(Source: ECI/ABP News/ABP Majha)
KRMB: కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్ నోటిఫికేషన్ అమలుపై ముగిసిన సమీక్ష..
కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి గెజిట్ నోటిఫికేషన్ అమలుపై నిర్వహించిన సమీక్ష ముగిసింది. కేంద్ర జలవనరుల విభాగం అదనపు కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ.. కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లతో సమావేశం అయ్యారు.
కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల (KRMB, GRMB)తో కేంద్ర జలశక్తి శాఖ సమీక్ష ముగిసింది. కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్.. జీఆర్ఎంబీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌లతో హైదరాబాద్ జలసౌధలో కేంద్ర జలవనరుల శాఖ అదనపు కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ సమావేశం అయ్యారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. భేటీలో భాగంగా రెండు బోర్డుల ఛైర్మన్లు.. గెజిట్ నోటిఫికేషన్ అమలుకు సంబంధించిన కార్యాచరణ పురోగతిని దేవశ్రీ ముఖర్జీకి వివరించారు. రెండు రాష్ట్రాల నుంచి ఇప్పటివరకు అందిన వివరాలు, సమాచారాన్ని దేవశ్రీ ముఖర్జీకి తెలిపారు.
Also Read: అత్యాచారంతో బాలికకు గర్భం.. పిండం తొలగింపునకు హైకోర్టు అనుమతి.. ఎందుకలా చెప్పిందంటే?
గెజిట్ నోటిఫికేషన్ అమలుపై ఉపసంఘం..
కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు ప్రక్రియ కోసం గోదావరి నదీ యాజమాన్య బోర్డు (GRMB) ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ మధ్య ఇటీవల జరిగిన సంయుక్త సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు గతంలో ఏర్పాటైన సమన్వయ కమిటీ స్థానంలో ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. బోర్డు మీటింగ్ మినిట్స్‌తో పాటు ఉపసంఘాన్ని సైతం ప్రకటించారు. గోదావరి నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి.. ఉపసంఘానికి కన్వీనర్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. గెజిట్ నోటిఫికేషన్ అమలుపై ఉపసంఘం ఎప్పటికప్పుడు చర్చించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
Also Read: జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టెండర్లు.. టీటీడీ బోర్డు మీటింగ్ లోని నిర్ణయాలివే..
కృష్ణా బోర్డుడు తెలంగాణ ప్రభుత్వం లేఖ..
కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. తాగునీటి వినియోగాన్ని 20 శాతంగానే పరిగణించాలని బోర్డును కోరింది. 15 శాతంగానే లెక్కించాలని ఇటీవల సెంట్రల్ వాటర్ కమిషన్ పేర్కొందని వివరించింది. కృష్ణాలో 75.32 టీఎంసీలు ఇవ్వాలని బ్రిజేష్ ట్రైబ్యునల్ ను కోరుతున్నామని పేర్కొంది. 75.32 టీఎంసీల్లో 20 శాతాన్ని తాగునీటిగా లెక్కించాలని లేఖలో కోరింది.
Also Read: దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక వాయిదా ! లోకేష్ - ఆళ్ల హోరాహోరీలో పైచేయి ఎవరిది ?
Also Read: "దుర్గమ్మ గుడి మొత్తం వైఎస్ఆర్‌సీపీ రంగుల లైట్లు..." నిజం కాదు ! ఫేక్ !
Also Read: ఏపీలో 190 ఉద్యోగాలు.. రూ.85 వేల వరకు జీతం.. దరఖాస్తు గడువు ఎప్పటివరకు అంటే..