అన్వేషించండి

IRCTC Water Rail Neer: రైల్ నీర్ ధరలను తగ్గించిన ఇండియన్ రైల్వేస్.. బాటిల్ వాటర్ ఇప్పుడు మరింత చౌక

Rail Neer Price Cut | భారతీయ రైల్వే ఉత్పత్తి అయిన రైల్ నీర్ ధరలు తగ్గించింది. 1 లీటర్ బాటిల్ ఇక 14 రూపాయలు, 500 ml 9 రూపాయలకు సెప్టెంబర్ 22 నుండి అమలులోకి వస్తుంది.

రైల్వే ప్రయాణికులకు ఒక శుభవార్త. ఇటీవల జీఎస్టీ తగ్గించిన తరువాత, భారతీయ రైల్వే (Indian Railways) తన ప్రసిద్ధ బాటిల్ వాటర్ బ్రాండ్ అయిన రైల్ నీర్ ధరలను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే రైళ్లలో, రైల్వే స్టేషన్లలో విక్రయించే ఇతర ప్యాక్ చేసిన నీటి ధరలను కూడా తగ్గించింది.

సెప్టెంబర్ 20, 2025న విడుదల చేసిన అధికారిక నోటీసులో రైల్వే బోర్డు అన్ని జనరల్ మేనేజర్‌లు, ఐఆర్‌సిటిసి ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌లకు రైల్ నీర్ గరిష్ట రిటైల్ ధర (ఎంఆర్‌పి) ఒక లీటరుకు ₹15 నుండి ₹14కి తగ్గించింది. 500 ml బాటిల్‌కు ₹10 నుండి రూ.9కి తగ్గించాలని సూచించింది. ఈ ధరల సర్దుబాటు రైల్ నీర్‌కు మాత్రమే కాకుండా, రైల్వే స్టేషన్లలో, రైళ్లలో విక్రయించే ఇతర ఐఆర్‌సిటిసి (IRCTC), రైల్వే ఆమోదిత బాటిల్ వాటర్ బ్రాండ్‌లకు కూడా తాజా నిర్ణయం వర్తిస్తుంది.

“ఈ నిర్ణయం ప్రయాణికులకు జీఎస్టీ తగ్గింపు ప్రత్యక్ష ప్రయోజనాన్ని అందిస్తుంది” అని నోటీసులో పేర్కొన్నారు. కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుండి అమలులోకి వస్తాయి. ఇది పన్ను ఆదాను ఆలస్యం చేయకుండా నేరుగా వినియోగదారులకు అందించడానికి భారతీయ రైల్వే నిబద్ధతను సూచిస్తుందని రైల్వేస్ అధికారులు పేర్కొన్నారు.

ఐఆర్‌సిటిసి ప్రధాన ఉత్పత్తి రైల్ నీర్

2003లో ప్రారంభించిన రైల్ నీర్ ఐఆర్‌సిటిసికి చెందిన ప్రధాన ఉత్పత్తి. ఇది ప్రయాణీకుల సౌకర్యాలను మెరుగుపరచడానికి, రైలు ప్రయాణాల సమయంలో సురక్షితమైన డ్రింకింగ్ వాటర్ అందించడానికి తీసుకొచ్చారు. మొదటి ఉత్పత్తి ప్లాంట్ న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ల నుండి ప్రయాణించే ప్రయాణికులకు సేవలు అందించే రాజధాని, శతాబ్ది వంటి ఎక్స్‌ప్రెస్ ప్రీమియం రైళ్లకు సరఫరా చేయడానికి ప్రత్యేకంగా పశ్చిమ ఢిల్లీలోని నాంగ్లోయిలో ఏర్పాటు చేశారని తెలిసిందే. 

ఎన్నో ఏళ్ల నుంచి రైళ్లలో నమ్మదగిన, పరిశుభ్రమైన తాగునీటికి రైల్ నీర్ పర్యాయపదంగా మారింది. ఇప్పుడు, తాజాగా ధర తగ్గిస్తూ రైల్వే నిర్ణయం తీసుకుంది. రైల్వే బోర్డు వాణిజ్య సర్క్యులర్ నం. 18, 2025 కొత్త ధరల నిర్ణయాన్ని నిర్ధారిస్తుంది. అన్ని భారతీయ రైల్వే శాఖలు, ఐఆర్‌సిటిసి అవుట్‌లెట్‌లు వెంటనే మార్పులను అమలు చేయాలని స్పష్టం చేశారు.

ప్రయాణ ఖర్చులు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే బాటిల్ వాటర్ వంటి రోజువారీ వస్తువులపై స్వల్పంగా తగ్గించడం ప్రయాణికులకు మార్పును సూచిస్తుంది. ఆన్ లైన్ పేమెంట్ చేస్తే చిల్లర సమస్య ఉండదు. లేకపోతే మీరు పాత ధరకే కొనాల్సి వస్తుంది. రైల్ నీర్ ధర తగ్గింపు భారతదేశం అంతటా లక్షలాది మందికి  ప్రయోజనం చేకూర్చనుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Embed widget