X

పెళ్లికాని జంటలకు హోటల్ రూమ్ ఎందుకివ్వరు? మన చట్టాలు ఏం చెబుతున్నాయ్?

పెళ్లికాని జంటలకు కొన్ని హోటళ్లు రూమ్స్ ఇవ్వవు. ఒకే వేళ రూమ్ తీసుకున్నా.. పోలీసులు రైడ్ చేస్తారనే భయం చాలామందిని వెంటాడుతుంది. మరి దీనిపై మన చట్టాలు ఏం చెబుతున్నాయి?

FOLLOW US: 

పుల్స్ హోటల్‌కు వెళ్తే ఫస్ట్ ఎదురయ్యే ప్రశ్న.. ‘‘మీకు పెళ్లయ్యిందా? లేదా మీరు ఒకరికి ఒకరు ఏమవుతారు’’ అని. లేదా పెళ్లి కాని జంటలకు రూమ్ ఇవ్వమని ముఖం మీదే చెప్పేస్తారు. కొన్ని హోటళ్లో జంటలపై నిఘా పెడతారు. ఇది కస్టమర్లలో ఎంతో ఇబ్బందికర పరిస్థితి నెలకొంటుంది. పెళ్లికాని జంటలు ఒకే హోటల్ గదిలో ఏకాంతంగా ఉండటం నేరమా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అలాగే పోలీసులు రైడింగ్‌ల భయం కూడా ఉంటుంది. ధైర్యం చేసి హోటల్‌లో ఉన్నా.. ఏదో ఆందోళన వారిని వెంటాడుతూ ఉంటుంది. దీంతో చాలామంది సాధారణ హోటళ్లను కాకుండా OYO రూమ్స్ బుక్ చేసుకుంటున్నారు. మరి, మిగతా హోటళ్ల తరహాలో ఒయో రూమ్స్ ఎందుకు జంటలకు అభ్యంతరం చెప్పవు. పెళ్లి కాని జంటలకు గదులు ఇచ్చే ఆ హోటళ్లపై ఎందుకు చర్యలు తీసుకోరు అనే సందేహం చాలామందిలో ఉంది. ఆ డౌట్ తీరాలంటే.. పెళ్లికాని జంటలు హోటళ్లలో బస చేయడం గురించి మన చట్టాలు ఏం చెబుతున్నాయనేది తప్పకుండా తెలుసుకోవల్సిందే. 


మన చట్టాలు గురించి తెలుసుకొనే ముందు.. హోటల్ నిర్వాహకుల గురించి ముందుగా తెలుసుకోవాలి. కొంతమంది హోటళ్లకు బయట అమ్మాయిలను తీసుకొస్తారు. ఆ సమయంలో రైడింగ్స్ జరిగితే ఆ హోటల్ పరువు పోతుందని నిర్వాహకులు భావిస్తారు. అలాగే, వ్యభిచారం తదితర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలిసినప్పుడు పోలీసులు రైడ్ చేస్తారు. ఆ సమయంలో హోటల్‌లో బస చేసే మిగతావారిని కూడా ఎంక్వైరీ చేస్తారు. ఆ తర్వాత కూడా పోలీసులు నిరంతరం నిఘా పెడతారు. ఇలాంటి ఇబ్బందికర సమస్యలు ఉంటాయనే కారణంతో జంటలను, అనుమానస్పద వ్యక్తులకు రూమ్ ఇవ్వడానికి అంగీకరించరు. 


ఇక మన చట్టాల విషయానికి వస్తే.. పెళ్లికాని జంటలు హోటళ్లలో ఒకే గదిలో బస చేయవచ్చు. అయితే, వారి వయస్సు 18 ఏళ్లకు పైబడి ఉండాలి. తగిన గుర్తింపు కార్డులు కూడా ఉండాలి. పెళ్లి కాని జంటలు హోటళ్లలో ఉండకూడదని చెప్పేందుకు ఎలాంటి చట్టం లేదు. కానీ, మన దేశంలో కొన్ని హోటళ్లు, గెస్టు హౌస్‌లు వారికి రూమ్ ఇవ్వడానికి సందేహిస్తాయి. అయితే, అది హోటళ్లు నిర్వాహకులు విధించుకున్న సొంత నియమం. కాబట్టి.. వారి నియమాలను గౌరవించాలి. 


కోర్టులు ఏం చెబుతున్నాయ్?: 2019లో కొయంబతూర్ జిల్లా అధికారులు ఓ అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌కు సీల్ వేశారు. అందులో పెళ్లికాని జంటలు నివాసం ఉంటున్నాయని అందుకే చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ కేసు విచారించిన మద్రాస్ హైకోర్టు దీనిపై తీర్పు ఇస్తూ.. ‘‘హోటల్ రూమ్స్‌లో పెళ్లికాని జంటలు లేదా స్త్రీ, పురుషులు కలిసి ఉండకూడదనే నిబంధన ఏదీ లేదు. అలాగే పెళ్లికాకుండా ఒకే ఇంట్లో కలిసి సహజీవనం చేయడం కూడా నేరం కాదు’’ అని స్పష్టత ఇచ్చింది. 


❤ భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ద్వారా పౌరులకు ప్రైవసీ హక్కును అందిస్తోంది. లైంగిక స్వయంప్రతిపత్తి కూడా ఈ ఆర్టికల్‌లో అంతర్భాగం. దీనిపై 2017లో పుట్టస్వామి తీర్పు, 2018 నవతేజ్ జోహార్ తీర్పును సుప్రీంకోర్టు కూడా సపోర్ట్ చేసింది. 
❤ ఒకే నగరానికి చెందిన పెళ్లికాని జంటలు అదే నగరంలోని హోటల్‌లో బస చేయకూడదని చెబుతారు. కానీ, అది కూడా నేరం కాదు. 
❤ పెళ్లికాని జంటలు ఒకే ఇంట్లో అద్దెకు ఉండకూడదనే నిబంధన కూడా లేదు. అయితే, రెంట్ అగ్రిమెంట్‌లో ఇద్దరి పేర్లను చేర్చాలి. 
❤ పరస్పర అంగీకారంతో ఒకే హోటల్‌లో బస చేసే జంటలను పోలీసులు అరెస్ట్ చేయకూడదు.


ఎలాంటి హోటల్‌ను ఎంపిక చేసుకోవాలి?: మీరు బస చేసుకొనేందుకు తీసుకొనే హోటల్‌కు మంచి హిస్టరీ ఉందో లేదో తెలుసుకోండి. ఎందుకంటే.. కొన్ని హోటళ్లలో వ్యభిచారం విచ్చలవిడిగా సాగుతుంది. పోలీసులు పదే పదే ఆ హోటళ్లపై దాడులు చేస్తుంటారు. కాబట్టి.. అలాంటి హిస్టరీ లేని హోటళ్లనే ఎంచుకోండి. ఓయో, స్టే అంకుల్ వంటి సంస్థలు మంచి హోటళ్లను ఎంపిక చేసుకుని నిర్వహణ బాధ్యతలు తీసుకుంటాయి. అందుకే.. ఆయా హోటళ్లకు మార్కెట్లో మాంచి డిమాండ్ ఉంది. తగిన గుర్తింపు కార్డులు ఉంటే.. ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయరు. 


చూశారుగా.. ఇకపై మీ ప్రైవసీకి ఎవరైనా భంగం కలిగిస్తే నిలదీయండి. ఏ రూల్ ప్రకారం తమను ప్రశ్నిస్తున్నారని అడగండి. అయితే, కొన్ని హోటళ్లు తమ కస్టమర్లకు ఎలాంటి భంగం వాటిల్లకూడదనే ఉద్దేశంతో స్వయంగా కొన్ని నిబంధనలు విధిస్తున్నాయి. కాబట్టి.. వారి రూల్స్‌ను పాటిస్తూ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా ఉంటే.. ఏ హోటల్ నిర్వాహకులు అడ్డు చెప్పరు. పైగా మీ వద్ద తగిన ఐడెంటీ కార్డులు అందుబాటులో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదు. అయితే, ఈ నిబంధనల్లో లొసుగులు వెతికి తప్పులు చేస్తే మాత్రం ఏదో ఒక రోజు సమాజం ముందు దోషిగా నిలబడాల్సి వస్తుంది. 

Tags: Unmarried Couples in Hotel Unmarried Couples staying In Hotel Couples in Hotel Hotel Rules హోటల్ రూమ్‌లో పెళ్లికాని జంటలు

సంబంధిత కథనాలు

Solar Eclipse: నేడే సంపూర్ణ సూర్య గ్రహణం... మనకి కనిపించదు, అయినా సరే గ్రహణ సమయంలో ఈ పనులు చేయకూడదంటారు

Solar Eclipse: నేడే సంపూర్ణ సూర్య గ్రహణం... మనకి కనిపించదు, అయినా సరే గ్రహణ సమయంలో ఈ పనులు చేయకూడదంటారు

Corona virus: శీతాకాలంలో కరోనాను తట్టుకునే శక్తి కావాలంటే... ఇవన్నీ తినాల్సిందే

Corona virus: శీతాకాలంలో కరోనాను తట్టుకునే శక్తి కావాలంటే... ఇవన్నీ తినాల్సిందే

Breastfeed: విమానంలో పిల్లి పిల్లకు రొమ్ము పాలిచ్చిన మహిళ.. ప్రయాణికులు షాక్

Breastfeed: విమానంలో పిల్లి పిల్లకు రొమ్ము పాలిచ్చిన మహిళ.. ప్రయాణికులు షాక్

Compostable Plates: ఇలాంటి పేపర్ ప్లేట్లలో రోజూ భోజనాలు లాగిస్తున్నారా? అయితే ఈ రోగాలు రాక తప్పవు

Compostable Plates: ఇలాంటి పేపర్ ప్లేట్లలో రోజూ భోజనాలు లాగిస్తున్నారా? అయితే ఈ రోగాలు రాక తప్పవు

Pressure Cooker: ఈ మూడు వంటలు ప్రెషర్ కుక్కర్లో వండకూడదు... అయినా వండేస్తున్నాం

Pressure Cooker: ఈ మూడు వంటలు ప్రెషర్ కుక్కర్లో వండకూడదు... అయినా వండేస్తున్నాం

టాప్ స్టోరీస్

Bheemla Nayak Song Update : అదర గొడుతున్న 'అడవితల్లి మాట'.. భీమ్లానాయక్ నుంచి నాలుగో సాంగ్ వచ్చేసింది...

Bheemla Nayak Song Update : అదర గొడుతున్న 'అడవితల్లి మాట'.. భీమ్లానాయక్ నుంచి నాలుగో సాంగ్ వచ్చేసింది...

Solar Eclipse: సంపూర్ణ సూర్య గ్రహణాన్ని లైవ్‌లో చూసేయండి

Solar Eclipse: సంపూర్ణ సూర్య గ్రహణాన్ని లైవ్‌లో చూసేయండి

Zawad Update: బలహీన పడుతున్న జవాద్... ముందస్తు జాగ్రత్తగా రెస్క్యూ టీంలు మోహరింపు

Zawad Update: బలహీన పడుతున్న జవాద్... ముందస్తు జాగ్రత్తగా రెస్క్యూ టీంలు మోహరింపు

TRS Leaders Goa Tour: సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన టీఆర్‌ఎస్‌ ఖమ్మం లీడర్ల గోవా టూర్‌

TRS Leaders Goa Tour: సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన టీఆర్‌ఎస్‌ ఖమ్మం లీడర్ల  గోవా టూర్‌