Hyderabad to Kashmir IRCTC Package: హైదరాబాద్ నుంచి కాశ్మీర్ వెళ్లాలని ఉందా.. IRCTC 6 రోజుల టూర్ ప్యాకేజీ మీకోసం
Hyderabad to kashmir IRCTC tour packages | భూమ్మీద స్వర్గంగా భావించే కాశ్మీర్ యాత్రకు హైదరాబాద్ నుంచి IRCTC 6 రోజుల ప్యాకేజీని అందిస్తుంది. కాశ్మీర్ అందాలను చూడాలంటే టికెట్లు బుక్ చేసుకోండి.

IRCTC tour packages From Hyderabad | హైదరాబాద్: భూతల స్వర్గంగా పిలుచుకునే కాశ్మీర్ తన అందాలు, తన సహజ సౌందర్యంతో అందరినీ ఆకర్షిస్తుంది. ఇక్కడి అందమైన లోయలు, మేఘాలను తాకుతూ ఉండేలా ఎత్తైన పర్వతాలు, రంగురంగుల పువ్వులతో అలంకరించినట్లు ఉంటే లోయలు కాశ్మీర్‌ను నిజంగానే స్వర్గంగా మారుస్తాయి. చాలా మంది జీవితంలో ఒక్కసారైనా కాశ్మీర్ వెళ్లాలని భావిస్తుంటారు. కానీ ఖర్చుల కారణంగా, ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోలేని కారణంగా కూడా కొందరు మనసు మార్చుకుంటారు. అయితే, మీరు నిరాశ చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే IRCTC మీ కోసం అద్భుతమైన టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. దీనిలో మీరు కూడా కాశ్మీర్ పచ్చటి మైదానాలు, సరస్సులు, లోయలు, నదులు, చాలా అందమైన దృశ్యాలను ఆస్వాదించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు వెంటనే ఈ IRCTC కాశ్మీర్ టూర్ ప్యాకేజీ గురించి తెలుసుకోండి.
టూర్ ప్యాక్ వివరాలు ఇవే
కాశ్మీర్ అందాలను ఆస్వాదించడానికి, ఐఆర్‌సీటీసీ మిస్టికల్ కాశ్మీర్ (IRCTC MYSTICAL KASHMIR) పేరుతో ఒక టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. దీని ద్వారా ప్రయాణికులు బడ్జెట్ ధరలోనే ఏ ఇబ్బంది లేకుండా కాశ్మీర్ ను సందర్శించవచ్చు. 5 రాత్రులు, మొత్తం 6 రోజులు ఉండే ఈ టూర్ ప్యాకేజీ కోడ్ SHA11. ఈ కాశ్మీర్ టూర్ ప్యాకేజీలో మీకు ఆహారం నుంచి వసతి వరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. మీకు ఏ ఇబ్బంది లేకుండా టూర్ ప్లాన్ చేస్తారు.
హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ, ప్రారంభం ఎప్పుడు?
IRCTC అందిస్తున్న కాశ్మీర్ టూర్ ప్యాకేజీ అక్టోబర్ 6, 2025 న ప్రారంభమవుతుంది. ఈ కాశ్మీర్ యాత్ర దక్షిణ భారతదేశంలోని హైదరాబాద్ నగరం నుంచి ప్రారంభమవుతుంది, ఇందులో ప్రయాణికులను గుల్మార్గ్, పహల్గామ్(Pahalgam), సోన్మార్గ్, శ్రీనగర్ వంటి ప్రధాన పర్యాటక ప్రదేశాలకు తీసుకెళతారు. ప్రయాణికులను శ్రీనగర్ లోని మొఘల్ గార్డెన్, బొటానికల్ గార్డెన్, పహల్గామ్ లోని బేతాబ్ వ్యాలీ, చందన్వాడి వంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు టూరిస్టులను తీసుకెళతారు.
అదనపు సౌకర్యాలు ఏం లభిస్తాయి?
ఈ టూర్ సమయంలో, ప్రోగ్రామ్ ప్రకారం రాకపోకల ఖర్చు ప్యాకేజీలో మెన్షన్ చేశారు. అలాగే, ఇందులో ఒక రాత్రి హౌస్ బోట్‌లో బస చేసే ఏర్పాట్లు కూడా ఉన్నాయి. దీంతో పాటు ఈ IRCTC టూర్ ప్యాకేజీలో ట్రావెల్ ఇన్సూరెన్స్, టోల్, పార్కింగ్, టాక్స్ వంటి అదనపు సౌకర్యాలు కూడా ఉన్నాయి.
ప్యాకేజీ ధర వివరాలు
IRCTC ప్రయాణికుల ఖర్చులు, బడ్జెట్ దృష్టిలో ఉంచుకుని ఈ టూర్ ప్యాకేజీ ధరను నిర్ణయించింది. దీని ధర ఈ విధంగా నిర్ణయించారు.
సింగిల్ ఆక్యుపెన్సీ అయితే ధర: ₹45100
డబుల్ ఆక్యుపెన్సీకి ప్యాకేజీ ధర: ₹34950
ట్రిపుల్ ఆక్యుపెన్సీకి ప్యాకేజీ ధర: ₹33510
చిన్నారులకు బెడ్ అయితే (5-11 సంవత్సరాలు) రూ .28020/
బెడ్ లేకుండా చిన్నారులు (5-11 సంవత్సరాలు) రూ .25400/
బెడ్ లేకుండా చిన్నారులు (2-4 సంవత్సరాలు) రూ .19400/
మరిన్ని డిటైల్స్ కోసం https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHA11 ఈ పేజీని సందర్శించవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం.. హైదరాబాద్ నుంచి కాశ్మీర్ వెళ్లడానికి ఈ టూర్ ప్యాకేజీ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. వెంటనే ఈ ప్యాకేజీని బుక్ చేసుకోండి. ఏ ఇబ్బంది లేకుండా మీరు కాశ్మీర్ ను సందర్శించండి.






















