Shraddha Murder Case: మనసు మార్చుకున్న అఫ్తాబ్- బెయిల్ పిటిషన్ ఉపసంహరణ
Shraddha Murder Case: శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ తన బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నాడు.
Shraddha Murder Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆమె ప్రియుడు అఫ్తాబ్ పూనవాలా మనసు మార్చుకున్నాడు. తనకు బెయిల్ మంజూరు చేయాలని వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నాడు. ఈ మేరకు గురువారం కోర్టుకు తెలిపాడు. అఫ్తాబ్‌యే బెయిల్ వద్దని చెప్పడంతో దిల్లీ సాకేత్ కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.
కోర్టు ముందు
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరైన అఫ్తాబ్ తాను డిసెంబరు 15న కోర్టులో వేసిన తన బెయిల్ అభ్యర్థనను ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నానని తెలిపాడు. దీనిపై శ్రద్ధా తండ్రి తరపున వాదిస్తున్న న్యాయవాది సీమా కుష్సహా మాట్లాడారు.
Delhi |Chargesheet not filed yet but Aftab's bail application filed. Aftab denied giving permission to his advocate to file for bail. His advocate should have stood for humanity first&then for a criminal. However,today he withdrew the bail application:Shraddha's father's advocate pic.twitter.com/4b0ZjdaTNQ
— ANI (@ANI) December 22, 2022
ఈ హత్య కేసులో నవంబరు 12న అరెస్ట్ అయిన అఫ్తాబ్ ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నాడు. కోర్టు డిసెంబరు 9న అఫ్తాబ్ కస్టడీ 14 రోజులు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
పోలీస్ విచారణ
ఈ కేసు దర్యాప్తులో పురోగతి గురించి స్పెషల్ పోలీస్ కమిషనర్ సాగర్ ప్రీత్ హూడా మాట్లాడారు.
Also Read: Indo-China Border Standoff: తవాంగ్ ఘర్షణ తర్వాత తొలి భేటీ- చైనాతో భారత్ చర్చలు సఫలమా?