అన్వేషించండి

PG Medical Cut Off: 'నీట్‌' పీజీ కటాఫ్‌ మార్కులు తగ్గించిన కేంద్రం, కొత్త కటాఫ్ ఇదే!

గతేడాది పీజీ మెడికల్ కౌన్సెలింగ్‌లొ సీట్లు మిగిలిపోయిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, కేంద్రం కటాఫ్ మార్కులను తగ్గించింది. నేషనల్ మెడికల్ కమిషన్ సూచనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ నీట్‌-2022 పీజీ మెడికల్ అర్హత కటాఫ్‌ స్కోర్‌ను 25.714 పర్సంటైల్‌కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా జనరల్‌ అభ్యర్థులు 24.286 పర్సంటైల్‌ 174 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ చెందిన వారికి 14.286 పర్సంటైల్‌ 138 మార్కులు, దివ్యాంగులకు 19.286 పర్సంటైల్‌ 157 మార్కులు సాధించిన విద్యార్థులు అర్హత సాధించారు. గతేడాది పీజీ మెడికల్ కౌన్సెలింగ్‌లొ సీట్లు మిగిలిపోయిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, కేంద్రం కటాఫ్ మార్కులను తగ్గించింది. నేషనల్ మెడికల్ కమిషన్ సూచనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

కటాఫ్‌ మార్కులు తగ్గించడంతో అర్హత పొందిన అభ్యర్థులు కన్వీనర్‌ కోటాలో ఎండీఎస్‌ ప్రవేశానికి అక్టోబరు 20 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకోవాలని వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అక్టోబరు 17న నోటిఫికేషన్‌ జారీచేసింది. అక్టోబరు 18న ఉదయం 8 గంటల నుంచి అక్టోబరు 20న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీకి అక్టోబరు 23 వరకు దరఖాస్తులు
రాష్ట్రంలోని పీజీ దంత వైద్యకోర్సుల్లో యాజమాన్య కోటాలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకోవాలని కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ అక్టోబరు 17న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్‌- ఎండీఎస్‌ 2022లో అర్హత సాధించిన విద్యార్థులు పీజీ డిప్లొమా, డిగ్రీ సీట్లకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. యాజమాన్య కోటాలో సీట్ల భర్తీకి విద్యార్థులు అక్టోబరు 18న ఉదయం 8 గంటల నుంచి అక్టోబరు 23న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
              నిర్దేశిత దరఖాస్తులు పూర్తిచేయడంతో పాటు విద్యార్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్‌ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని యూనివర్సిటీ పేర్కొంది. ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తులు, సర్టిఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్‌ జాబితాను విడుదల చేస్తుందని, ప్రవేశాలకు సంబంధించి పూర్తి సమాచారం కొరకు యూనివ ర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ వర్గాలు తెలుపాయి.

Notification

:: ఇవీ చదవండి ::

JNTU Exams: విద్యార్థులకు అలర్ట్, పాత విధానంలోనే జేఎన్‌టీయూ పరీక్షలు
జేఎన్‌టీయూ హైదరాబాద్ సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. ఇంజినీరింగ్ సెమిస్టర్ పరీక్షలు ఇకపై పాత విధానంలోనే నిర్వహించనున్నట్లు తెలిపింది. కరోనా సమయంలో బీటెక్, బీఫార్మసీ, ఎంటెక్, ఎంఫార్మసీ సెమిస్టర్ పరీక్షల విధానంలో పలు మార్పులు చేసి, విద్యార్థులపై ఒత్తిడిలేకుండా.. ఛాయిస్, సమయం ఎక్కువగా ఇచ్చి పరీక్షలు నిర్వహించారు. ప్రశ్నపత్రంలో 8 ప్రశ్నలుంటే ఏవైనా 5 రాసేందుకు వెసులుబాటు కల్పించారు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.. 


నేషనల్‌ లా యూనివర్సిటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ - దరఖాస్తు, పరీక్ష వివరాలు ఇలా!
న్యూఢిల్లీలోని నేషనల్‌ లా యూనివర్సిటీ (ఎన్‌ఎల్‌యూ)-అకడమిక్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్‌), ఎల్‌ఎల్‌ఎం, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆలిండియా లా ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏఐఎల్‌ఈటీ) 2023 ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. బీఏ ఎల్‌ఎల్‌బీ(ఆనర్స్‌), ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రామ్‌లలో ఒక్కోదానిలో అయిదు సీట్లను విదేశీ అభ్యర్థులకు మరో అయిదు సీట్లను ఓసీఐ/ పీఐఓ అభ్యర్థులకు; పీహెచ్‌డీలో రెండు సీట్లను విదేశీయులకు ప్రత్యేకించారు. వీరికి అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా అడ్మిషన్స్‌ ఇస్తారు. వీరు ఎంట్రెన్స్‌ టెస్ట్‌ రాయనవసరం లేదు.
నోటిఫికేషన్, అర్హతలు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి...


CLISC: సీఎల్‌ఐఎస్సీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం, ఇంటర్ అర్హత!
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పౌర గ్రంధాలయాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో గుర్తింపు పొందిన మూడు సంస్థల ద్వారా నిర్వహించనున్న 5 నెలల కాలపరిమితితో కూడిన సర్టిఫికెట్‌ కోర్స్ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్పర్మేషన్‌ సైన్స్‌ కోర్సులో చేరేందుకు ఆసక్తిగల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతుంది. 
కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Embed widget