![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Mangampeta Movie: ప్రభాస్, పవన్ విలన్స్‌తో కొత్త హీరో భారీ యాక్షన్ ఫిల్మ్ - రావణ సంహారంలో శివ తాండవం
పవన్ కల్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్' విలన్ కబీర్ దుహాన్ సింగ్, ప్రభాస్ 'బాహుబలి' విలన్ 'కాలకేయ' ప్రభాకర్ నటించిన సినిమా 'మంగంపేట'. కొత్త హీరో చంద్రహాస్‌తో భారీ యాక్షన్ ఫిల్మ్ చేసినట్టు ఉన్నారు.
![Mangampeta Movie: ప్రభాస్, పవన్ విలన్స్‌తో కొత్త హీరో భారీ యాక్షన్ ఫిల్మ్ - రావణ సంహారంలో శివ తాండవం Prabhas Baahubali Pawan Kalyan Sardaar Gabbar Singh for villains Mangampeta movie Mangampeta Movie: ప్రభాస్, పవన్ విలన్స్‌తో కొత్త హీరో భారీ యాక్షన్ ఫిల్మ్ - రావణ సంహారంలో శివ తాండవం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/07/b7d8c8220307e781ecf096855a2d0b3b1725678373633313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
గోపీచంద్ 'జిల్'తో బాలీవుడ్ యాక్టర్ కబీర్ దుహాన్ సింగ్ (Kabir Duhan Singh) తెలుగు సినిమా ఇండస్ట్రీకి విలన్‌గా ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్'తో పాటు పలు సినిమాల్లో విలన్ రోల్స్ చేశారు. ప్రభాస్ 'బాహుబలి'లో 'కాలకేయ'తో పాపులర్ అయ్యాడు ప్రభాకర్ (Kalakeya Prabhakar). ఇప్పుడు వాళ్లిద్దరూ విలన్ రోల్స్ చేసిన సినిమా 'మంగం పేట' (Mangampeta Movie). కొత్త హీరో చంద్రహాస్ కె నటించిన సినిమా గ్లింప్స్ తాజాగా విడుదలైంది.
రావణ సంహారంలో శివ తాండవం
చంద్రహాస్ కే (Chandrahaas K) కథానాయకుడిగా నటించిన 'మంగం పేట'. ఈ సినిమాలో అంకిత సాహా కథానాయిక. గౌతం రెడ్డి దర్శకుడు. భాస్కర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై గుంటక శ్రీనివాస్ రెడ్డి నిర్మించారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్ చూస్తే...
Also Read: తమ్ముడికి తారక్ (జూనియర్ ఎన్టీఆర్) వెల్కమ్... బాబాయ్ బాలకృష్ణతో గొడవాలంటూ వచ్చే పుకార్లకు చెక్!
'ఈశ్వర్... ఇరవై ఏళ్లు అయింది రా! ఊరిని చూడాలనిపిస్తుంది రా, చూపిస్తావా?' అని తల్లి అడుగుతుంది. 'కొన్ని రోజులు ఆగమ్మా... ఊరి నిండా రాక్షసులే ఉన్నారు. వాళ్లను చంపి ఊరిని చూపిస్తానమ్మా' అని కొడుకు చెబుతుంది. అప్పుడు తల్లి ఏం అంటుంది అంటే... 'చంపాల్సింది రాక్షసుల్ని కాదు... రావణున్ని' అని! అప్పుడు కబీర్ దుహాన్ సింగ్ పాత్రను పరిచయం చేశారు. 'రాముడు రాలేకపోవచ్చు... శివుడు త్రిశూలాన్ని పంపిస్తే? చేయాల్సింది యుద్ధం కాదు... శివతాండవం' అని తల్లి చెబుతుంది. 'మంగంపేట' గ్లింప్స్ చూస్తే... 80 సెకన్లు ఉంది. టీజర్ అంతా భారీ యాక్షన్ సీక్వెన్సులు ఉన్నాయి.
కొత్త హీరో మీద భారీ యాక్షన్ సినిమా తీయడం సాహసం అని చెప్పాలి. 'మంగం పేట' విజువల్స్ చూస్తే సాంకేతికంగా, డైలాగులు పరంగా ఉన్నత స్థాయిలో ఉన్నట్టు అనిపిస్తుంది. త్వరలో సినిమా విడుదల తేదీ వెల్లడిస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు.
Also Read: విజయ్ 'ది గోట్'కి సీక్వెల్... పవన్ కల్యాణ్ టైటిల్ మీద కన్నేసిన దళపతి
Mangampeta Movie Cast And Crew: చంద్రహాస్ కే, అంకిత సాహా జంటగా నటించిన 'మంగంపేట' సినిమాలో నాగ మహేష్ (రంగస్థలం, జబర్దస్త్ ఫేమ్), కబీర్ దుహాన్ సింగ్, 'కాలకేయ' ప్రభాకర్, దయానంద్ రెడ్డి, ఎస్తేర్ నోరోన్హా, పృథ్వీరాజ్, 'అడుకలం' నరేన్, సమ్మెట గాంధీ, '14 రీల్స్' నాని, ఈశ్వర్ రాజనాల, సమీర్, 'జబర్దస్త్' దొరబాబు తదితరులు ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: మానస్ చెరుకూరి - ప్రముఖ్ కొలుపోటి, నృత్య దర్శకత్వం: చంద్ర కిరణ్, పోరాటాలు: దేవరాజ్, కూర్పు: పీజేఆర్, కథ - కథనం - మాటలు: కమల్ వీవీ, ఛాయాగ్రహణం: శివన్, సంగీతం: పూనిక్ జి, సహ నిర్మాతలు: శ్రీహరి చెన్నం - రాజేంద్ర పోరంకి, నిర్మాణ సంస్థ: భాస్కర ఎంటర్‌టైన్‌మెంట్స్, నిర్మాత: గుంటక శ్రీనివాస్ రెడ్డి, దర్శకత్వం: గౌతం రెడ్డి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)