X

TTD Board Meeting: జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టెండర్లు.. టీటీడీ బోర్డు మీటింగ్ లోని నిర్ణయాలివే..

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అన్నమయ్య భవన్‌లో సమావేశమైంది. వైవీ.సుబ్బారెడ్డి రెండోసారి ఛైర్మన్‌గా నియమితులయ్యాక తొలిసారిగా సమావేశం నిర్వహించారు.

FOLLOW US: 

వైవీ.సుబ్బారెడ్డి రెండోసారి ఛైర్మన్‌గా నియమితులయ్యాక తొలిసారిగా టీటీడీ బోర్డు సమావేశం జరిగింది.  మొత్తం 24 మంది సభ్యులు, నలుగురు ఎక్స్ అఫిషియో స‌భ్యులు ఉండగా సమావేశానికి 18 మంది సభ్యులు నేరుగా హాజరయ్యారు. మిగిలినవారు వర్చువల్‌గా పాల్గొన్నారు. జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టెండర్ల ఖరారు, ఉద్యోగుల ఇళ్ల స్థలాలకు సంబంధించి సమావేశంలో ప్రధానంగా చర్చించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు చేసిన ఏర్పాట్లు, భక్తుల దర్శనాలకు సంబంధించిన అంశాలపైనా సమావేశంలో చర్చ జరిగింది.

జమ్మూలో శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణానికి రూ.17.40 కోట్లతో టెండర్లకు టీటీడీ పాలక మండలి ఆమోదం తెలిపింది.   చెన్నై, బెంగళూరు, ముంబయిలో టీటీడీ సమాచార కేంద్రాలు, శ్రీవారి ఆలయాల స్థానిక సలహా మండళ్లకు ఛైర్మన్ల నియామకానికి ఆమోదం తెలిపింది.  అలిపిరి కాలిబాట సుందరీకరణ పనులకు రూ.7.50 కోట్లతో టెండర్లకు ఆమోదం తెలుపుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది. కడప జిల్లా రాయచోటిలో టీటీడీ కల్యాణమండపం నిర్మాణానికి రూ.2.21 కోట్ల నిధులు కేటాయించింది. 

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించేందుకు ఆప్‌కాస్‌ తరహాలో టీటీడీ కార్పొరేషన్‌ ఏర్పాటుపై పాలక మండలి నిర్ణయం తీసుకుంటూ టీటీడీ ఉద్యోగుల హెల్త్‌ ఫండ్‌కు ఆమోదం తెలిపింది. తిరుమలలోని వరాహస్వామి విశ్రాంతి భవనంలో పలు ప్రత్యేక అభివృద్ధి పనులు, మరమ్మతులు చేపట్టేందుకు రూ.2.61 కోట్లు నిధులు కేటాయింపునకు బోర్డు సభ్యులు ఆమోదం తెలిపారు. స్విమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలోని సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌ రీసెర్చి భవనంలో అదనంగా 4, 5 అంతస్తుల నిర్మాణానికి రూ.4.46 కోట్ల రూపాయలను టీటీటీ కేటాయించింది. 

వాహనసేవలు • 07-10-2021: ధ్వజారోహణం(ఉదయం)- పెద్దశేష వాహనసేవ(సాయంత్రం)

 • 08-10-2021: చిన్నశేష వాహ‌నసేవ(ఉదయం)- హంస వాహనసేవ(సాయంత్రం)

 • 09-10-2021: సింహ వాహ‌నసేవ(ఉదయం)- ముత్యపుపందిరి వాహ‌నసేవ(సాయంత్రం)

 • 10-10-2021:  క‌ల్పవృక్ష వాహ‌నసేవ(ఉదయం)-సర్వభూపాల వాహనసేవ(సాయంత్రం)

 • 11-10-2021: మోహినీ అవ‌తారం(ఉదయం)- గ‌రుడ‌ వాహనసేవ‌(సాయంత్రం)

 • 12-10-2021: హ‌నుమంత వాహ‌నసేవ(ఉదయం)- గ‌జ వాహ‌నసేవ(సాయంత్రం)

 • 13-10-2021: సూర్యప్రభ వాహ‌నసేవ(ఉదయం)- చంద్రప్రభ వాహ‌నసేవ(సాయంత్రం)

 • 14-10-2021: రథోత్సవం బ‌దులుగా సర్వభూపాల వాహనసేవ(ఉదయం)- అశ్వ వాహ‌నసేవ(సాయంత్రం)

 • 15-10-2021: ప‌ల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం (ఉదయం)- ధ్వజారోహణం (సాయంత్రం)

Also Read: Dussehra 2021: శరన్నవరాత్రుల సందర్భంగా మీ బంధుమిత్రులకు ఈ కోట్స్ తో శుభాకాంక్షలు తెలియజేయండి..

Also Read: Navaratri Festival: నవరాత్రుల్లో అమ్మవారికి ఏ రోజు ఏ రంగు వస్త్రం సమర్పించాలి...ఏ ప్రసాదం నివేదించాలి

Also Read: Bathukamma Celebrations: ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకూ తొమ్మిది రోజులు రోజుకో నైవేద్యం...ఏ రోజు ఏం పెట్టాలంటే...

Also Read: Dussehra 2021: దసరా సందర్భంగా దేశమంతటా రావణ దహన వేడుకలు జరుపుకుంటారు…ఈ సందర్భంగా లంకేశుడి గురించి 10 ఆసక్తికర విషయాలు మీకోసం

Tags: ttd Tirumala Temple YV SUBBAREDDY TTD Board Decisions srivari bramhostavalu

సంబంధిత కథనాలు

Pattabhi : కుటుంబం కోసం బయటకు వెళ్లా.. త్వరలోనే మళ్లీ వస్తా ... పట్టాభి వీడియో విడుదల !

Pattabhi : కుటుంబం కోసం బయటకు వెళ్లా.. త్వరలోనే మళ్లీ వస్తా ... పట్టాభి వీడియో విడుదల !

AP Ration Dealers Protest: రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్ల ఆందోళన... గోనె సంచులను డీలర్లకే ఇవ్వాలని డిమాండ్

AP Ration Dealers Protest: రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్ల ఆందోళన... గోనె సంచులను డీలర్లకే ఇవ్వాలని డిమాండ్

AP HighCourt : పోలీసు శాఖలో వారిని విలీనం చేయడంపై పిటిషన్ ! ఎలా చేశారో చెప్పాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం !

AP HighCourt : పోలీసు శాఖలో వారిని విలీనం చేయడంపై పిటిషన్ ! ఎలా చేశారో చెప్పాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం !

Anantapur: తల్లి మృతదేహంతో తహసీల్దారు కార్యాలయంలో ఆందోళన... పాసుపుస్తకం రాలేదని మనస్తాపంతో మహిళా రైతు మృతి..!

Anantapur: తల్లి మృతదేహంతో తహసీల్దారు కార్యాలయంలో ఆందోళన... పాసుపుస్తకం రాలేదని మనస్తాపంతో మహిళా రైతు మృతి..!

Breaking News Live Updates: హుజూరాబాద్ ఉప ఎన్నికలు.. మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ

Breaking News Live Updates: హుజూరాబాద్ ఉప ఎన్నికలు.. మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Aryan Khan Bail Hearing: 'ఆర్యన్ ఖాన్ వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా.. బెయిల్ ఇవ్వొద్దు మైలార్డ్'

Aryan Khan Bail Hearing: 'ఆర్యన్ ఖాన్ వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా.. బెయిల్ ఇవ్వొద్దు మైలార్డ్'

Chandra Babu : దొరకని మోడీ, షా అపాయింట్‌మెంట్లు.. ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన!

Chandra Babu : దొరకని మోడీ, షా అపాయింట్‌మెంట్లు.. ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన!

Divi Vadthya Photos: ‘దివి’ నుంచి భువికొచ్చిన యాపిల్ బ్యూటీ

Divi Vadthya Photos: ‘దివి’ నుంచి భువికొచ్చిన యాపిల్ బ్యూటీ

Covid 19 Vaccine For Children: చిన్నారులకు కరోనా వ్యాక్సిన్‌పై అపోలో శుభవార్త.. వారికి ఉచితంగా టీకాలపై ప్రకటన

Covid 19 Vaccine For Children: చిన్నారులకు కరోనా వ్యాక్సిన్‌పై అపోలో శుభవార్త.. వారికి ఉచితంగా టీకాలపై ప్రకటన