Go Back Indians: ఇండియన్స్ గో బ్యాక్ అంటూ ఆస్ట్రేలియాలో నిరసనలు - కారణం ఏమిటంటే
Australia: ఆస్ట్రేలియాలో ఇండియన్స్‌కు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. తమ దేశం నుంచి భారతీయులు వెళ్లిపోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Protests in Australia demanding Indians go back: ఆస్ట్రేలియా ప్రధాన నగరాల్లో భారతీయులకు వ్యతిరేకంగా "మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా" అనే పేరుతో ఆస్ట్రేలియన్లు భారీ ర్యాలీలు నిర్వహించారు. వలసలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీలు నిర్వహించారు. సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బేన్, పెర్త్, అడిలైడ్, కాన్బెర్రా తోపాటు ఇతర ప్రాంతాల్లో ఆగస్టు 31న జరిగిన ఈ ర్యాలీలు ఆస్ట్రేలియా వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
ర్యాలీలో భారతీయ వలసదారులను లక్ష్యంగా చేసుకున్నారు. భారతీయులల వలస వల్ల ఆస్ట్రేలియా సంస్కృతి, సంప్రదాయాలు దెబ్బతింటున్నాయని వారంటున్నారు. "రీమైగ్రేషన్" నాన్-వైట్ వలసదారులను డిపోర్ట్ చేయాలనే డిమాండ్లను ఈ ర్యాలీల్లో వినిపించారు. నాన్-యూరోపియన్ వలసదారులు ఆస్ట్రేలియా గుర్తింపును క్షీణింపజేస్తున్నారని వీరంటున్నారు.
రోజుకు ఐదు విమానాల్లో వలసదారులు వస్తున్నారని ర్యాలీలో పాల్గొన్న వారు అంటున్నారు. ఇప్పటికే 9 లక్షల మంది భారతీయులు ఉన్నారని వారు ఆరోపిస్తున్నారు. అయితే ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ డేటా ప్రకారం 2023-24లో నెట్ ఓవర్సీస్ మైగ్రేషన్ (NOM) 446,000గా ఉంది. ఇది మునుపటి సంవత్సరం 536,000 నుండి తగ్గింది. విద్యార్థుల వంటి షార్ట్-టర్మ్ వలసలను శాశ్వత వలసలతో కలపడం వల్ల అపోహలు పెరుగుతున్నాయంటున్నారు.
March for Australia.
— Jackson Moon (@jacksonmoon) August 31, 2025
These are the “racists” @BradBattinMP was talking about? Families like this? The march called for immigration to be managed to ease pressure on housing & jobs, and so newcomers embrace the Australian way of life. pic.twitter.com/1Tw8ljUAlW
జూన్ 2023 నాటికి ఆస్ట్రేలియాలో భారతీయ మూలం కలిగిన నివాసితుల సంఖ్య దాదాపు 845,800గా ఉంది. ఆస్ట్రేలియాకు యూకే నుంచి ఎక్కువ మంది వస్తున్నారు. వారి తర్వాత ఇండియన్స్ ఉన్నారు. ఓవర్సీస్-బోర్న్ జనాభాలో 10.3% , మొత్తం జనాభాలో 3.2% ఉన్నారు, చాలా మంది ఐటీ, ఆరోగ్య సంరక్షణ, ఇంజనీరింగ్ వంటి అధిక నైపుణ్యం కలిగిన రంగాల్లో పనిచేస్తున్నారు .ఇవి ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థకు కీలకమైనవి.
అయినప్పటికీ, ఈ పెరుగుదల అసంతృప్తిని రేకెత్తించింది. సోషల్ మీడియాలో కొంతమంది ఫార్-రైట్ వాయిస్‌లు లేబర్ ప్రభుత్వం వలసల ద్వారా "వోట్ ఫార్మింగ్" చేస్తోందని ఆరోపించారు, గత ఎన్నికలలో 85% భారతీయ డయాస్పోరా లేబర్‌కు ఓటు వేసిందని సర్వేలను ఉదహరించారు.
Behold the absolute racist tendencies that the March for Australia rally brought up. This Indian-Australian man despite attempting to appease these bigots got heckled because of an immutable characteristic like his ethnicity. Shame on those in the crowd. 😡😡😡#MarchForAustralia pic.twitter.com/5UrcEBpSos
— Workers Party of Australia (@OzWorkersParty) September 1, 2025
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రభుత్వం ఈ ర్యాలీలను "జాత్యహంకారం , ఎథ్నోసెంట్రిజంలో ఆధారితమైన ఫార్-రైట్ యాక్టివిజం" అని ఖండించింది. వైవిధ్యం జాతీయ బలం అని స్పష్టం చేశారు. దీంతో భారతీయులకు కొంత ధైర్యం వచ్చినట్లయింది.





















