అన్వేషించండి

Modi Tour: అక్టోబర్ 16న కర్నూలులో మోదీ సహా కూటమి ముఖ్యనేతల రోడ్ షో -పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం

Kurnool Modi: అక్టోబర్ 16న మోదీ , పవన్ , చంద్రబాబు కర్నూలులో రోడ్ షో నిర్వహించారు. ప్రధాని మోదీ శ్రీశైలం ఆలయాన్ని సందర్శించనున్నారు.

Modi Pawan Chandrababu road show in Kurnool: ప్రధాని మోదీ అక్టోబర్ 16న ఏపీ పర్యటనకు రానున్నారు.   కర్నూలు-నంద్యాల జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు అలాగే  GST సంస్కరణల ర్యాలీ, శ్రీశైలం మల్లన్న దర్శనంతో పాటు కూటమి నేతలతో రోడ్ షో నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లతో కలిసి ప్రధాని మోదీ పాల్గొనే కార్యక్రమాలు ఖరారరయ్యాయి.                  

ప్రధాని మోదీ పర్యటన గురించి శాసనమండలి లాబీలో చెప్పిన లోకేష్                    

ప్రధాని మోదీ పర్యటన వివరాలను మంత్రి నారా లోకేష్ శనివారం శాసనమండలి లాబీలో సహచర మంత్రులు, ఎమ్మెల్సీలకు వివరించారు. అసెంబ్లీ ఆవరణలో జరిగిన ఈ సమావేశంలో లోకేష్, "ప్రధాని మోదీ పర్యటన రాష్ట్ర అభివృద్ధికి మైలురాయి. GST సంస్కరణలు, అభివృద్ధి ప్రాజెక్టులు ప్రజలకు ప్రయోజనం చేకూర్చనున్నాయి" అని చెప్పారు. పూర్తి షెడ్యూల్ త్వరలో విడుదల అవుతుందని ఆయన తెలిపారు.     

కర్నూలులో ర్యాలీ తర్వాత శ్రీశైలం స్వామి వారిని దర్శించుకోనున్న ప్రధాని మోదీ                    

పర్యటనలో ముఖ్య ఆకర్షణ కర్నూలులో జరిగే GST సంస్కరణలపై భారీ ర్యాలీ ఉంటుంది.  ఇటీవల సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వచ్చిన 'నెక్స్ట్ జెన్ GST' సంస్కరణలను ప్రధాని మోదీ ప్రజల ముందుంచనున్నారు. ఈ సంస్కరణలు పన్నుల భారాన్ని తగ్గించి, పేదలు, మధ్యతరగతులకు 'సేవింగ్స్ ఫెస్టివల్'గా మారాయని మోదీ జాతికి ఉద్దేశించిన ప్రసంగంలో చెప్పారు. ట్రాక్టర్లు, హార్వెస్టర్లపై GST 5%కి తగ్గింపు , చిన్న కార్లపై 28% నుంచి 18%కి, మరిన్ని వస్తువులపై పన్ను తగ్గింపులు.. వంటి వాటితో ఇప్పటికే కొనుగోళలు పెరిగాయి.           

కూటమి బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ                      

ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొంటారు. NDA కూటమి ఐక్యతను ప్రదర్శించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది.  ర్యాలీలో లక్షలాది మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోదీ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగనున్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, రైతు సంక్షేమ కార్యక్రమాలు, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి. మొత్తం విలువ రూ.10,000 కోట్లు మించవచ్చని అంచనా.                       

పవన్, చంద్రబాబు, లోకేష్ లు కూటమి ర్యాలీలో పాల్గొనే అవకాశం               
  
పర్యటనలో మరో ముఖ్య అంశం..ప్రధాని మోదీ శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి దర్శనం. ప్రధాని మోదీ కర్నూలు-నంద్యాల టూర్ ముగింపున శ్రీశైలం చేరుకుని స్వామి వారి దర్శనం చేసుకుంటారు.  పర్యటన ముగింపున కర్నూలులో NDA కూటమి నేతలతో రోడ్ షో జరుగనున్నది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్‌  ప్రధాని మోదీతో కలిసి పాల్గొంటారు.                   

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget