Kiran Abbavaram: థియేటర్లలో ఆ డైలాగ్స్ ఎంజాయ్ చేస్తున్నారు - 'కె ర్యాంప్' టైటిల్ వెనుక రీజన్ అదే... కిరణ్ అబ్బవరం కామెంట్స్
K RAMP: 'కె ర్యాంప్' అనే టైటిల్ అసభ్య పదం కాదంటూ మూవీ టీం క్లారిటీ ఇచ్చింది. సినిమాలో ఫ్యామిలీ, ఫన్, ఎమోషన్స్ అన్నీ ఉంటాయంటూ హీరో కిరణ్ అబ్బవరం స్పష్టం చేశారు.

Kiran Abbavaram About K RAMP Movie: ప్రస్తుతం థియేటర్లలో ఆడియన్స్ మాస్ డైలాగ్స్ ఎంజాయ్ చేస్తున్నారని యంగ్ హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. ఆయన లేటెస్ట్ మాస్ కామెడీ ఎంటర్‌టైనర్ 'కె ర్యాంప్' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మూవీ టీం ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది.
ఆ డైలాగ్స్ ఎంజాయ్ చేస్తున్నారు
'కె ర్యాంప్' మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, సాంగ్స్, గ్లింప్స్, టీజర్ ఆకట్టుకుంటున్నాయి. ఇక టైటిల్‌తో పాటు టీజర్‌లో కొన్ని అసభ్య పదాలుండండం ఇబ్బందికరంగా అనిపించింది. దీనిపై విమర్శలు రాగా హీరో కిరణ్ అబ్బవరం క్లారిటీ ఇచ్చారు. 'థియేటర్‌లో కూర్చుని నవ్వుకునే వైబ్ ఉన్న సినిమా కె ర్యాంప్. హీరో క్యారెక్టర్‌కు అనుగుణంగా కొన్ని డైలాగ్స్ మూవీలో ఉంటాయి. అంతే తప్ప అసభ్య పదాలు ఎక్కడా సినిమాలో ఉండవు. ట్రైలర్ వచ్చిన తర్వాత అందరికీ ఫుల్ క్లారిటీ వస్తుంది.
నేను 'సమ్మతమే' అనే మూవీ పద్ధతిగా తీశాను. థియేటర్లకు ఎవరూ రాలేదు. రీసెంట్‌గా ఓ మూవీ చూశాను. ఆ మూవీ చాలా బాగుంది. అందులో అసభ్య డైలాగ్స్ వచ్చినప్పుడు ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేశారు. ఇక్కడ నేను ఏ సినిమాను తప్పుపట్టడం లేదు. కానీ క్యారెక్టర్‌ను బట్టి కొన్ని డైలాగ్స్ పెట్టాల్సి వస్తుంది. టీజర్ విషయంలో మేము అదే చేశాం. కానీ మూవీ చూసిన తర్వాత ట్రోలింగ్స్, విమర్శలకు ఆస్కారం ఉండదు. ఫ్యామిలీ ఎలిమెంట్స్, ఎమోషన్స్ అన్నీ మా సినిమాలో ఉంటాయి. అందరూ ఎంజాయ్ చేస్తారు.' అని స్పష్టం చేశారు కిరణ్.
Also Read: 'ఓజాస్ గంభీర' కూతురు సయేషా - యాడ్స్ To మూవీస్... చైల్డ్ ఆర్టిస్ట్ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
యూత్ సెంట్రిక్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలానే మూవీ ఉంటుందని కిరణ్ తెలిపారు. 'కె ర్యాంప్ వైబింగ్ మూవీ. షూటింగ్ సరదాగా సాగింది. నేను పవన్ కల్యాణ్ ఫ్యాన్. డైరెక్టర్ జైన్స్ నాని మహేష్ బాబు ఫ్యాన్. వీళ్ల ఫ్యాన్స్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందీ చిత్రం. మూవీ రిలీజ్ అయ్యాక ఆడియన్స్ కూడా నవ్వుతూనే ఉంటారు.' అని చెప్పారు.
కె ర్యాంప్ టైటిల్‌పై...
'కె ర్యాంప్' అంటే అసభ్య పదం అని చాలా మంది అనుకుంటున్నారని డైరెక్టర్ జైన్స్ నాని తెలిపారు. దాని అర్ధం 'కిరణ్ అబ్బవరం ర్యాంప్' అని వివరించారు. 'హీరో కిరణ్‌ను దృష్టిలో పెట్టుకునే స్క్రిప్ట్ రాశాను. సినిమాలో హీరో పేరు కుమార్. అందుకే కె ర్యాంప్ అని టైటిల్ పెట్టాం. ఫ్యామిలీ ఆడియన్స్‌ను మూవీ ఆకట్టుకుంటుంది.' అని చెప్పారు.
ఈ మూవీలో కిరణ్ సరసన యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీరితో పాటు సీనియర్ హీరో నరేష్, వెన్నెల కిషోర్, సాయి కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ సంస్థల సమర్పణలో రాజేష్ దండ, శివ బొమ్మకు నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 18న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.





















