APPSC Jobs: ఏపీలో 190 ఉద్యోగాలు.. రూ.85 వేల వరకు జీతం.. దరఖాస్తు గడువు ఎప్పటివరకు అంటే..
Andhra Pradesh Public Service Commission: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 190 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఏపీలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 190 పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో 35 క్యారీ ఫార్వాడెడ్ (Carry forwarded) పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ అక్టోబర్ 21 నుంచి ప్రారంభం కానుండగా.. గడువు నవంబర్ 11వ తేదీతో ముగియనుంది. మరిన్ని వివరాల కోసం http://psc.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పంచాయతీ రాజ్, దేవాదాయ, వాటర్ రిసోర్స్ శాఖల్లో ఈ పోస్టులు ఉన్నాయి. ఎంపికైన వారి వేతనం నెలకు రూ.31,460 నుంచి రూ.84,970 వరకు ఉంటుంది. 2021 జూలై 1వ తేదీ నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య వయసున్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు.. దివ్యాంగులకు పదేళ్ల పాటు సడలింపు ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు అందించారు.
Also Read: ఏపీలో 151 ఉద్యోగాల భర్తీ.. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్.. రూ.91 వేల వరకు వేతనం
అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.250.. పరీక్ష ఫీజు కింద రూ.80 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు (రూ.250) చెల్లించాల్సిన అవసరం లేదు. వారు కేవలం ఎగ్జామ్ ఫీజు రూ.80 చెల్లిస్తే సరిపోతుంది.
ఏపీలో హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ఇటీవల వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా హార్టికల్చర్ ఆఫీసర్, లెక్చరర్లు / అసిస్టెంట్ హోమియో ప్రొఫెసర్, తెలుగు రిపోర్టర్ పోస్టులను భర్తీ చేయనుంది. 39 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 11వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా.. గడువు నవంబర్ 2తో ముగియనుంది. 24 అసిస్టెంట్ హోమియో ప్రొఫెసర్ / లెక్చరర్లు, 3 లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈరోజు (అక్టోబర్ 7) నుంచి ప్రారంభం కాగా.. గడువు అక్టోబర్ 28తో ముగియనుంది. వీటితో పాటు 5 తెలుగు రిపోర్టర్ల పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటి దరఖాస్తు స్వీకరణ అక్టోబర్ 18వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా.. గడువు నవంబర్ 8తో ముగియనుంది.
Also Read: ప్రభుత్వ బ్యాంకుల్లో 7855 క్లర్క్ జాబ్స్.. ఏపీ, తెలంగాణలో ఖాళీల వివరాలివే..
Also Read: ఐఓసీఎల్‌లో 535 ఉద్యోగాలు.. రూ.1.05 లక్షల వరకు జీతం.. ఇలా అప్లయ్ చేసుకోండి..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి