Ratan Tata : రతన్ టాటా వీలునామాలో శంతనునాయడు పేరు - ఎన్ని ఆస్తులు రాసిచ్చారంటే ?
Tata : రతన్ టాటా వీలునామాలో శంతనునాయుడు పేరు కూడా ఉంది. ఆయనతో పాటు పెంపుడు కుక్కకు, పనిమనిషికి కూడా ఆస్తులు రాశారు రతన్ టాటా.
Shantanunaidu name also appears in Ratan Tata will: రతన్ టాటా రాసిన వీలునామా వెలుగులోకి వచ్చింది. ఆయన ఆస్తులన్నీ టాటా ట్రస్టులకే రాసిచ్చారు కానీ తనతో పాటు ఉన్న వారికి పలు చేసేలా పలు నిర్ణయాలు తీసుకున్నారు. చివరి రోజుల్లో తనకు స్నేహితుడిగా ఉన్న శంతను నాయుడిని రతన్ టాటా మర్చిపోేదు. ఆయన భవిష్యత్ చదువులకు అయ్యే మొత్తాన్ని కేటాయించారు. శంతనునాయుడు స్టార్టప్ ‘గుడ్‌ఫెలోస్’లో రతన్ టాటా తన వాటాను వదులుకున్నారు. అవన్నీ శంతను నాయుడికే దక్కుతాయి. పిల్లలు పట్టించుకోని వృద్ధులకు సేవ చేసేందుకు ఏర్పాటు చేసిన సంస్థే గుడ్ ఫెలోస్.
శంతను విదేశీ విద్య రుణాన్నీ తీర్చాలని రతన్ టాటా నిర్ణయం
దీనితో పాటు శంతను విదేశీ విద్య కోసం తీసుకున్న లోన్ కూడా టాటా మాఫీ చేశారు. రతన్ టాటా సంపదలో ఎక్కువ భాగం టాటా సన్స్, టాటా గ్రూప్ వివిధ కంపెనీలలో ఆయన వాటాను టాటా ట్రస్ట్‌కు బదిలీ చేయాలని పొందుపరిచారు. పెంపుడు శునకం జర్మన్ షెపర్డ్ "టిటో" కొసం కొంత వాటాను కేటాయించారు రతన్ టాటా. జీవితకాల సంరక్షణ కోసం ఆ వాటాను కేటాయించారు. రతన్ టాటా చనిపోయినప్పుడు ఆ శునకం మృతదేహం వద్ద కన్నీరు పెట్టడం అందర్నీ కలచివేసేలా చేసింది.
తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రియాంక గాంధీ, వయనాడ్ ప్రజలను ఉద్దేశించి లేఖ విడుదల
పలువురు సేవలకు పలు రకాల ప్రయోజనాలు
రతన్ టాటా చిరకాల కుక్ రాజన్ షా.. టిటో బాధ్యతలు చూసుకుంటారు. ఇదే సమయంలో... టాటా ఫౌండేషన్, తన సోదరుడు జిమ్మీ టాటా, సవతి సోదరీమణులు షిరీన్, జీనా జీజాభోయ్ లతోపాటు హౌస్ సిబ్బంది, ఇతరులకు ఆస్తులను కేటాయించారు. పని మనిషి సుబ్బయ్యకు కూడా కొంత మొత్తాన్నితన వీలునామాలో కేటాయించారు. రతన్ టాటా అంతిమ కోరికలను నెరవేర్చేందుకు ఆయన సవతి సోదరీమణులు షిరీన్, డీన్నా జెజీబోయ్, దీర్ఘకాల సహచరుడు మెహ్లీ మిస్త్రీ లతోపాటు న్యాయవాది డారియస్ ను నియమించారు.
పెళ్లి చేసుకోని రతన్ టాటా
రతన్ టాటా పెళ్లి చేసుకోలేదు. దాంతో ఆయనకు చట్టబద్ధ వారసులుగా లేరు. వ్యక్తిగత ఆస్తి పదివేల కోట్ల వరకూ మాత్రమే ఉంటుంది. మిగతా మొత్తాన్ని ఎప్పటికప్పుడు టాటా ట్రస్టులకు కేటాయించేవారు. ఇప్పుడు కూడా వ్యక్తిగత ఆస్తులు మాత్రమే.. సోదరులు, వారి కుటుంబసభ్యులకు ఇచ్చారు కానీ షేర్లు మళ్లీ టాటా ట్రస్ట్ కే కేటాయించినట్లగా విల్ నిరూపిస్తోంది. ఈ విల్ అమల్లోకి రావడానికి కొంత కాలం పడుతుంది. న్యాయపరమైన చర్యలు చేపట్టాడానికి లీగల్ గా బాధ్యతలు ఇచ్చిన వారు చర్యలు తీసుకుంటారు.