NEET UG Counselling: నీట్ యూజీ 2022 కౌన్సెలింగ్ రౌండ్-1 ఫైనల్ జాబితా విడుదల
నీట్ యూజీ కౌన్సెలింగ్ 2022 రౌండ్-1 ఫైనల్ జాబితాను మెడికల్ కౌన్సిల్ కమిటీ అక్టోబరు 21న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో సీట్ల కేటాయింపు వివరాలను అందుబాటులో ఉంచింది.
నీట్ యూజీ కౌన్సెలింగ్ 2022 రౌండ్-1 ఫైనల్ జాబితాను మెడికల్ కౌన్సిల్ కమిటీ అక్టోబరు 21న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో సీట్ల కేటాయింపు వివరాలను అందుబాటులో ఉంచింది. పీడీఎఫ్ ఫార్మాట్ సీట్ల కేటాయింపు ఫలితాలను ఎంసీసీ విడుదల చేసింది. అభ్యర్థులు కంప్యూటర్ కీబోర్డులో 'CTRL+F' క్లిక్ చేసి, సెర్చ్ బాక్సులో ర్యాంకు నమోదుచేయడం ద్వారా సీట్ల కేటాయింపు వివరాలు సులభంగా తెలుసుకోవచ్చు. సీట్లు పొందిన అభ్యర్థులు సంబంధిత కళాశాల్లో అక్టోబరు 22 నుంచి 28 మధ్య రిపోర్ట్ చేసి, ప్రవేశ ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది.
NEET-UG Counselling Seats Allotment -2022 Round 1
నవంబరు మొదటివారంలో రెండో విడత కౌన్సెలింగ్..
నీట్ యూజీ 20222 రెండో విడత కౌన్సెలింగ్ నవంబరు 2 నుంచి ప్రారంభంకానుంది. సెంట్రల్ కౌన్సెలింగ్‌లో భాగంగా నవంబరు 2 నుంచి 10 వరకు ఆల్ ఇండియా కోటాలో, ఇక నవంబరు 7 నుంచి 18 వరకు స్టేట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. నవంబరు 11న సీట్లు కేటాయింపు ఫలితాలను ప్రకటించనున్నారు. రెండో విడతలో సీట్లు పొందినవారుసెంట్రల్ కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొందినవారు నవంబరు 18లోగా, స్టేట్ కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొందినవారు నవంబరు 21లోగా సంబంధిత కళాశాలలో చేరాల్సి ఉంటుంది.
నవంబరు 23 నుంచి చివరి విడత (మాపప్ రౌండ్) కౌన్సెలింగ్..
నీట్ యూజీ 2022 మొదటి, రెండో విడతల్లో సీట్లు పొందలేని విద్యార్థులు చివరి విడత కౌన్సెలింగ్ ద్వారా ప్రయత్నంచేయవచ్చు. నవంబరు 23 నుంచి డిసెంబరు 1 వరకు సెంట్రల్ కౌన్సెలింగ్.. అలాగే డిసెంబరు 6 నుంచి 12 వరకు స్టేట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. సెంట్రల్ కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొందినవారు డిసెంబరు 10 లోగా, స్టేట్ కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొందినవారు డిసెంబరు 16 లోగా సంబంధిత కళాశాలలో చేరాల్సి ఉంటుంది.
మిగిలిపోయిన సీట్లకు...
మూడువిడతల కౌన్సెలింగ్ అనంతరం మిగిలినపోయిన సీట్లను సెంట్రల్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీచేస్తారు. డిసెంబరు 12 నుంచి 14 వరకు ఆల్ ఇండియా కోటాలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబరు 20లోగా కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది.
నవంబరు 15 నుంచే తరగతులు..
నీట్ యూజీ 2022 కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొందిన విద్యార్థులకు నవంబరు 15 నుంచే తరగతులు ప్రారంభంకానున్నాయి. అయితే బీడీఎస్/బీఎస్సీ నర్సింగ్ కోర్సులకు సంబంధించి రెండో విడత మాపప్ కౌన్సెలింగ్ కూడా నిర్వహించనున్నారు. ఈ షెడ్యూలును వెబ్‌సైట్ ద్వారా తెలియజేస్తారు. విద్యార్థులు శని, ఆదివారాల్లోనూ సంబంధింత కళాశాల్లో రిపోర్టింగ్ చేయవచ్చు.
నీట్ యూజీ 2022 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) సెప్టెంబరు 7న విడుదల చేసిన సంగతి తెలిసిందే. నీట్ పరీక్షకు మొత్తం 18,72,343 మంది రిజిష్టర్ చేసుకోగా.. 17,64,571 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 9,93,069 లక్షల మంది అర్హత సాధించారు. నీట్ పరీక్షలో అర్హత సాధించినవారిలో 4,29,160 మంది మహిళలు; 5,63,902 మంది పురుషులు, ఏడుగురు ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. అంటే 56.27 శాతం ఉత్తీర్ణులయ్యారు.
:: ఇవీ చదవండి ::
గురుకుల సైనిక మహిళా కళాశాలలో ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సు, అర్హతలివే!
యాదాద్రి భువనగిరి జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక మహిళా డిగ్రీ కళాశాల అందిస్తున్న ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఏ ఎకనామిక్స్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంట్రెన్స్ ఎగ్జామ్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లు, సైకో అనలిటికల్ టెస్ట్‌లు, మెడికల్ టెస్ట్‌లు, షార్ట్ లెక్చర్, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
Degree Courses: డిగ్రీలో కొత్త కోర్సులు, వచ్చే ఏడాది నుంచి అమల్లోకి!
తెలంగాణలోని యూనివర్సిటీల్లో మూస విద్యావిధానానికి స్వస్తి పలకాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. వచ్చే ఏడాదికల్లా కొలువులిచ్చే కోర్సుల రూపకల్పనకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ముగ్గురు వైస్‌చాన్స్‌లర్లతో త్రిసభ్య కమిటీని నియమించింది. శాతవాహన వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎస్.మల్లేశ్ చైర్మన్‌గా, ఉస్మానియా వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్, మహత్మాగాంధీ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి సభ్యులుగా కమిటీ వేసింది.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..
విద్యార్థులకు గుడ్ న్యూస్, డిటెన్షన్ విధానంపై జేఎన్టీయూ కీలక నిర్ణయం!
జేఎన్‌టీయూ-హైదరాబాద్ విద్యార్థులకు ఊరటనిచ్చే వార్త వినిపించింది. విద్యార్థుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైన నేపథ్యంలో ఈ ఏడాది క్రెడిట్ ఆధారిత డిటెన్షన్ విధానాన్ని అమలు చేయడం లేదని, వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని జేఎన్టీయూ అధికారులు ప్రకటించారు. బీటెక్, బీఫార్మసీ విద్యార్థులను వచ్చే ఏడాదికి ప్రమోట్ చేయడానికి క్రెడిట్ ప్రమాణాలను సడలించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..