Toilet Paper: బాబూ చిట్టీ.. ఇదేం రాజీనామా లేఖ నాయనా.. రాసేందుకు ఇంకెక్కడ ప్లేస్ దొరకలేదా?
ఒక వ్యక్తి తన రాజీనామా లేఖను టాయిలెట్ పేపర్ పై రాశాడు. దానిని తన బాస్ కి పంపించాడు.
సాధారణంగా రాజీనామా లేఖను.. ఎక్కడ రాస్తారు. ఏ4 సైజ్ పేపర్ మీద రాసి.. ఇదిగోండి బాస్.. ఇక మీ కంపెనీలో నేను పని చేయలేను అని చెప్తారు. బాస్ మీద పీకల దాకా కోపం ఉంటే.. రాజీనామా లేఖను ఇచ్చే స్టైల్ వేరే ఉంటుందనుకోండి. ఇక ఇప్పుడు అప్ డేట్ అయ్యాం కాబట్టి.. రిజిగ్నేషన్ లేటర్ అనేది మెయిల్ రూపంలో పంపిస్తుంటాం. కానీ ఓ వ్యక్తి.. తన రాజీనామా లేఖను ఎలా పంపాడో తెలుసా? టాయిలెట్ పేపర్ మీద.
టాయిలెట్ పేపర్ ఎందుకు? ఎక్కడ? వాడుకుంటామో.. అందరికీ తెలిసిందే. కానీ ఓ వ్యక్తి మాత్రం.. తను వదులుకునే ఉద్యోగానికి ఆ పేపర్ ను వాడుకున్నాడు. అవునూ.. తన ఉద్యోగానికి రాజీనామా చేసేందుకు.. టాయిలెట్ పేపర్ మీద రాసిచ్చాడు. అయితే నెటిజన్లు అతడి క్రియేటివీటికి ఫిదా అయిపోతున్నారు.
అమెరికాకు చెందిన లూయిస్ అనే వ్యక్తి.. తన రాజీనామా లేఖను Redditలో పోస్ట్ చేశాడు. ఈ రోజు ఈ రాజీనామా లేఖను అందజేస్తున్నాను అంటూ రాసుకొచ్చాడు. దానికి ఓ ఫొటో జత చేశాడు. ఆ ఫొటోలో ఇలా ఉంది."యో, నేను 25వ తేదీన వెళ్లిపోతాను" అని రాసి ఉంది. అయితే అతను రాసి పోస్ట్ చేసింది టాయిలెట్ పేపర్ మీద. ఫొటోలో ఓ వ్యక్తి వెనక చూపిస్తున్నాట్టుగా కూడా ఉంటుంది. అది చూసి నెటిజన్లు తెగ ఫిదా అయిపోయారు.
Redditలో 70,000 మందికి పైగా యూజర్లు లూయిన్ రాజీనామా లేఖను లైక్ చేశారు. చాలామంది అతడిని 'cheeky' మరియు 'off key' అంటూ కామెంట్ చేశారు.
మీరు ప్రింట్ చేసి సంతకం చేసినట్టు కనిపిస్తుంది.. మీకు మోషన్స్ అవుతున్నాయని.. దాని కోసం సెలవు కావాలని అడిగినట్టు కనిపిస్తోందని ఓ నెటిజన్ దీనిపై కామెంట్ చేశాడు. అంతా బాగానే ఉందిగాని.. షేడింగ్, కలరింగ్, అక్షరాల్లో ఏదో తేడాగా ఉన్నట్టుందే.. దానిపై దృష్టి పెట్టండి.. ఆ తర్వాత వచ్చేవారం మీరు రిజైన్ చేయోచ్చు.. అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇలా రకరకాల కామెంట్లతో ఇప్పుడు ఆ పోస్ట్ వైరల్ అవుతుంది.
అయితే లూయిస్ దీనిపై.. సరదాగా స్పందిస్తున్నాడు. చెప్పాలంటే ఇది నిజంగా ప్రశాంతమైన పని.. నా యజమాని దీన్ని ఇష్టపడ్డాడు అంటూ.. రిప్లై ఇచ్చాడు.
Also Read: పెళ్లికాని జంటలకు హోటల్ రూమ్ ఎందుకివ్వరు? మన చట్టాలు ఏం చెబుతున్నాయ్?
Also Read: Marriage: మేనరికపు వివాహాలు మంచివి కావా? పుట్టే పిల్లల్లో నిజంగానే ఆరోగ్య సమస్యలు వస్తాయా?