అన్వేషించండి

JNTU: విద్యార్థులకు గుడ్ న్యూస్, డిటెన్షన్ విధానంపై జేఎన్టీయూ కీలక నిర్ణయం!

ఈ ఏడాది క్రెడిట్ ఆధారిత డిటెన్షన్ విధానాన్ని అమలు చేయడం లేదని, వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని అధికారులు ప్రకటించారు. బీటెక్, బీఫార్మసీ విద్యార్థుల ప్రమోట్ కోసం క్రెడిట్ ప్రమాణాలను సడలించింది.

జేఎన్‌టీయూ-హైదరాబాద్ విద్యార్థులకు ఊరటనిచ్చే వార్త వినిపించింది. విద్యార్థుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైన నేపథ్యంలో ఈ ఏడాది క్రెడిట్ ఆధారిత డిటెన్షన్ విధానాన్ని అమలు చేయడం లేదని, వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని జేఎన్టీయూ అధికారులు ప్రకటించారు. బీటెక్, బీఫార్మసీ విద్యార్థులను వచ్చే ఏడాదికి ప్రమోట్ చేయడానికి క్రెడిట్ ప్రమాణాలను సడలించింది. 2021-22 విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తించే సడలింపు తర్వాత, విద్యార్థులు తదుపరి సంవత్సరానికి ప్రమోట్ కావడానికి 25 శాతం క్రెడిట్‌లు మాత్రమే అవసరం అవుతాయి.

Also Read:  'నీట్‌' పీజీ కటాఫ్‌ మార్కులు తగ్గించిన కేంద్రం, కొత్త కటాఫ్ ఇదే!

కరోనాతో రెండేళ్లుగా క్రెడిట్ ఆధారిత డిటెన్షన్ విధానాన్ని యూనివర్సిటీ రద్దు చేసింది. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ ఏడాది నుంచి క్రెడిట్‌ ఆధారిత డిటెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించినట్లు అక్టోబరు మొదటివారంలో జేఎన్‌టీయూ అధికారులు ప్రకటించారు. దీని ప్రకారం నిర్దేశిత క్రెడిట్స్‌ సాధించకపోతే విద్యార్థులు మరుసటి సంవత్సరానికి ప్రమోట్‌ అయ్యేందుకు వీలుండదని రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో యూనివర్సిటీ నిర్ణయంపై మడ్డిపడ్డ విద్యార్థులు ఆందోళనకు దిగారు. క్రెడిట్ బేస్ డిటెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనకు దిగొచ్చిన యూనివర్సిటీ అధికారులు డిటెన్షన్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. 

Read Also:  విద్యార్థులకు అలర్ట్, పాత విధానంలోనే జేఎన్‌టీయూ పరీక్షలు

జేఎన్టీయూ అధికారులకు గవర్నర్ అభినందనలు 
క్రెడిట్ ఆధారిత డిటెన్షన్ సడలించినందుకు జేఎన్టీయూ అధికారులకు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అభినందనలు తెలిపారు. అక్టోబర్ 15వ తేదీన భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ట్విట్టర్ స్పేస్ ద్వారా విద్యార్థులు... యువతతో గవర్నర్ సంభాషించారు. ఈ సందర్భంగా JNTU విద్యార్థులు క్రెడిట్ ఆధారిత డిటెన్షన్ విధానం వల్ల తమకు జరుగుతున్న నష్టాన్ని గవర్నర్ కు వివరించారు. సమస్యను పరిష్కరిస్తామని విద్యార్థులకు గవర్నర్ హామీ ఇచ్చారు. గవర్నర్ విజ్ఞప్తి మేరకు క్రెడిట్ ఆధారిత డిటెన్షన్ విధానాన్ని సడలిస్తున్నట్టు  JNTU అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళి సై అధికారులకు అభినందనలు తెలిపారు.

Read Also:  నేషనల్‌ లా యూనివర్సిటీ ప్రవేశాలకు నోటిఫికేషన్!

అసలు ఏంటీ క్రెడిట్ ఆధారిత డిటెన్షన్ విధానం..? 
జేఎన్‌టీయూ పరిధిలోని కళాశాలల్లో ఇంజినీరింగ్‌లో చేరిన విద్యార్థులు ప్రతిఏటా నిర్దేశిత క్రెడిట్స్ సాధించాల్సి ఉంటుంది. అలాగే 75 శాతం  హాజరు ఉంటేనే సెమిస్టర్ పరీక్షలు రాసేందుకు అనుమతిస్తారు. కరోనాతో రెండేళ్లు హాజరుతో పాటు క్రెడిట్ ఆధారిత డిటెన్షన్ విధానాన్ని యూనివర్సిటీ రద్దు చేసింది. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆ విధానాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విధానం ప్రకారం ఇంజినీరింగ్ విద్యార్థులు మొదటి ఏడాది నుంచి రెండో ఏడాదిలోకి వెళ్లాలంటే 18 క్రెడిట్స్, రెండో ఏడాది నుంచి మూడో ఏడాదిలోకి వెళ్లాలంటే 47 క్రెడిట్స్, 3 నుంచి నాలుగో ఏడాదిలోకి వెళ్లాలంటే 73 క్రెడిట్స్ సాధించాల్సి ఉంటుంది. ఇక లేటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశాలు పొందిన విద్యా్ర్థులు రెండో ఏడాది నుంచి మూడో ఏడాదిలోకి వెళ్లాలంటే 25 క్రెడిట్స్, 3 నుంచి నాలుగో ఏడాదిలోకి వెళ్లాలంటే 51 క్రెడిట్స్ ఉండాలి. ఒకవేళ విద్యార్థులు నిర్దేశిత క్రెడిట్స్ సాధించలేకపోతే మరుసటి ఏడాదిలోకి ప్రవేశించే వీలుండదు. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

How To Become Guest Faculty: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Embed widget