Corona Cases: దేశంలో కొత్తగా 9,119 కరోనా కేసులు, 396 మరణాలు నమోదు
దేశంలో కొత్తగా 9,119 కేసులు నమోదుకాగా 396 మంది మృతి చెందారు.
![Corona Cases: దేశంలో కొత్తగా 9,119 కరోనా కేసులు, 396 మరణాలు నమోదు India Reports 9,119 Coronavirus Cases, 396 Deaths In Last 24 Hrs. Most Fatalities From Kerala Corona Cases: దేశంలో కొత్తగా 9,119 కరోనా కేసులు, 396 మరణాలు నమోదు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/26/3aebf24c75117435945023f561c15cd0_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. కొత్తగా 9,119 కేసులు నమోదుకాగా 396 మంది మృతి చెందారు. 10,264 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,09,940కి చేరింది. గత 539 రోజుల్లో ఇదే అత్యల్పం.
#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) November 25, 2021
𝐂𝐎𝐕𝐈𝐃 𝐅𝐋𝐀𝐒𝐇https://t.co/duTyHHLe92 pic.twitter.com/u9rK6pSXDg
రికవరీ రేటు 98.33%గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యధికం. మొత్తం రికవరీల సంఖ్య 3,39,67,962కు పెరిగింది.
కేరళ..
కేరళలో కరోనా కేసుల సంఖ్య 51 లక్షలు దాటింది. ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 51,02,125కు పెరిగింది. కొత్తగా 4,280 కరోనా కేసులు నమోదవగా 308 మంది మృతి చెందారు. నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు తగ్గాయి. మొత్తం మృతుల సంఖ్య 38,353కు పెరిగింది.
మొత్తం 14 జిల్లాల్లో తిరువనంతపురంలో అత్యధికంగా 838 కేసులు నమోదయ్యాయి. ఎర్నాకులం (825), త్రిస్సూర్ (428) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
గత 24 గంటల్లో 48,916 కరోనా శాంపిళ్లను పరీక్షించారు.
మహారాష్ట్ర..
మహారాష్ట్రలో కొత్తగా 960 కరోనా కేసులు నమోదయ్యాయి. 41 మంది మృతి చెందారు. గత నాలుగు రోజులుగా రోజువారి కేసులు 10 వేల కంటే తక్కువగా ఉన్నాయి.
Also Read: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం
Also Read: చల్లని పాలు తాగితే లాభమా లేక వేడి పాలు మంచివా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
Also Read: నిద్రసరిగా పట్టడం లేదా... ఆహారంలో ఉప్పు తగ్గించండి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)