Noida International Airport: ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయానికి మోదీ శ్రీకారం.. ఆ రికార్డ్ యూపీదే!
ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు భూమిపూజ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ ఎయిర్‌పోర్టును నిర్మిస్తున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో నిర్మించనున్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు శంకుస్థాపన చేశారు. నిర్మాణం పూర్తయితే ఆసియాలోనే ఇది అతిపెద్ద విమానాశ్రయంగా రికార్డ్ సృష్టించనుంది.యూపీలోని గౌతమ బుద్ధ నగర్ జిల్లా జెవెర్ ప్రాంతంలో ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సహా పలువురు హాజరయ్యారు.
#WATCH | After laying foundation stone of Noida International Airport, PM Modi says, "For us, infrastructure is a matter of national building, not politics. Our endeavour is to complete infrastructure project within the stipulated time period."
— ANI UP (@ANINewsUP) November 25, 2021
(Source: DD) pic.twitter.com/i8HoY1crc3
ప్రత్యేకతలు..
- భారీ వ్యయంతో ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. తొలి దశలో రూ. 10,050 కోట్లతో పనులు చేపట్టారు. పూర్తిగా ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు దాదాపు రూ.34 నుంచి రూ.35 వేల కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉంది.
- అత్యాధునిక హంగులతో ఎయిర్‌పోర్టును రూపొందిస్తున్నారు.
- ఏడాదికి 1.2 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యంతో ఎయిర్‌పోర్టును నిర్మిస్తున్నారు.
- 1300 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మితమవుతోన్న ఈ విమానాశ్రయం ఆసియాలో అతిపెద్ద ఎయిర్‌పోర్ట్ కానుంది.
- దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఇది రెండో అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం కానుంది.
- ఈ విమానాశ్రయం నిర్మాణమైతే దేశంలోనే ఐదు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులు ఉన్న ఏకైక రాష్ట్రంగా యూపీ అవతరించనుంది.
- 2024 సెప్టెంబర్, అక్టోబర్ నాటికి దీనిని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
Also Read: Kangana Ranaut: కంగనాకు దిల్లీ అసెంబ్లీ సమన్లు.. సిక్కులపై వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం
Also Read: NEET Counselling 2021 Postponed: నీట్ కౌన్సిలింగ్ వాయిదా.. 'ఈడబ్ల్యూఎస్'పై కేంద్రం పునరాలోచన!
Also Read: Toilet Paper: బాబూ చిట్టీ.. ఇదేం రాజీనామా లేఖ నాయనా.. రాసేందుకు ఇంకెక్కడ ప్లేస్ దొరకలేదా?
Also Read: INS Vela Pics: భారత అమ్ములపొదిలో ఐఎన్ఎస్ వేలా.. ఇది చాలా స్పెషల్ గురూ!
Also Read: Watch Video: 'రోడ్లు.. కత్రినా కైఫ్ బుగ్గల్లా ఉండాలి.. 'ఏంటి బాబు.. ఏమన్నావు?
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 9,119 కరోనా కేసులు, 396 మరణాలు నమోదు
Also Read: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం
Also Read: చల్లని పాలు తాగితే లాభమా లేక వేడి పాలు మంచివా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
Also Read: నిద్రసరిగా పట్టడం లేదా... ఆహారంలో ఉప్పు తగ్గించండి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి