక్తి ! కారణం ఏమిటంటే ?

విద్యుత్ సరఫరా బాధ్యత డిస్ట్రిబ్యూషన్ కంపెనీలదే నని..మిగులు ఉన్న రాష్ట్రాలు ఆ విషయం కేంద్రానికి తెలియచేయాలని ఆదేశించింది.  మిగులు ఉన్న రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలకు సాయం చేయాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం పవర్ ఎక్స్ఛేంజీలో విద్యుత్ రేటు చాలా ఎక్కువగా ఉంది. ఈ కారణంగా కొన్ని రాష్ట్రాలు తమ ప్రజలకు కరెంట్ కోతలు విధించి మరీ అమ్ముకుంటున్నాయి. ఈ విషయం తెలిసి కేంద్రం తాజా హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. 


Also Read : టీఆర్ఎస్‌కు ఆదాయం ఎక్కువ.. టీడీపీకి ఖర్చెక్కువ ! ప్రాంతీయ పార్టీల జమాఖర్చుల్లో చిత్రాలెన్నో !

దేశంలో బొగ్గు కొరత లేదని.. కరెంట్ సంక్షోభం రానే రాదని కేంద్రం చెబుతోంది. కానీ కొన్ని రాష్ట్రాలు మాత్రం బీద అరుపులు అరుస్తూనే ఉన్నాయి. బొగ్గుకు డబ్బులు కట్టకపోవడం వల్ల కొందరికి.. ఆలస్యం అవుతోంది. అయితే బకాయిలు చెల్లించకపోయినా బొగ్గు సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించింది. కరెంట్ సంక్షోభం కారణంగా రాష్ట్రాలకు కేంద్రం చేసిన హెచ్చరికలు హాట్ టాపిక్ అవుతున్నాయి. 

Also Read : "మా"లో చీలిక తప్పదా ? వివాదాస్పద ప్రకటనలు, రాజీనామాలు ఏ తీరానికి చేరబోతున్నాయి ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nirmal Crime News: నిర్మల్ జిల్లాలో ఫ్రిడ్జ్‌లో మంటలు చెలరేగి ఇద్దరి మృతి.. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నిర్మల్ జిల్లాలో ఫ్రిడ్జ్‌లో మంటలు చెలరేగి ఇద్దరి మృతి.. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Who is Ashok Sharma: ఐపీఎల్ 2026లో ఫాస్టెస్ట్ బాల్ వేసిన అశోక్ శర్మ.. ఎవరీ కొత్త బౌలింగ్ సంచలనం
ఐపీఎల్ 2026లో ఫాస్టెస్ట్ బాల్ వేసిన అశోక్ శర్మ.. ఎవరీ కొత్త బౌలింగ్ సంచలనం
Macherla Honor Killing: మాచర్ల పరువుహత్య కేసు.. బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించిన సీఐపై సస్పెన్షన్ వేటు
మాచర్ల పరువుహత్య కేసు.. బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించిన సీఐపై సస్పెన్షన్ వేటు
Iran-US War: అమెరికా దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్లు హతం.. రెండో US పైలట్ సేఫ్: డొనాల్డ్ ట్రంప్
అమెరికా దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్లు హతం.. రెండో US పైలట్ సేఫ్: డొనాల్డ్ ట్రంప్

వీడియోలు

TVK Vijay Puducherry Campaign | పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో విజయ్ కి ఫ్యాన్స్ గిఫ్ట్స్ | ABP Desam
Virat Kohli Nags Interview RCB IPL 2026 | ఐపీఎల్ రూల్స్ విరుద్ధంగా ఆడేస్తున్న ఆర్సీబీ | ABP Desam
Priyansh Arya 39 vs CSK IPL 2026 | పవర్ ప్లే లో రఫ్పాడించి మ్యాచ్ ను పంజాబ్ వైపు తిప్పేశాడు | ABP Desam
Sanju Samson Failures CSK IPL 2026 | తొలి రెండు మ్యాచుల్లోనూ సంజూ విఫలం | ABP Desam
CSK vs PBKS Match Highlights IPL 2026 | సీఎస్కేపై 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nirmal Crime News: నిర్మల్ జిల్లాలో ఫ్రిడ్జ్‌లో మంటలు చెలరేగి ఇద్దరి మృతి.. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నిర్మల్ జిల్లాలో ఫ్రిడ్జ్‌లో మంటలు చెలరేగి ఇద్దరి మృతి.. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Macherla Honor Killing: మాచర్ల పరువుహత్య కేసు.. బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించిన సీఐపై సస్పెన్షన్ వేటు
మాచర్ల పరువుహత్య కేసు.. బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించిన సీఐపై సస్పెన్షన్ వేటు
AP High Court on Temples: విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు గర్భాలయ ప్రవేశం నిషిద్ధం: ఏపీ హైకోర్టు
విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు గర్భాలయ ప్రవేశం నిషిద్ధం: ఏపీ హైకోర్టు
Who is Ashok Sharma: ఐపీఎల్ 2026లో ఫాస్టెస్ట్ బాల్ వేసిన అశోక్ శర్మ.. ఎవరీ కొత్త బౌలింగ్ సంచలనం
ఐపీఎల్ 2026లో ఫాస్టెస్ట్ బాల్ వేసిన అశోక్ శర్మ.. ఎవరీ కొత్త బౌలింగ్ సంచలనం
Iran-US War: అమెరికా దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్లు హతం.. రెండో US పైలట్ సేఫ్: డొనాల్డ్ ట్రంప్
అమెరికా దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్లు హతం.. రెండో US పైలట్ సేఫ్: డొనాల్డ్ ట్రంప్
Shweta Basu Prasad Re Entry : కొత్త బంగారు లోకం హీరోయిన్ రీ ఎంట్రీ - హీరో ఎవరో తెలుసా?
కొత్త బంగారు లోకం హీరోయిన్ రీ ఎంట్రీ - హీరో ఎవరో తెలుసా?
Smartwatch Buying Tips : స్మార్ట్‌వాచ్ కొనేముందు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే.. ఈ ఫీచర్లు మిస్ అవ్వకండి
స్మార్ట్‌వాచ్ కొనేముందు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే.. ఈ ఫీచర్లు మిస్ అవ్వకండి
Khanapur Municipal Chairman: ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో గందరగోళం.. ఆదివారానికి వాయిదా 
ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో గందరగోళం.. ఆదివారానికి వాయిదా 
Embed widget