X
Super 12 - Match 15 - 24 Oct 2021, Sun up next
SL
vs
BAN
15:30 IST - Sharjah Cricket Stadium, Sharjah
Super 12 - Match 16 - 24 Oct 2021, Sun up next
IND
vs
PAK
19:30 IST - Dubai International Cricket Stadium, Dubai

Horoscope Today: ఈ రాశుల వారు శుభవార్త వింటారు..వారు ఆర్థికంగా లాభపడతారు..ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

FOLLOW US: 

మేషం
ఈ రోజు మీకు బావుంటుంది.  కొత్త పని ప్రారంభించేందుకు, కొత్త ప్రణాళికలు అమలుచేసేందుకు ఇదే శుభసమయం. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పెండింగ్ కేసులు ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యుడు లేదా స్నేహితుడితో వివాదం ఉండొచ్చు. ఉద్యోగస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.  వ్యాపారులు లాభపడతారు.  సామాజిక సేవలో పాల్గొంటారు. అప్పు తీసుకున్న మొత్తం తిరిగి చెల్లిస్తారు. 
వృషభం
ఏదైనా ఆర్థిక పథకంలో పెట్టుబడి పెట్టేందుకు అనుకూల సమయం. స్నేహితులతో మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించండి. ఎప్పటినుంచో రావాల్సిన మొత్తం చేతికందుతుంది.  కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. కార్యాలయంలో వివాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.  సామాజిక స్థితి బాగుంటుంది.  ప్రమాదానికి సంబంధించిన పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు.
మిథునం
వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి.  మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.  సమాజంలో  ప్రతిష్ట పెరుగుతుంది. ఓ వార్త  మీకు చాలా సంతోషాన్నిస్తుంది. వ్యాపారంలో లాభం వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులను సంప్రదించిన తర్వాతే ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోండి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. అనవసరమైన వివాదాలలో చిక్కుకోకండి. పెండింగ్ కేసుల్లో కొంత వేగం పెరిగే అవకాశం ఉంది.  ఉద్యోగాలు మారేందుకు ప్రయత్నించండి.
కర్కాటకం
జీవిత భాగస్వామితో వివాదాలు ఉండొచ్చు. మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు. అనారోగ్య సూచనలున్నాయి. వ్యాపారం సాధారణంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. కొత్త ఖర్చుల కారణంగా బడ్జెట్ ప్రభావితం కావచ్చు.పెట్టుబడులు పెట్టేందుకు ముందు నిపుణులను సంప్రదించండి. స్నేహితులతో సరదా సమయాన్ని గడుపుతారు.  కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అత్తమామల వైపు నుంచి అవసరమైన సమాచారాన్ని పొందుతారు. అప్పిచ్చిన మొత్తం తిరిగి చేతికందుతుంది. 
సింహం
మీరు కొన్ని కొత్త ప్రాజెక్టులను పరిశీలించండి కానీ పని ఈ రోజు ప్రారంభించవద్దు. బంధువులను కలవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.  కుటుంబానికి సంబంధించిన పనిలో స్నేహితుల మద్దతు లభిస్తుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది.  విద్యార్థులకు సాధారణంగా ఉంటుంది.  కుటుంబ పెద్దలను జాగ్రత్తగా చూసుకోండి. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం పొందుతారు.
కన్య
మీ సానుకూల ఆలోచన మీకు కొత్త దిశానిర్దేశం చేస్తుంది. అనుకున్న పనులన్నీ పూర్తికావడంతో సంతోషంగా ఉంటారు.  ఆర్థిక పరిస్థితి మునపటి కన్నా బావుంటుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది. అనవసరమైన పనిలో సమయం వృధా చేస్తారు. విద్యార్థుల మనస్సు చదువులో నిమగ్నమై ఉంటుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం. వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి. మీ విశ్వాసం సడలనీవద్దు.  స్నేహితులను కలుస్తారు.
తుల
ఆస్తికి సంబంధించిన విషయాలు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన పనిపై ప్రయాణం చేయాల్సివస్తుంది. మీ ప్రియమైనవారి మద్దతు మీకు లభిస్తుంది. స్నేహితులను కలుస్తారు. పని ప్రదేశంలో శుభవార్తలు ఉంటాయి. విద్యార్థులు విజయం సాధిస్తారు.  కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవచ్చు. వివాహం కాని వారికి సంబంధం గురించి చర్చల్లో అడుగు ముందుకు పడుతుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. కార్యాలయంలో శుభవార్తలు వింటారు. ఏ పనిలోనూ తొందరపాటు చూపవద్దు. తెలియని వ్యక్తుల ముందు ప్రైవేట్ చర్చలు చేయవద్దు. 
వృశ్చికం
 ఏ పనీ వాయిదా వేయవద్దు. స్నేహితులతో విభేదాలు పరిష్కారమవుతాయి.  కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి తొందరపడకండి.  బ్యాంకు సంబంధిత పని పూర్తవుతుంది. ఉపయోగంలేని పనులు చేస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోకండి. బంధువులను కలుస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కార్యాలయంలో జాగ్రత్త, ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. ఆర్థికంగా లాభపడతారు.  మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోమరితనం వద్దు వ్యాపారంలో ఆకస్మిక లాభాలు ఉంటాయి.
ధనుస్సు
ఆదాయం పెరుగుతుంది. మిత్రుల సహకారం ఉంటుంది. యువత సంతోషంగా ఉంటుంది. రిస్క్ తీసుకోకండి. కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చులను నియంత్రించేందుకు ప్రయత్నించండి. ఉద్యోగంలో బదిలీ గురించి సమాచారాన్ని పొందుతారు. వ్యాపారులకు పెట్టుబడుల నుంచి లాభాలువస్తాయి.  యువత మరింత కష్టపడాల్సి ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయండి. ఇల్లు కొనేందుకు ఓ ప్రణాళిక రూపొందించుకోవచ్చు. పూర్వీకుల ఆస్తిలో వాటా పొందుతారు. అపరిచితులతో అతి చనువు వద్దు.
మకరం
వ్యక్తిగత జీవితం గురించి ఎవరితోనూ మాట్లాడకండి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.  ఈ రోజు బిజీగా ఉంటారు. అధిక ధన రిస్క్ ఉన్న పని చేయొద్దు.  కొత్త వ్యక్తులను కలుస్తారు. పాత అనారోగ్యం మిమ్మల్ని మళ్లీ ఇబ్బంది పెట్టొచ్చు. ఒకరి మాటల కారణంగా బాధపడతారు. ఉద్యోగస్తులు శుభవార్త వింటారు. వివాదాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు సంతోషంగా ఉంటారు.డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. గాయపడే ప్రమాదం ఉంది. వ్యాపారంలో ఒడిదొడుకులు ఉంటాయి.
కుంభం
ఈ రోజంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. వ్యాపార ప్రయాణం ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. కార్యాలంలో పనిని సకాలంలో పూర్తిచేస్తారు.  మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎవరితోనైనా వివాదాలు ఉండొచ్చు. మీ కోపాన్ని నియంత్రించుకునేందుకు ప్రయత్నించండి. శత్రువులు చురుకుగా ఉంటారు. ఏ పనిని వాయిదా వేయవద్దు. ఆరోగ్యం బాగుంటుంది.  ప్రభుత్వానికి సంబంధించిన పనులు పూర్తవుతాయి. 
మీనం
టెన్షన్ తగ్గుతుంది. కొత్త పని పట్ల ఓపికగా ఉండాలి. స్థిరాస్తులు కొనుగోలు చేసే ఆలోచన కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. అప్పులు ఇవ్వొద్దు.   కుటుంబంతో సంతోషకరమైన క్షణాలు గడపగలుగుతారు.  స్నేహితుల నుంచి ఆహ్లాదకరమైన సమాచారాన్ని పొందుతారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో విభేదాలు ఉండే అవకాశం ఉంది. అడగకుండా ఎవరికీ సలహా ఇవ్వవద్దు. అనవసర మాటలు వద్దు.  విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆదాయంలో తగ్గుదల ఉంటుంది. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.  


Also Read:విజయ దశమి ఎందుకు జరుపుకుంటారు.. శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఏ రోజు ఏ అలంకారంలో అనుగ్రహిస్తుంది ... ఆ అలంకారం వెనుకున్న విశిష్టత ఏంటి...
Also Read: దసరా సందర్భంగా దేశమంతటా రావణ దహన వేడుకలు జరుపుకుంటారు…ఈ సందర్భంగా లంకేశుడి గురించి 10 ఆసక్తికర విషయాలు మీకోసం
Also Read:ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకూ తొమ్మిది రోజులు రోజుకో నైవేద్యం...ఏ రోజు ఏం పెట్టాలంటే...
Also Read:నిద్రలేవగానే ఎవర్ని చూడాలంటే…!
Also Read:ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces Horoscope Today 7 October 2021

సంబంధిత కథనాలు

Horoscope Today 24 October 2021: ఈరోజు ఐదు రాశుల వారు శుభవార్త వింటారు .. మిగిలిన రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today 24 October 2021: ఈరోజు ఐదు రాశుల వారు శుభవార్త వింటారు .. మిగిలిన రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today 23 October 2021: ఈ రోజు ఈ రాశి ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు...మిగిలిన రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయంటే...

Horoscope Today 23 October 2021: ఈ రోజు ఈ రాశి ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు...మిగిలిన రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయంటే...

Horoscope Today:ఈ ఐదు రాశుల వారికి ఈ రోజంతా శుభసమయమే, వారు అప్రమత్తంగా ఉండాలి.. మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today:ఈ ఐదు రాశుల వారికి ఈ రోజంతా శుభసమయమే, వారు అప్రమత్తంగా ఉండాలి.. మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: ఈ రోజు ఐదు రాశుల వారు శుభవార్త వింటారు..మీ రాశిఫలితం ఎలా ఉందో చూసేయండి..

Horoscope Today: ఈ రోజు  ఐదు రాశుల వారు శుభవార్త వింటారు..మీ రాశిఫలితం ఎలా ఉందో చూసేయండి..

Horoscope Today: ఈ రోజు ఈ రాశి వారికి తెలియని అడ్డంకి తొలగిపోతుంది, వారి ఆర్థిక పరిస్థితి బావుంటుంది .. ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today:  ఈ రోజు ఈ రాశి వారికి తెలియని అడ్డంకి తొలగిపోతుంది, వారి ఆర్థిక పరిస్థితి బావుంటుంది .. ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Loan Options: మీకు అర్జెంట్‌గా డబ్బు కావాలా? ఇలా చేస్తే బెటర్‌!

Loan Options: మీకు అర్జెంట్‌గా డబ్బు కావాలా? ఇలా చేస్తే బెటర్‌!

T20 WC Ind vs Pak: పాక్‌ మ్యాచ్‌ ముందు కోహ్లీసేనకు కపిల్‌ హెచ్చరిక! అలా చేస్తే ఓడిపోయే ప్రమాదం లేకపోలేదు!

T20 WC Ind vs Pak: పాక్‌ మ్యాచ్‌ ముందు కోహ్లీసేనకు కపిల్‌ హెచ్చరిక! అలా చేస్తే ఓడిపోయే ప్రమాదం లేకపోలేదు!

Covid-19 New variant: కరోనా మరో అవతారం.. ఏవై. 4.2.. ఇది చాలా ఫాస్ట్ గురూ! మరి భారత్‌కు వచ్చేసిందా?

Covid-19 New variant: కరోనా మరో అవతారం.. ఏవై. 4.2.. ఇది చాలా ఫాస్ట్ గురూ! మరి భారత్‌కు వచ్చేసిందా?

Match Box Price: అగ్గిపెట్టెల ధర పెంపు.. 14 ఏళ్ల తర్వాత రెట్టింపైన రేటు, కారణం ఏంటంటే..

Match Box Price: అగ్గిపెట్టెల ధర పెంపు.. 14 ఏళ్ల తర్వాత రెట్టింపైన రేటు, కారణం ఏంటంటే..