అన్వేషించండి

Navaratri Festival: నవరాత్రుల్లో అమ్మవారికి ఏ రోజు ఏ రంగు వస్త్రం సమర్పించాలి...ఏ ప్రసాదం నివేదించాలి

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో రంగు వస్త్రం, రోజుకో నైవేద్యం సమర్పిస్తారు. అయితే ఏ ఇవన్నీ ప్రాంతాన్ని బట్టి మారుతాయి. భక్తి ప్రధానం కానీ ఇలాగే చేయాలనేం లేదంటారు పండితులు.

విజయ దశమి, దసరాగా పిలిచే పర్వదినాలు మొదలయ్యాయి. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. తొలి మూడు రోజులు పార్వతిగా, తర్వాతి మూడు రోజులు లక్ష్మీగా, చివరి మూడు రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు. మనలో ఉండే చెడుని నాశనం చేయాలని మొదటి మూడు రోజులు, సంపదను ప్రసాదించాలని తర్వాతి మూడు రోజులు, జ్ఞానాన్నివ్వాలని చివరి మూడు రోజులు ప్రార్థిస్తారు. అయితే ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో రంగు వస్త్రం సమర్పిస్తారు. ఒక్కో రోజు ఒక్కో ప్రసాదం నివేదిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఇలా పాటిస్తారు...
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి: మొదటి రోజు  శ్రీ స్వర్ణకవచలాంకృత దుర్గాదేవిగా  అలంకరిస్తారు. ఈ రోజున అమ్మను ఎరుపు రంగు వస్త్రంతో అలంకరిస్తారు. ఎరుపు రంగు ఉత్తేజానికి సంకేతం.  కట్టు పొంగలిని నైవేద్యం పెడతారు.
ఆశ్వయుజశుద్ధ విదియ: రెండో రోజు శ్రీ బాలా త్రిపురసుందరీదేవిగా అలంకరిస్తారు. ఈ రోజు బంగారు వర్ణ వస్త్రంతో అలంకరిస్తారు. బంగారు రంగు చెడు శక్తులను తొలగిస్తుందని విశ్వాసం. అమ్మవారికి పులిహోర నైవేద్యం పెడతారు. 
ఆశ్వయుజ శుద్ధ తదియ: .మూడో రోజు అమ్మవారి అవతారం గాయత్రీదేవి.  ఈ అమ్మవారిని జ్ఞానానికి ప్రతిరూపంగా చెబుతారు.  ఈ రోజు అమ్మవారిని పసుపు రంగు వస్త్రంతో అలంకరిస్తారు. ఆటంకాలు తొలగించి సకల శుభాలనిచ్చే రంగు ఇది.  కొబ్బరి అన్నాన్ని నివేదిస్తారు. కొబ్బరిని పూర్ణఫలం అంటారు..అందుకే పూర్ణ ఫలితం దక్కాలని కొబ్బరి అన్న నివేదిస్తారు. 
ఆశ్వయుజ శుద్ధ చవితి: ఈరోజు  శ్రీ లలితా దేవిగా దర్శనమిస్తుంది అమ్మవారు.  లిలితా అమ్మవారిని ఎరుపు రంగు వస్త్రంతో అలంకరించి కేసరి నైవేద్యం పెడతారు. 
ఆశ్వయుజ శుద్ధ పంచమి, షష్టి:  ఈ రోజున శుద్ధ పంచమి, షష్ఠి తిధులు రావడంతో అమ్మవారు మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం లోనూ, 2 గంటల నుంచి శ్రీ మహాలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ మహాలక్ష్మీ దేవిని  గులాబీరంగు వస్త్రంతో అలంకరించి కదంబం నైవేద్యంగా సమర్పిస్తారు, 
ఆశ్వయుజ శుద్ధ సప్తమి: శ్రీ సరస్వతీ దేవి అలంకారం: మూల నక్షత్రం రోజున సరస్వతిదేవిని తెలుపు రంగు చీరలో అలంకరిస్తారు. హంస వాహనంపై కొలువై తెల్లని వస్త్రంతో అలంకరించిన అమ్మవారిని దర్శించుకుంటే మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల విశ్వాసం.  ఈ రోజున దధ్యోజనం నైవేద్యంగా సమర్పిస్తారు. 
ఆశ్వయుజ శుద్ధ అష్టమి: ఈ రోజు అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిస్తుంది.  దుర్గతులను పోగొట్టే దుర్గాదేవి అవతారాన్ని దర్శించుకుంటే సద్గతులు సంప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. ఈరోజు అమ్మవారిని  ఆకుపచ్చ రంగు వస్త్రంతో అలంకరించి...చక్కెరపొంగలి వైవేద్యంగా సమర్పిస్తారు.
ఆశ్వయుజ శుద్ధ నవమి: మహర్నవమి రోజు మహిషాసురమర్ధిని అలంకారంలో కనిపించే అమ్మవారికి  నీలం రంగు వస్త్రంతో అలంకరిస్తారు. నీలం రంగు యుద్ధానికి సంకేతం అని..ఈ రంగు వస్త్రం ధరించి మహిషాసురుడిని అమ్మవారు సంహరించారని చెబుతారు. ఈ రోజున శుభానికిసంకేతంగా పాయసం నివేదిస్తారు. 
ఆశ్వయుజ శుద్ధ దశమి: ఇదే విజయదశమి. ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరించి లేత గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. ఇది శుభానికి సంకేతం. గారెలు, పాయసం అన్ని అమ్మవారికి పెట్టవచ్చు.
ఇలా చేస్తేనే అమ్మవారి కరుణ ఉంటుందనే భ్రమలో ఉండొద్దని కూడా పండితులు చెబుతారు. నిశ్చలమైన భక్తి ముఖ్యం అంటారు. 

Also Read:విజయ దశమి ఎందుకు జరుపుకుంటారు.. శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఏ రోజు ఏ అలంకారంలో అనుగ్రహిస్తుంది ... ఆ అలంకారం వెనుకున్న విశిష్టత ఏంటి...
Also Read: దసరా సందర్భంగా దేశమంతటా రావణ దహన వేడుకలు జరుపుకుంటారు…ఈ సందర్భంగా లంకేశుడి గురించి 10 ఆసక్తికర విషయాలు మీకోసం
Also Read:ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకూ తొమ్మిది రోజులు రోజుకో నైవేద్యం...ఏ రోజు ఏం పెట్టాలంటే...
Also Read:ఈ రాశుల వారు శుభవార్త వింటారు..వారు ఆర్థికంగా లాభపడతారు..ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..
Also Read:ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Union Cabinet: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ - ఏపీలో 8 కేంద్రీయ, తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు, కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ - ఏపీలో 8 కేంద్రీయ, తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు, కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
Allu Arjun: మహిళా అభిమాని మృతిపై అల్లు అర్జున్ ఎమోషనల్ - 25 లక్షల సాయం, ఆ ఫ్యామిలీకి భరోసా
మహిళా అభిమాని మృతిపై అల్లు అర్జున్ ఎమోషనల్ - 25 లక్షల సాయం, ఆ ఫ్యామిలీకి భరోసా
Andhra News: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Range Rover Vs Rolls Royce: రేంజ్ రోవర్ వర్సెస్ రోల్స్ రాయిస్ - ఈఎంఐతో కొనడం ఎలా? - లక్షల్లో కట్టాల్సిందేనా!
రేంజ్ రోవర్ వర్సెస్ రోల్స్ రాయిస్ - ఈఎంఐతో కొనడం ఎలా? - లక్షల్లో కట్టాల్సిందేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Siraj Throw ball to Marnus Labuschagne | లబుషేన్ పై బాల్ గిరాటేసిన సిరాజ్ | ABP DesamAus vs Ind 2nd Test Day 1 Highlights | రెండో టెస్టులో టీమిండియాను ఆడేసుకుంటున్న ఆస్ట్రేలియా | ABPతిరుమలలో పంచమితీర్థం, అస్సలు మిస్ అవ్వొద్దువిజయవాడలో రెచ్చిపోయిన  గంజాయి, బ్లేడ్ బ్యాచ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Union Cabinet: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ - ఏపీలో 8 కేంద్రీయ, తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు, కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ - ఏపీలో 8 కేంద్రీయ, తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు, కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
Allu Arjun: మహిళా అభిమాని మృతిపై అల్లు అర్జున్ ఎమోషనల్ - 25 లక్షల సాయం, ఆ ఫ్యామిలీకి భరోసా
మహిళా అభిమాని మృతిపై అల్లు అర్జున్ ఎమోషనల్ - 25 లక్షల సాయం, ఆ ఫ్యామిలీకి భరోసా
Andhra News: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Range Rover Vs Rolls Royce: రేంజ్ రోవర్ వర్సెస్ రోల్స్ రాయిస్ - ఈఎంఐతో కొనడం ఎలా? - లక్షల్లో కట్టాల్సిందేనా!
రేంజ్ రోవర్ వర్సెస్ రోల్స్ రాయిస్ - ఈఎంఐతో కొనడం ఎలా? - లక్షల్లో కట్టాల్సిందేనా!
Telangana Mother Statue : తెలంగాణ తల్లి విగ్రహం ఫస్ట్ లుక్ -  రేవంత్ తెలంగాణ ప్రజల్ని మెప్పించినట్లేనా ?
తెలంగాణ తల్లి విగ్రహం ఫస్ట్ లుక్ - రేవంత్ తెలంగాణ ప్రజల్ని మెప్పించినట్లేనా ?
Airtel Vs Jio: ఈ ఎయిర్‌టెల్, జియో ప్లాన్లు రూ.100 లోపే - మరి ఏ లాభాలు లభిస్తాయి?
ఈ ఎయిర్‌టెల్, జియో ప్లాన్లు రూ.100 లోపే - మరి ఏ లాభాలు లభిస్తాయి?
Pushpa 2: ఫేక్ డైలాగ్స్ షేర్ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటాం - 'పుష్ప 2' ప్రొడక్షన్ హౌస్ వార్నింగ్
ఫేక్ డైలాగ్స్ షేర్ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటాం - 'పుష్ప 2' ప్రొడక్షన్ హౌస్ వార్నింగ్
YSRCP MP: పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
Embed widget