అన్వేషించండి

Sharmila Dalit Agenda : ఇక షర్మిల పార్టీ దళిత భేరీలు ! తెలంగాణలో రాజకీయం అంతా దళితుల చుట్టే !

నిరుద్యోగ ఎజెండానే ఇప్పటి వరకూ అందుకున్న షర్మిల పార్టీ ఇప్పుడు దళిత ఎజెండాతో పోరాటాలు చేయాలని నిర్ణయించుకుంది. దళితభేరీ సభలను ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.


తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ దళిత ఎజెండాను ఎంచుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత,  సీఎం కేసీఆర్ ఇప్పటికే పూర్తి స్థాయిలో దళిత వాదం వినిపిస్తున్నారు. వారి కోసం దళిత బంధు లాంటి పథకాన్ని ప్రవేశపెట్టారు.  టీఆర్ఎస్‌కు పోటీగా కాంగ్రెస్ దళిత, గిరిజన దండోరా సభలతో ప్రజల ముందుకు వెళ్తోంది. తాజాగా తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకు వస్తామంటున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కూడా దళిత పోరాటాలు ప్రారంభించారు.  ప్రతి మంగళవారం ఉద్యోగ దీక్షలు చేస్తున్నట్లుగానే దళితుల కోసం కూడా పోరుబాట పట్టాలని నిర్ణయించుకున్నారు.  అందుకోసం " వైఎస్ఆర్ దళిత భేరీ " కార్యక్రమానికి రూపకల్పన చేశారు.
Sharmila Dalit Agenda : ఇక షర్మిల పార్టీ దళిత భేరీలు ! తెలంగాణలో రాజకీయం అంతా దళితుల చుట్టే !

Also Read : షర్మిలను వైఎస్ ఆత్మీయులు ఒంటరి చేశారా..?

ముందుగా  సెప్టెంబ‌ర్ 12వ తేదీన‌ ఆదివారం రోజు సూర్య‌పేట జిల్లా, తుంగ‌తుర్తి నియోజ‌క‌వ‌ర్గం తిరుమ‌ల‌గిరి మండ‌లకేంద్రంలో "వైఎస్ఆర్ ద‌ళిత భేరి" బ‌హిరంగ స‌భ  నిర్వహించాలని నిర్ణయించారు. ఈ బహిరంగసభ పోస్టర్లను ఆ పార్టీ నేత ఏపూరి సోమన్న ఆవిష్కరించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన దళితులకు.. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత అన్యాయం జరుగుతోందని వైఎస్ఆర్ టీపీ భావిస్తోంది.  సీఎం కేసీఆర్ రాజ‌కీయ ల‌బ్ధి కోస‌మే హుజూరాబాద్ ఉప ఎన్నికలో ద‌ళితుల‌ను వాడుకుంటున్నారని.. ఏడేళ్లుగా ఏ మేలు చేయని వారు ఇప్పుడు దళిత బంధు పేరుతో హడావుడి చేస్తున్నారని వైఎస్ఆర్ టీపీ పార్టీ విమర్శిస్తోంది.  కేసీఆర్ ఎన్నిక‌ల స‌మ‌యంలో ద‌ళితుల‌కు ఇస్తామ‌న్న‌ మూడెక‌రాల భూమి, ఎస్సీ కార్పొరేష‌న్ లోన్లు జాడ లేకుండా పోయాయని ఆ పార్టీ నేతలు విమర్శించారు.
Sharmila Dalit Agenda : ఇక షర్మిల పార్టీ దళిత భేరీలు ! తెలంగాణలో రాజకీయం అంతా దళితుల చుట్టే !

 దేశంలోనే ద‌ళితుల‌ను నిట్ట‌నిలువునా ముంచింది ఎవ‌రైనా ఉన్నారంటే అది కేసీఆర్ మాత్ర‌మేనని ఈ విషయాన్ని దళితులందరికీ తెలియచేస్తామని షర్మిల పార్టీ నేతలు చెబుతున్నారు.  గ‌తంలో ప్ర‌భుత్వం చెప్పిన విధంగా ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమికి డ‌బ్బులు క‌ట్టిచ్చి, ద‌ళిత‌బంధుతో క‌లిపి ప్ర‌తి ద‌ళిత కుటుంబానికి రూ.50 ల‌క్ష‌లు చెల్లించాల‌ని వైఎస్ఆర్‌టీపీ డిమాండ్ చేసింది.   ద‌ళితుల చైత‌న్యం కోసం అనేక ఏళ్లుగా ప‌ని చేస్తున్న‌టువంటి గొప్ప నాయ‌కులు, మేధావులు, ప్రొఫెసర్లు, జ‌ర్న‌లిస్టులు దళిత భేరీ సభలో పాల్గొనే  అవకాశం ఉంది.

Also Read : హుజురాబాద్ టిక్కెట్ అడగనంటోన్న కొండా సురేఖ

తుంగతుర్తి సభ తర్వాత రిజర్వుడు నియోజకవర్గాలన్నింటిలోనూ సభలు పెట్టాలన్న ఆలోచనలో వైఎస్ఆర్‌టీపీ ఉంది. తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ దళితులను ఆకట్టుకోవడానికి పథకాలు.. పోరాటాలు చేస్తూండటంతో ఇక నుంచి దళిత వాదమే తెలంగాణలో వినిపించే అవకాశం కనిపిస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Trump Warns Iran: హర్మూజ్ తెరిచేందుకు ఇరాన్‌కు ట్రంప్ 48 గంటల గడువు.. విధ్వంసం తప్పదని వార్నింగ్
హర్మూజ్ తెరిచేందుకు ఇరాన్‌కు ట్రంప్ 48 గంటల గడువు.. విధ్వంసం తప్పదని వార్నింగ్
IPL 2026 RR Vs GT Latest Updates: జురేల్, జైస్వాల్ జోరు.. రాజ‌స్థాన్ భారీ స్కోరు.. ఆకట్టుకున్న ర‌బాడ‌, బోణీ కోసం టైటాన్స్ ఆరాటం
జురేల్, జైస్వాల్ జోరు.. రాజ‌స్థాన్ భారీ స్కోరు.. ఆకట్టుకున్న ర‌బాడ‌, బోణీ కోసం టైటాన్స్ ఆరాటం
YS Jagan: మీడియాపై జగన్ వ్యాఖ్యలు 'గురివింద గింజ' సామెతను గుర్తుచేస్తున్నాయి: ఐజేయూ
మీడియాపై జగన్ వ్యాఖ్యలు 'గురివింద గింజ' సామెతను గుర్తుచేస్తున్నాయి: ఐజేయూ
Khanapur Municipal Chairman: ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో గందరగోళం.. ఆదివారానికి వాయిదా 
ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో గందరగోళం.. ఆదివారానికి వాయిదా 

వీడియోలు

TVK Vijay Puducherry Campaign | పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో విజయ్ కి ఫ్యాన్స్ గిఫ్ట్స్ | ABP Desam
Virat Kohli Nags Interview RCB IPL 2026 | ఐపీఎల్ రూల్స్ విరుద్ధంగా ఆడేస్తున్న ఆర్సీబీ | ABP Desam
Priyansh Arya 39 vs CSK IPL 2026 | పవర్ ప్లే లో రఫ్పాడించి మ్యాచ్ ను పంజాబ్ వైపు తిప్పేశాడు | ABP Desam
Sanju Samson Failures CSK IPL 2026 | తొలి రెండు మ్యాచుల్లోనూ సంజూ విఫలం | ABP Desam
CSK vs PBKS Match Highlights IPL 2026 | సీఎస్కేపై 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Khanapur Municipal Chairman: ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో గందరగోళం.. ఆదివారానికి వాయిదా 
ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో గందరగోళం.. ఆదివారానికి వాయిదా 
IPL 2026 RR Vs GT Latest Updates: జురేల్, జైస్వాల్ జోరు.. రాజ‌స్థాన్ భారీ స్కోరు.. ఆకట్టుకున్న ర‌బాడ‌, బోణీ కోసం టైటాన్స్ ఆరాటం
జురేల్, జైస్వాల్ జోరు.. రాజ‌స్థాన్ భారీ స్కోరు.. ఆకట్టుకున్న ర‌బాడ‌, బోణీ కోసం టైటాన్స్ ఆరాటం
Basra Development: బాసర ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు - సోమవారం పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
బాసర ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు - సోమవారం పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
Tiger In Polavaram: వీడియోలు తీస్తుంటే వెనక్కి తగ్గిన పెద్దపులి: పోలవరం నిర్వాసిత గ్రామాల్లో హై అలర్ట్!
వీడియోలు తీస్తుంటే వెనక్కి తగ్గిన పెద్దపులి: పోలవరం నిర్వాసిత గ్రామాల్లో హై అలర్ట్!
Tyson Naidu OTT : టైసన్ నాయుడుకు బిగ్ ఓటీటీ డీల్! - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లోనే...
టైసన్ నాయుడుకు బిగ్ ఓటీటీ డీల్! - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లోనే...
Telugu Desam Party:'గీత దాటితే సస్పెండ్ చేస్తా'' మరోసారి అధినేత వార్నింగ్‌'! మాకు నమ్మకం లేదు 'బాబు' అంటున్న తమ్ముళ్లు!
'గీత దాటితే సస్పెండ్ చేస్తా'' మరోసారి అధినేత వార్నింగ్‌'! మాకు నమ్మకం లేదు 'బాబు' అంటున్న తమ్ముళ్లు!
Gajwel Attack: రేవంత్ ఫోటో లేదని గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుపై ఎటాక్ - రౌడీ రాజ్యమని బీఆర్ఎస్ ఆగ్రహం
రేవంత్ ఫోటో లేదని గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుపై ఎటాక్ - రౌడీ రాజ్యమని బీఆర్ఎస్ ఆగ్రహం
IPL 2026 DC Vs MI Result Update: ఢిల్లీకి వ‌రుస‌గా రెండో విజ‌యం.. ముంబైని చిత్తు చేసిన క్యాపిట‌ల్స్, రాణించిన రిజ్వి, నిస్సాంక‌, MI కి నిరాశ‌
ఢిల్లీకి వ‌రుస‌గా రెండో విజ‌యం.. ముంబైని చిత్తు చేసిన క్యాపిట‌ల్స్, రాణించిన రిజ్వి, నిస్సాంక‌, MI కి నిరాశ‌
Embed widget