News
News
X

PM Modi: 'వెయిట్ చేయొద్దు, వెంబడించండి'- ఉగ్రవాదులకు మోదీ మాస్ వార్నింగ్

PM Modi: ఉగ్రవాదులకు ప్రధాని నరేంద్ర మోదీ వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రదాడి ఏ ప్రాంతంలో జరిగినా ప్రతిస్పందన మాత్రం తీవ్రంగా ఉంటుందన్నారు.

FOLLOW US: 

PM Modi: దిల్లీలో జరిగిన 'నో మనీ ఫర్ టెర్రర్' సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తీవ్రవాద దాడులకు అంతే తీవ్రంగా సమాధానం ఇవ్వాలని మోదీ అన్నారు. ఉగ్రదాడి ఏ ప్రాంతంలో జరిగినా.. ఏ స్థాయిలో ఉన్నా ప్రతిస్పందన మాత్రం తీవ్రంగా ఉండాలన్నారు.

" ఉగ్రవాద సంస్థలకు అనేక వనరుల ద్వారా డబ్బు లభిస్తుందని అందరికీ తెలుసు. కొన్ని దేశాలు తమ విదేశాంగ విధానంలో భాగంగా ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నాయి. అవి వారికి రాజకీయ, సైద్ధాంతిక, ఆర్థిక సహాయాన్ని అందిస్తాయి. ఆ అండ చూసుకొని ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా భారత్‌ అనేక విధాలుగా ఉగ్రదాడులను ఎదుర్కొంటోంది. ఎన్నో విలువైన ప్రాణాలను మనం కోల్పోయాం. కానీ దీనిపై మనం ధైర్యంగా పోరాడుతున్నాం. మన ప్రజలు సురక్షితంగా ఉండాలని మనం కోరుకుంటే.. ఉగ్రవాదం మన ఇంటి లోపలికి వచ్చేవరకు వేచి చూడకూడదు. మనమే ముష్కరులను వెంబడించాలి. వారికి మద్దతుగా ఉన్న నెట్‌వర్క్‌లను విచ్ఛిన్నం చేయాలి. వారి ఆర్థిక వ్యవస్థలను దెబ్బకొట్టాలి. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేంతవరకూ మా ప్రభుత్వం విశ్రాంతి తీసుకోదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్‌ ప్రపంచం ఏకమవ్వాల్సిన అవసరం ఉంది. "
-                                                 ప్రధాని నరేంద్ర మోదీ

News Reels

రెండు రోజుల పాటు జరిగే ఈ 'నో మనీ ఫర్‌ టెర్రర్‌' సదస్సులో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మంత్రులతో పాటు ఫైనాన్షియల్‌ యాక్షన్ టాస్క్‌ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఏ) సభ్యులు, పలు ఉగ్ర నిరోధక సంస్థల అధినేతలు కలిపి దాదాపు 450 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. 

Also Read: Twitter Resignations: కొంపముంచిన మస్క్ అల్టిమేటం- వందల మంది ఉద్యోగులు రిజైన్!

Published at : 18 Nov 2022 11:46 AM (IST) Tags: PM Modi Terrorist Attacks No Money For Terror Conference

సంబంధిత కథనాలు

Bengaluru Crime News: డబ్బుతో ఉడాయించిన ATM సెక్యూరిటీ గార్డు, గర్ల్‌ఫ్రెండ్‌తో పెళ్లి ఖర్చుల కోసమట

Bengaluru Crime News: డబ్బుతో ఉడాయించిన ATM సెక్యూరిటీ గార్డు, గర్ల్‌ఫ్రెండ్‌తో పెళ్లి ఖర్చుల కోసమట

Kerala Govt: కొత్త బిల్లు ప్రవేశపెట్టనున్న కేరళ సర్కార్- గవర్నర్‌ను తప్పించేందుకు!

Kerala Govt: కొత్త బిల్లు ప్రవేశపెట్టనున్న కేరళ సర్కార్- గవర్నర్‌ను తప్పించేందుకు!

Mulugu Agency: మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్ల కలకలం - ఆరుగురు మిలీషియా సభ్యుల అరెస్ట్

Mulugu Agency: మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్ల కలకలం - ఆరుగురు మిలీషియా సభ్యుల అరెస్ట్

డేటింగ్ యాప్స్‌ను బాగా వాడేస్తున్న చైనా ప్రజలు, ఎందుకోసమంటే?

డేటింగ్ యాప్స్‌ను బాగా వాడేస్తున్న చైనా ప్రజలు, ఎందుకోసమంటే?

Hyderabad News: కొంపముంచిన క్రిప్టో కరెన్సీ - 27 లక్షల రూపాయలు స్వాహా!

Hyderabad News: కొంపముంచిన క్రిప్టో కరెన్సీ - 27 లక్షల రూపాయలు స్వాహా!

టాప్ స్టోరీస్

Jagan On Vidya Deevena : గత పాలకులు బటన్ నొక్కి డబ్బులెందుకు ఇవ్వలేకపోయారు ? - మదనపల్లిలో సీఎం జగన్ ప్రశ్న !

Jagan On Vidya Deevena : గత పాలకులు బటన్ నొక్కి డబ్బులెందుకు ఇవ్వలేకపోయారు ?  - మదనపల్లిలో సీఎం జగన్ ప్రశ్న !

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

Lucky Lakshman Teaser : లక్ష్మణ్ గారి లక్ ఎంత? పాన్ ఇండియా రూటులో 'బిగ్ బాస్' సోహైల్

Lucky Lakshman Teaser : లక్ష్మణ్ గారి లక్ ఎంత? పాన్ ఇండియా రూటులో 'బిగ్ బాస్' సోహైల్