అన్వేషించండి

Top Headlines Today 7th September 2024 :దేశ వ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు, వరద భయంతో పండగకు విజయవాడ దూరం వంటి మార్నింగ్ న్యూస్

7th September 2024 News Headlines Today: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తాజా వార్తల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఇది మీ స్కూల్ అసెంబ్లీలో చదవడానికి పనికొస్తాయి.

7th September 2024 News Headlines:
నేటి ప్రత్యేకత: 
  • నేడే వినాయక చవితి. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయక చవితి. భాద్రపద మాసం శుక్లపక్ష చవితి రోజున దేశవ్యాప్తంగా ఈ పండగను ప్రజలు జరుపుకొంటారు. ఉదయం నిద్ర లేచి, స్నానం చేసి మడి కట్టుకుని ఇంటిలోని గుడిని శుభ్రం చేసుకోవాలి. చవితి రోజు ఉపవాసం ఉంటే కుటుంబంలో సంతోషం కూడా పెరుగుతుంది. వినాయకునికి ఇష్టమైన మోదకాలు, ఉండ్రాళ్ళు వంటివి నైవేద్యంగా సమర్పించాలి. పూర్తి వివరాల  కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రతీ వీధిలోనూ గణనాథుడిని కొలువుదీరుస్తున్నారు. వినాయక మండపాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, సినీ ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మీరు కూడా మీ స్నేహితులకు ఇలా శుభాకాంక్షలు చెప్పండిలా
 
ఆంధ్ర పదేశ్ వార్తలు:
 
  • కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు సాయం చేసిందనే వార్తలు అవాస్తవమని సీఎం చంద్రబాబు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల కోసం కేంద్రం తెలంగాణ, ఏపీకి రూ.3,300 కోట్లు విడుదల చేసిందని ప్రచారం జరుగుతోంది. అయితే వరద సాయంపై తమకు ఇంకా ఎలాంటి సమాచారం రాలేదని సీఎం వెల్లడించారు. తాము ఇంకా వరదనష్టంపై నివేదిక పంపించలేదన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
  • విజయవాడను మళ్లీ వరద భయం వెంటాడుతోంది. నిన్నరాత్రి ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి సింగ్‌నగర్, విద్యాధరపురం, భవానీపురం, రాజరాజేశ్వరిపేట, గ్రామీణంలో అంబాపురం, జక్కంపూడి కాలనీ, రాయనపాడు, నైనవరం గ్రామాల్లో ఒక అడుగు నుంచి రెండు అడుగుల మేర నీరు పెరిగింది. దీంతో అధికారులు, ప్రజలు ఆందోళనకు గురయ్యారు. వినాయక చవితి సరదా లేకుండా చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
  • ప్రకాశం బ్యారేజ్‌ వద్ద జరిగిన పడవ ప్రమాదాల వెనుక కుట్ర కోణం ఉందని ప్రభుత్వం అనుమానిస్తోంది. అందుకే దీనిపై దర్యాప్తు జరిపేందుకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
తెలంగాణ వార్తలు :
  • తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా 29 జిల్లాలను వరద బాధిత జిల్లాలుగా ప్రకటిస్తున్నట్లు CS శాంతి కుమారి తెలిపారు. ఇప్పటికే నాలుగు జిల్లాల కలెక్టర్లకు నిధులు విడుదల చేశామని, మిగిలిన 25 జిల్లాలకు రూ.3 కోట్ల చొప్పున సంబంధిత జిల్లా కలెక్టర్లకు నిధులను విడుదల చేస్తామని పేర్కొన్నారు. వర్షాలతో ఇప్పటి వరకు 29 మంది మరణించారని CS తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
  • విద్యుత్ శాఖలో లంచాలు నిర్మూలించేలా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖి చర్యలు తీసుకున్నారు. సంస్థకు చెందిన సిబ్బంది లేదా అధికారులు లంచం అడిగితే 040 - 2345 4884 కు గాని లేదా 7680901912 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి 
  • తెలంగాణలో జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ-2024 పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల తుది ఆన్సర్ కీని సెప్టెంబరు 6న విడుదల చేశారు. సబ్జెక్టులవారీగా ఫైనల్ ఆన్సర్ కీని వెబ్‌సైట్‌లో ఉంచారు. 11,062 టీచర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
  • తెలంగాణ ప్రభుత్వం పలు కమిషన్లకు ఛైర్మన్లను నియమించింది. రాష్ట్ర విద్యా కమిషన్‌ ఛైర్మన్‌గా ఆకునూరి మురళి, బీసీ కమిషన్‌ ఛైర్మన్‌గా జి. నిరంజన్‌, వ్యవసాయ కమిషన్‌ ఛైర్మన్‌‌గా కోదండరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ కమిషన్‌ సభ్యులుగా రాపోలు జయప్రకాశ్‌, తిరుమలగిరి సురేందర్‌, బాల లక్ష్మిని నియమించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి 

జాతీయ వార్తలు: 

  •    హర్యాణా అసెంబ్లీ ఎన్నికల బరిలో ఆప్ ఒంటరిగానే బరిలోకి దిగాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలలో ఆప్ సత్తా చాటలేదు. దీంతో హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్.. ఆప్‌కు కేవలం 5-6 సీట్లు మాత్రమే ఇవ్వడానికి సిద్ధమైంది. అయితే ఆప్ 10 సీట్లు కోరింది. పొత్తు కుదరకపోవడంతో ఒంటరిగానే బరిలోకి దిగాలని ఆప్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్‌లో స్పోర్ట్స్ స్టార్‌ ఫోగట్ చేరారు.  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

 సినిమా వార్తలు: 

  • దేవర మూవీ ఎన్టీఆర్ కెరీర్ లోనే మోస్ట్ అవెయిటింగ్ మూవీగా ఈ నెల 27న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాపై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. దేవర సినిమా నుంచి వచ్చిన లేటెస్ట్ సాంగ్ 'దావూదీ'ని కూడా కొంత మంది వపరీతంగా విమర్సిస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ స్టెప్స్ ని తమిళ్ హీరో విజయ్ సాంగ్ తో కంపేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. . పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Google Office In Andhra Pradesh: విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
Mohan Babu Attack On Media: గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
Google Trending Searches: 2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
Mokshagna Debut Movie: వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mohan babu Audio on Manchu Manoj | నా గుండెల మీద తన్నావ్ రా మనోజ్ | ABP DesamMohan babu Attack Media | మీడియా ప్రతినిధిని దారుణంగా కొట్టిన మోహన్ బాబు | ABP DesamManchu Mohan babu Attack | కొడుకును, మీడియాను తరిమి కొట్టిన మోహన్ బాబు | ABP Desamముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Google Office In Andhra Pradesh: విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
Mohan Babu Attack On Media: గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
Google Trending Searches: 2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
Mokshagna Debut Movie: వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
Prakasam District News: బ్రెయిన్ ట్యూమర్‌ తగ్గాలని 40 రోజులపాటు చర్చిలో ప్రార్థనలు- బాలిక మృతి- ప్రకాశం జిల్లాలో దారుణం
బ్రెయిన్ ట్యూమర్‌ తగ్గాలని 40 రోజులపాటు చర్చిలో ప్రార్థనలు- బాలిక మృతి- ప్రకాశం జిల్లాలో దారుణం
PAN 2.0 - Aadhaar: పాన్ 2.0 కార్డ్‌ను కూడా ఆధార్‌తో లింక్ చేయాలా, సర్కారు ఏం చెప్పింది?
పాన్ 2.0 కార్డ్‌ను కూడా ఆధార్‌తో లింక్ చేయాలా, సర్కారు ఏం చెప్పింది?
RBI Governor Salary: ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ జీతం ఎంత, ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయి?
ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ జీతం ఎంత, ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయి?
Embed widget