(Source: ECI/ABP News/ABP Majha)
Covaxin for Children: గుడ్ న్యూస్.. పిల్లలకు టీకా.. కొవాగ్జిన్ వ్యాక్సిన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
Covaxin approved for Childrens: చిన్న పిల్లల కరోనా టీకాకు డీసీజీఐ ఆమోదం తెలిపింది. త్వరలోనే 2-18 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్ అందనుంది.
దేశంలో చిన్నారులకు శుభవార్త చెప్పింది కేంద్రం. 18 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. భారత్ బయోటెక్ చిన్నారుల కోసం రూపొందించిన 'కొవాగ్జిన్' టీకాకు డీసీజీఐ ఆమోదం పలికింది. అయితే 18 ఏళ్లు నిండిన వారికి ఇచ్చే డోసు కన్నా ఇది తక్కువగా ఉంటుందని తెలుస్తోంది.
Subject Expert Committee (SEC) has given a recommendation to DCGI (Drugs Controller General of India) for the use of BharatBiotech's Covaxin for 2-18 year olds: Official sources
— ANI (@ANI) October 12, 2021
భారత్ బయోటెక్ చిన్నారుల కోసం రూపొందించిన 'కొవాగ్జిన్' తుది (రెండు, మూడు) దశ ప్రయోగాలు ఇటీవలే పూర్తయ్యాయి. ఈ ప్రయోగాల సమాచారాన్ని భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI)కు ఇటీవలే అందజేసింది సంస్థ.
ఉత్పత్తి రెట్టింపు..
కరోనా మూడో వేవ్ భయాల కారణంగా వీలైనంత మందికి వ్యాక్సిన్ అందేలా తాము కృషి చేస్తున్నట్లు ఇప్పటికే బయోటెక్ సంస్థ వెల్లడించింది. కొవాగ్జిన్ టీకా ఉత్పత్తిని గణనీయంగా పెంచినట్లు భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా తెలిపారు.
సెప్టెంబర్ నెలలో 3.5 కోట్ల డోసులను ఉత్పత్తి చేశామన్నారు. అక్టోబర్‌లో వీటి సంఖ్య 5.5 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. ఒకవేళ ఇతర భాగస్వామ్య సంస్థలు తయారీని ప్రారంభిస్తే వీటి సంఖ్యను నెలకు 10 కోట్ల డోసుల ఉత్పత్తి సాధ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు.
సమర్థవంతంగా..
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రోజుకో కొత్త వేరియంట్‌తో కరోనా ప్రపంచాన్ని భయపెడుతోంది. డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లు విజృంభిస్తున్నాయి. వ్యాక్సిన్ వేసుకున్నా కూడా కొంతమందికి కరోనా రావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే డెల్టా ప్లస్ వేరియంట్‌పై కొవాగ్జిన్ సమర్థవంతంగా పని చేస్తోందని ఇటీవల చేసిన అధ్యయనంలో తేలినట్లు ఐసీఎంఆర్ ఇటీవల స్పష్టం చేసింది. కొవాగ్జిన్.. దేశీయంగా తయారైన తొలి కరోనా టీకా. ఇప్పటికే పలు దేశాలకు కొవాగ్జిన్ టీకా ఎగుమతి అవుతుంది.
ఐకాల్ ఎన్18 కాలింగ్ ట్యాబ్లెట్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫ్యూజన్5 4జీ ట్యాబ్లెట్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి