అమ్మాయిల శవాలపై అత్యాచారం, తట్టుకోలేక సమాధులకు తాళాలు
Pakistan Graves: పాకిస్థాన్‌లో అమ్మాయిల శవాలపై అత్యాచారానికి పాల్పడుతున్నారు.
Pakistan Graves Locked:
పాకిస్థాన్‌లో దారుణం..
సమాధులకు తాళం వేసుకోవడం ఎక్కడైనా విన్నారా..? అవును వాటికి కూడా రక్షణ లేకుండా పోతోందట. ఎక్కడో కాదు. మన దాయాది దేశం పాకిస్థాన్‌లోనే. అక్కడి పౌరులు సమాధులకూ తాళాలు వేస్తున్నారు. ఎందుకో తెలిస్తే చాలా ఎమోషనల్ అయిపోతాం. కూతుళ్లను పోగొట్టుకున్న తల్లిదండ్రులు ఈ పని చేస్తున్నారు. తమ కూతుళ్లు సమాధులకు తాళం వేసి ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఎందుకిలా..అని ఆరా తీస్తే దారుణమైన విషయం వెలుగులోకి వచ్చింది. అమ్మాయిల మృతదేహాలతోనూ కొందరు అసభ్యకరమైన పనులు చేస్తున్నారు. దీన్నే Necrophilia అంటారు. దేశవ్యాప్తంగా ఈ కేసులు పెరుగుతున్నాయి. చనిపోయిన అమ్మాయిల మృతదేహాలను బయటకు తీసి దారుణాలకు పాల్పడుతున్నారు. పాకిస్థాన్‌లో ప్రతి రెండు గంటలకు ఓ మహిళ అత్యాచారానికి గురవుతోంది. ఇదే అతి పెద్ద సవాలు అనుకుంటుంటే..ఇప్పుడు శవాలనూ వదిలిపెట్టడం లేదు కొందరు. అందుకే...అలా అమ్మాయిల సమాధులకు తాళాలు వేసి మరీ శవాల్ని కాపాడుకోవాల్సి వస్తోంది. వింటుంటేనే గుండె మెలి పెట్టినట్టు అవుతోంది కదా. ఇక ఆ తల్లిదండ్రుల బాధ ఎలా ఉండాలి..!
I bet most of you haven't seen or heard of a grave being padlocked.
— Sanjay Singh (@drssingh1953) April 29, 2023
This is in Pakistan where dead daughters or wives are being buried and padlocked, so that sexually frustrated Pakistani men do not rape dead bodies. This is not a joke.
. pic.twitter.com/deaAd27sxH
2011 నుంచే..
ఇలా శవాలతో కోరికలు తీర్చుకునే దారుణాలు 2011 నుంచే జరుగుతున్నాయట. కరాచీలోని నార్త్ నిజామాబాద్‌లో ఓ సమాధి వద్ద పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. చాలా రోజుల పాటు విచారించారు. చివరకు అసలు విషయం చెప్పాడు ఆ నిందితుడు. ఇప్పటి వరకూ 48 మంది మహిళల మృత దేహాలను అత్యాచారం చేసినట్టు చెప్పాడు. ఇది విని పోలీసులు షాక్ అయ్యారు. అటు మానవ హక్కుల సంఘం కూడా ఈ నేరాన్ని చాలా తీవ్రంగా పరిగణించింది. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. పాక్‌లోని 40% మహిళలు ఏదో రకంగా వేధింపులు ఎదుర్కొంటున్నారని మండి పడుతోంది. ఇప్పటి వరకూ దీనిపై పాక్ ప్రభుత్వం స్పందించలేదు. ఆ దేశంలో మహిళల భద్రతకు ఎలాంటి భరోసా లేదని మరోసారి ఈ ఘటనలతో ప్రపంచానికి తెలిసొచ్చింది. ఇక్కడ ఇంకా దారుణమైన విషయం ఏంటంటే...సమాధులకు తాళాలు వేస్తున్నా కొందరు వాటిని పగలగొట్టి మరీ అత్యాచారం చేస్తున్నారట.
తిండిలేక తిప్పలు
ద్రవ్యోల్బణం తారస్థాయికి చేరుకుని నానా అవస్థలు పడుతున్నారు పాక్ పౌరులు. ఒక్క పూట తిండికే కష్టంగా ఉంది. అగ్గిపెట్టె నుంచి పెట్రోల్ వరకూ అన్ని ధరలూ దారుణంగా పెరిగాయి. నిత్యావసరాల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. వీటిని కొనే స్థోమత చాలా మంది ఆకలితోనే బతుకుతున్నారు. రేషన్ షాప్‌లు, పెట్రోల్ బంక్‌ల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. అంత ఎదురు చూసినా దొరుకుతుందన్న నమ్మకం లేదు. ఇప్పటికే చాలా బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు నిండుకున్నాయి. రేషన్ షాపుల్లోనూ ఏమీ మిగలడం లేదు. తగినంత సరుకులు లేక గంటల పాటు ఎదురు చూసి ఖాళీ సంచులతో ఇళ్లకు తిరిగి వెళ్తున్నారు పౌరులు.
Also Read: సూర్యుడు జస్ట్ గ్యాప్ ఇచ్చాడంతే, మే నెలలో మళ్లీ నిప్పులే - ఎకానమీకి కూడా ముప్పే