Watch Video: 'రోడ్లు.. కత్రినా కైఫ్ బుగ్గల్లా ఉండాలి.. 'ఏంటి బాబు.. ఏమన్నావు?
రహదారులు కత్రినా కైఫ్ బుగ్గల్లా ఉండాలని రాజస్థాన్‌కు చెందిన ఓ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
రాజస్థాన్‌కు చెందిన ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. రహదారులు నటీమణులు హేమామాలిని, కత్రినా కైఫ్ బుగ్గల్లా ఉండాలని రాజస్థాన్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి రాజేంద్ర సింగ్ గుఢా వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో మీరు చూడండి.
ఝుంఝునూ జిల్లాలోని ఓ గ్రామంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రోడ్లు దారుణంగా ఉన్నాయని ప్రజలు ఫిర్యాదు చేయగా రాజేంద్ర సింగ్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
#WATCH | "Roads should be made like Katrina Kaif's cheeks", said Rajasthan Minister Rajendra Singh Gudha while addressing a public gathering in Jhunjhunu district (23.11) pic.twitter.com/87JfD5cJxV
— ANI (@ANI) November 24, 2021
రాజకీయ నాయకులు రహదారులను సినీతారల బుగ్గలతో పోల్చడం ఇదేం తొలిసారి కాదు.
- 2005లో ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా రహదారుల్ని హేమమాలిని బుగ్గల్లా నున్నగా చేస్తానంటూ హామీ ఇచ్చారు. అప్పట్లో అది వివాదాస్పదమైంది.
- 2013లో యూపీలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మంత్రి రాజారాం పాండే ప్రతాప్‌గఢ్ జిల్లాలో రహదారులను సినీతారలు హేమమాలిని, మాధురీ దీక్షిత్ బుగ్గల్లా నిర్మిస్తామంటూ చెప్పారు.
- మధ్యప్రదేశ్ న్యాయశాఖ మంత్రి పీసీ శర్మ కూడా 2019లో తమ రాష్ట్రంలో గుంతలమయమైన రోడ్లను సుందరంగా.. ‘డ్రీమ్‌గర్ల్’ స్టార్ బుగ్గల్లా మారుస్తామంటూ వ్యాఖ్యానించారు.
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 9,119 కరోనా కేసులు, 396 మరణాలు నమోదు
Also Read: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం
Also Read: చల్లని పాలు తాగితే లాభమా లేక వేడి పాలు మంచివా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
Also Read: నిద్రసరిగా పట్టడం లేదా... ఆహారంలో ఉప్పు తగ్గించండి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి