Asia Cup 2025 Sri Lanka Super Over | భారత్ పై పోరాడి ఓడిన లంక
ఆసియా కప్ 2025 లో ఎలాగైనా కప్ గెలుచుకోవాలని మొదలు పెట్టిన శ్రీలంక జర్నీ మధ్యలోనే ముగిసిపోయింది. ఆరు సార్లు కప్ సొంతం చేసుకున్న శ్రీలంక ఈ సంవత్సరం తమ ప్రతాపం చూపించాలని అనుకుంది. కానీ వరుసగా పాకిస్తాన్, బాంగ్లాదేశ్,ఇండియా చేతిలో ఓటమి పాలయింది. ప్రతి మ్యాచ్ లోను శ్రీలంక తమ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది అనే చెప్పాలి. చివరకు పోరాడి ఓడిపోయింది.
ఈ ఆసియా కప్ లో యంగ్ ప్లేయర్స్ తో పాటు సీనియర్ ప్లేయర్స్ ను ప్లేయింగ్ 11 లో చేర్చుతూ శ్రీలంక చాలా బ్యాలన్స్డ్ గా ఆడింది. అల్ రౌండర్ షో ప్రదర్శిస్తూ విశ్లేషకుల నుంచి ప్రసంశలు అందుకుంది. కానీ మ్యాచులు మాత్రం గెలవలేక పోయింది.
లీగ్ స్టేజ్ లో బాంగ్లాదేశ్, హొంగ్ కాంగ్, ఆఫ్ఘనిస్తాన్ పై ఘన విజయాలు సాధించింది శ్రీలంక. దాంతో శ్రీలంకను ఎదుర్కోవడానికి సూపర్ 4 లోని టీమ్స్ కసరత్తులు చేయాల్సి వచ్చింది. కానీ సీన్ రివర్స్ అయింది. సూపర్ 4 స్టేజ్ వరుసగా బాంగ్లాదేశ్, పాకిస్తాన్ చేతిలో ఓటమిను ఎదుర్కొంది. అక్కడితో ఆసియా కప్ లో తమ జర్నీ ముగించింది. కానీ ఎలాగైనా చివరి మ్యాచ్ లో భారత్ పై గెలిచి.. విజయంతో ఇంటికి వెళ్లాలని అనుకున్న లంకకు అది కూడా జరగలేదు. ఏదేమైనా శ్రీలంక తమ బ్యాటింగ్.... బౌలింగ్ తో విశేషకులతో పాటు ఫ్యాన్స్ నుంచి కూడా ప్రశంశలు అందుకుంది.





















