Ventilator Ambulance: రెయిన్‌బో హాస్పిటల్ "ఐసీయూ ఆన్ వీల్స్" సేవలతో నవజాత శిశువుల ప్రాణాలు సురక్షితం
Ventilator Ambulance: రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఐసీయూ ఆన్ వీల్స్ సేవలు ప్రారంభించింది. నవజాత శిశువుల ప్రాణాలకు అండగా నిలుస్తోంది.
![Ventilator Ambulance: రెయిన్‌బో హాస్పిటల్ Rainbow Children's Hospital Launches Advance High Frequency Ventilation with Nitric Oxide Gas in Ambulance Ventilator Ambulance: రెయిన్‌బో హాస్పిటల్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/06/943f3290de177752cb11c464a42e59641665054826126517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
High Frequency Ventilator Ambulance:
ఆంబులెన్స్‌లోనే అత్యాధునిక వైద్యం
నవజాత శిశువులకు ఏదైనా జబ్బు చేస్తే తల్లిదండ్రులు చాలా ఇదైపోతారు. చిన్నదే అయితే పరవాలేదు. కానీ...ఒక్కోసారి ప్రాణాల్ని మింగేసే రోగాలు వస్తాయి. ఆ సమయంలో తల్లిదండ్రులు కంగారు పడిపోతుంటారు. ఓ చోట సరైన వైద్యం అందటం లేదని తెలిస్తే..వెంటనే మరో హాస్పిటల్‌కు షిఫ్ట్ చేస్తారు. అయితే..ఇలా తరలించే సమయంలోనూ కొందరు చిన్నారులు ప్రాణాలు కోల్పోతారు. ఈ అపాయం తప్పించే కొత్త వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. అదే ICU On Wheels.రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ (Rainbow Childrens Hospital) ఈ సేవల్ని ప్రారంభించింది. ఆంబులెన్స్‌లోనే అత్యాధునిక వైద్యపరికరాలుంటాయి. ICUలో అందే చికిత్స అంతా...ఆంబులెన్స్‌లోనే అందుతాయి.
నవజాత శిశువులకు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా ఆసుపత్రికి తరలించేంత వరకూ సురక్షితంగా ఉంచుంతుందీ ఈ ఆంబులెన్స్. ఇందులో వెంటిలేటర్ కూడా అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీలో ఈ సేవలు ప్రారంభించినట్టు రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ యాజమాన్యం వెల్లడించింది. నగరాల్లో 250-300 కిలోమీటర్ల పరిధి వరకూ ఈ సేవలు అందించనున్నారు. ఈ కస్టమైజ్డ్ ఆంబులెన్స్‌లో వెంటిలేటర్, ఇన్‌క్యుబేటర్, మానిటర్, సిరంజ్ పంప్స్, డెఫిబ్రిలేటర్ ఉంటాయి. నిపుణులైన వైద్యులు, నర్సుల సమక్షంలో ఈ పరికరాలు వినియోగిస్తారు. అంటే...ఇలాంటి ఆంబులెన్స్‌లో వాళ్లు కచ్చితంగా అందుబాటులో ఉంటారు. 20 సంవత్సరాలుగా...దేశవ్యాప్తంగా 15 వేల మంది చిన్నారులను, నవజాత శిశువులను రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ సిబ్బంది ఈ తరహా ఆంబులెన్స్‌లలో సురక్షితంగా ఆసుపత్రులకు తరలించింది. రోడ్డు మార్గంలోనే కాదు. వాయు మార్గంలోనూ ఇలాంటి అత్యవసర సేవలందించింది. రాయ్‌పూర్, గోవా, విశాఖపట్నం నుంచి నవజాత శిశువులను ఆసుపత్రులకు తరలించింది.
ఓ చిన్నారిని ఇలా కాపాడారు..
సాధారణంగా అయితే...ఆక్సిజన్ లెవల్ తక్కువగా ఉన్న చిన్నారులు, వెంటిలేటర్‌పై ఉన్న నవజాత శిశువులను ఓ చోట నుంచి మరో చోటకు తరలించటం కష్టమయ్యేది. ఇలాంటి చిన్నారులకు హైఫ్రీక్వెన్సీతో కూడిన వెంటిలేటర్ అవసరం. హైఫ్రీక్వెన్సీ వెంటిలేటర్‌తో పాటు నైట్రిక్ ఆక్సైడ్ సపోర్ట్ సిస్టమ్ ఉన్న ఆంబులెన్స్ సర్వీసులను దేశంలో ప్రారంభించిన తొలి ఆసుపత్రిగా రికార్డు సృష్టించింది రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్. అంతే కాదు. ఇటీవలే ప్రాణాపాయ స్థితిలో ఓ చిన్నారి ప్రాణాలను కాపాడగలిగింది. మెహరీన్ ఫాతిమా అనే ఓ నవజాత శిశువు 2.7 కిలోల బరువు ఉంది. అయితే..ఉన్నట్టుండి ఆ పాపకు శ్వాస తీసుకోవటంలో సమస్య ఎదురైంది. హార్ట్ ప్రాబ్లమ్ ఉందని అనుమానించిన అక్కడి వైద్యులు హైదరాబాద్‌లోని ఓ కార్డియాక్ సెంటర్‌కు రిఫర్ చేశారు. చిన్నారి గుండె కుడివైపు సరిగా పని చేయటం లేదని, అందుకే ఆక్సిజన్ లెవల్స్ తగ్గాయని గుర్తించారు. ఆ తరవాత ఈ జబ్బుని Persistent Pulmonary Hypertension గా నిర్ధరించారు. సాధారణ వెంటిలేటర్‌తో తగ్గిపోయే జబ్బు కాదిది. దీనికోసం High Frequency Ventilator (HFOV)తప్పనిసరి. కానీ...ఆ ఆసుపత్రిలో ఈ తరహా వెంటిలేటర్ అందుబాటులో లేక చిన్నారి పరిస్థితి విషమించింది. చివరి ఆశగా..తల్లిదండ్రులు రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు వచ్చారు. అది కూడా ఎంతో సురక్షితంగా. ICU on Wheels ఆంబులెన్స్‌లో ఈ చిన్నారిని తరలించి సరైన సమయంలో చికిత్స అందించి ప్రాణాలు కాపాడగలిగింది వైద్య సిబ్బంది. ఇందుకోసం మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి హైదరాబాద్ వరకూ దాదాపు 5 గంటల పాటు ప్రయాణించాల్సి వచ్చింది. ఇంత సుదీర్ఘమైన ప్రయాణంలోనూ చిన్నారికి ఏ ఇబ్బందీ రాకుండా జాగ్రత్తగా చూసుకున్నారు వైద్యులు. రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్..ఇప్పటి వరకూ 9 సార్లు ఇలాంటి అత్యవసర సేవలందించి చిన్నారుల ప్రాణాలు కాపాడింది.
For more information Please contact:
Dr.Dinesh chirla 98497-90003
Dr.Nalinikantha panigrahy 94948-62327
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)