Donald Trump threat: 24 గంటల్లో భారత్‌పై మరిన్ని టారిఫ్‌లు - హెచ్చరించిన ట్రంప్ - ఇండియా లైట్ తీసుకుందా?
India tariffs: భారత వస్తువులపై పన్నులు మరింత పెంచుతానని ట్రంప్ బెదిరించారు. అయితే భార్త మాత్రం ఎలాంటి బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదన్నట్లుగా ఉంది.

Donald Trump On India tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై సుంకాలు మరో 24 "గణనీయంగా" పెంచుతానని ప్రకటించారు. ఇప్పటికే భారత దిగుమతులపై 25 శాతం సుంకాన్ని విధించారు. రష్యా నుంచి చమురు, ఆయుధాలను కొనుగోలు చేస్తున్నందున "పెనాల్టీ"ని కూడా విధిస్తామని ప్రకటించారు. రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేయాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. కానీ భారత్ దానికి అంగీకరించలేదు. దీంతో ట్రంప్ భారత్ పై బెదిరింపులకు దిగారు.
ట్రంప్ భారత్‌ను రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేసి, దానిని ఓపెన్ మార్కెట్‌లో లాభం కోసం విక్రయిస్తోందని ట్రంప్ అంటున్నారు. “భారత్ రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు కొంటోంది, కొన్న చమురులో ఎక్కువ భాగాన్ని ఓపెన్ మార్కెట్‌లో లాభం కోసం విక్రయిస్తోంది. ఉక్రెయిన్‌లో రష్యన్ యుద్ధ యంత్రం వల్ల ఎంతమంది చనిపోతున్నా వారికి పట్టదు.” అని తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ట్రూత్ లో ఆరోపించారు. ట్రంప్ భారత్‌ను “సుంకాల రాజు” అని వర్ణిస్తున్నారు. డిజిటల్ సర్వీసెస్‌పై పన్నులు , కఠినమైన టెస్టింగ్ వంటి భారత్ నిబంధనలు అమెరికా ఎగుమతులను అడ్డుకుంటున్నాయని ఆయన అంటున్నారు.
ఏప్రిల్ 2025లో, ట్రంప్ భారత ఉత్పత్తులపై 27 శాతం వరకు సుంకాలు విధించాలని ప్రతిపాదించారు, కానీ వాణిజ్య చర్చల కోసం వాటిని తాత్కాలికంగా నిలిపివేశారు, ఆగస్టు 1, 2025ని గడువుగా నిర్ణయించారు. అప్పటికీ ట్రేడ్ డీల్ కుదరకపోవడంతో 25 శాతం పన్నులు విధించారు.
అయితే భారత విదేశాంగ శాఖ ట్రంప్ ఆరోపణలను “అన్యాయం, అసమంజసమైనవి” అని స్పష్టం చేసింది. అమెరికా, యూరోపియన్ యూనియన్ కూడా రష్యాతో గణనీయమైన వాణిజ్యం చేస్తున్నాయని వివరాలు వెల్లడించింది. 2024లో రష్యా నుంచి 5.2 బిలియన్ల విలువైన వస్తువులను అమెరికా దిగుమతి చేసుకుంది. ఇందులో యురేనియం హెక్సాఫ్లోరైడ్, పల్లాడియం, ఎరువులు , రసాయనాలు ఉన్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం 2022లో ప్రారంభమైన తర్వాత భారత్ రష్యన్ చమురును దిగుమతి చేయడం ప్రారంభించింది. ఇలా చేయాలని అమెరికాలనే సూచించింది.
#Breaking | 'I think I am going to raise India's tariffs substantially in the next 24 hours', says U.S. President Donald Trump to CNBC#TrumpTariffs #IndiaUSTrade #indiaustradedeal pic.twitter.com/Yt9jpGFwpn
— CNBC-TV18 (@CNBCTV18Live) August 5, 2025
భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ప్రధాన ఉత్పత్తులలో చమురు ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్స్, రత్నాలు, ఆభరణాలు, టెక్స్‌టైల్స్, ఇంజనీరింగ్ ఉత్పత్తులు ఉన్నాయి. 2024లో ఈ ఎగుమతుల విలువ 83.2 బిలియన్ డాలర్లుగా నమోదైంది. భారత దిగుమతులపై సుంకాలు పెరగడం వల్ల అమెరికాలో ఔషధాలు, టెక్స్‌టైల్స్, ఇతర వస్తువుల ధరలు పెరుగుతాయి. అమెరికా యొక్క ఫార్మాస్యూటికల్ రంగం, భారత్ నుంచి జనరిక్ ఔషధాలపై ఆధారపడుతుంది.
భారత్ లో మార్కెట్ ను అమెరికా కంపెనీలకు కట్టబెట్టే లక్ష్యంతో ట్రంప్ .. బెదిరింపులకు దిగుతున్నారని భారత ప్రభుత్వం భావిస్తోంది. అందుకే అమెరికా బెదిరింపులకు తగ్గేది లేదని నిర్ణయించుకుంటున్నారు.





















