అన్వేషించండి

Kangana Ranaut: కంగనాకు దిల్లీ అసెంబ్లీ సమన్లు.. సిక్కులపై వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం

నటి కంగనా రనౌత్‌ తమ ముందు హాజరు కావాలని దిల్లీ అసెంబ్లీ శాంతి సామరస్య కమిటీ సమన్లు జారీ చేసింది.

హీరోయిన్ కంగనా రనౌత్‌కు దిల్లీ అసెంబ్లీ సమన్లు ​జారీ చేసింది. డిసెంబర్ 6 మధ్యాహ్నం 12:00 గంటలకు కంగానా తమ ముందు హాజరు కావాలని దిల్లీ అసెంబ్లీ శాంతిసామరస్య కమిటీ ఆదేశించింది. సిక్కు సమాజంపై ఇటీవల కంగానా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈ సమన్లు జారీ చేశారు. ప్రస్తుతం ఈ కమిటీ ఛైర్మన్‌గా ఆమ్‌ఆద్మీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా ఉన్నారు. 

" సినీ నటి కంగనా రనౌత్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ @kanganaranaut పోస్టులో అభ్యంతరకర, నేరపూరితమైన వ్యాఖ్యలు చేసినట్లు కమిటీకి చాలా ఫిర్యాదులు వచ్చాయి. కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పబ్లిష్ చేసిన స్టోరీలు చాలా మందికి చేరే అవకాశం ఉంది. ఆమెను ప్రపంచవ్యాప్తంగా 80 లక్షల మంది వరకు ఇన్‌స్టాలో ఫాలో అవుతున్నారు. అలాంటి ఖాతాలో సిక్కు వర్గంపై ఆమె అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీని వల్ల సమాజంలో శాంతి సామరస్యాలు దెబ్బతినే అవకాశం ఉంది.                                         "
-కమిటీ ప్రకటన

నూతన సాగు చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటన చేసిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో కంగనా ఓ పోస్ట్ పెట్టారు. ఇందులో భారత్‌ను 'జిహాదిస్ట్ నేషన్' అని పిలిచారు. సిక్కులను 'ఖలిస్థానీలు'గా కంగనా పిలిచారు. 

" ఖలీస్థానీ తీవ్రవాదులు ఈ రోజు ప్రభుత్వాన్ని శాసించి ఉండవచ్చు.. కానీ అలాంటి వాళ్లను తన కాలి కింద అణిచివేసిన ఒకే ఒక మహిళా ప్రధాని (ఇందిరా గాంధీ) గురించి మరిచిపోవద్దు.                                                                       "
-కంగనా రనౌత్, సినీ నటి
 
కంగనా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కంగనా రనౌత్‌పై దిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులో, నటి కంగనా రనౌత్ సోషల్ మీడియా ద్వారా సిక్కు సమాజంపై తప్పుడు పుకార్లను వ్యాప్తి చేసినట్లు పేర్కొన్నారు. 

ఇటీవల కంగనా తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశ స్వాతంత్య్రంపై ఆమె చేసిన వ్యాఖ్యలను విపక్షాలు సహా అధికార భాజపాలోని కొందరు నేతలు ఖండించారు. 

Also Read: NEET Counselling 2021 Postponed: నీట్ కౌన్సిలింగ్ వాయిదా.. 'ఈడబ్ల్యూఎస్‌'పై కేంద్రం పునరాలోచన!

Also Read: Toilet Paper: బాబూ చిట్టీ.. ఇదేం రాజీనామా లేఖ నాయనా.. రాసేందుకు ఇంకెక్కడ ప్లేస్ దొరకలేదా?

Also Read: INS Vela Pics: భారత అమ్ములపొదిలో ఐఎన్ఎస్ వేలా.. ఇది చాలా స్పెషల్ గురూ!

Also Read: Watch Video: 'రోడ్లు.. కత్రినా కైఫ్ బుగ్గల్లా ఉండాలి.. 'ఏంటి బాబు.. ఏమన్నావు?

Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 9,119 కరోనా కేసులు, 396 మరణాలు నమోదు

Also Read: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Beggars: ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Gukesh:  గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
Royal Enfield Bikes: త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
Embed widget