Madras HC Update: 'జయలలిత నివాసం ఆమె మేనకోడలిదే.. ప్రభుత్వానికి ఎలాంటి హక్కులేదు'
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాసం ఆమె మేనకోడలు దీపకే చెందుతుందని మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించింది.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం వేద నిలయంపై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వేద నిలయాన్ని స్మారక మందిరంగా మార్చడానికి వీలులేదని కోర్టు తేల్చిచెప్పింది. మూడు వారాల్లో వేద నిలయాన్ని జయలలిత మేన కోడలు దీపకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది.
Madras High Court sets aside the previous AIADMK government's decision to convert former CM Jayalalithaa's Veda Nilayam house at Poes Garden in Chennai into a memorial. pic.twitter.com/C8fIYvrMVG
— ANI (@ANI) November 24, 2021
జయలలిత నివాసాన్ని స్మారక మందిరంగా మార్చాలని అన్నాడీఎంకే ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కూడా న్యాయస్థానం కొట్టేసింది. జయలిలిత ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వానికి ఏమాత్రం హక్కులేదని స్పష్టం చేసింది.
ఆమె మరణానంతరం..
2016లో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అనారోగ్యంతో కన్నుమూశారు. ఆ మరుసటి ఏడాదే ఆమె నివాసమైన పోయెస్ గార్డెన్‌ను స్మారక మందిరంగా మార్చాలని పళనిస్వామి నేతృత్వంలోని అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కోర్టులో..
ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ జయలలిత మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమను జయలలిత వారసులుగా కోర్టు గుర్తించిందని.. మరి ఇలాంటి సమయంలో ఆమె నివాసాన్ని ఎలా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ విషయంపై చాలా రోజుల నుంచి కోర్టులో విచారణ సాగుతోంది. అయితే తాజాగా వేద నిలయం ఆమె మేనకోడలు దీపకే చెందుతుందని హైకోర్టు తీర్పు వెలువరించింది.
Also Read: Rs 24 Crore Buffalo: వీర్యంతో ఏటా రూ.2 కోట్లు లాభం.. దేశంలోనే ఇదే అత్యంత ఖరీదైన దున్నపోతు!
Also Read: PMGKAY Scheme Extended: కేంద్రం శుభవార్త.. 2022 మార్చి వరకు వారికి రేషన్ ఫ్రీ!
Also Read: Koo App: 'నచ్చిన, వచ్చిన భాషలో 'కూ'సేయండి.. స్వేచ్ఛగా, మరింత సులభంగా'
Also Read: Primary Health Care: ఆ 13 రాష్ట్రాల్లో ఆరోగ్యంపై మరింత శ్రద్ధ.. జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ!
Also Read: Farm Laws Repeal: వ్యవసాయ చట్టాల రద్దుకు కేబినెట్ ఆమోదం.. తొలిరోజే సభకు!
Also Read: Whatsapp Message Delete: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. మెసేజ్ డిలీట్ చేయాలా? అయితే ఇక బేఫికర్!
Also Read: Corona Cases: దేశంలో 537 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు
Also Read: కాఫీ అతిగా తాగితే హృదయ స్పందనల్లో తేడా... కనిపెట్టిన అమెరికన్ హార్ట్ అసోసియేషన్
Also Read: ఎక్కువకాలం జీవించాలనుందా... అయితే ఇవి కచ్చితంగా తినండి
Also Read: సెక్స్ అంటే ఇష్టం లేనివాళ్ల కోసం ఈ డేటింగ్ యాప్, ఎంత మంది సభ్యులున్నారంటే...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి