Delhi Customs: నోట్ బుక్ తీసుకెళ్తున్నాడని ఎయిర్ పోర్టులో అరెస్ట్ - దానికే అరెస్టు చేస్తారా?.. అక్కడే అసలు ట్విస్ట్
Delhi Airport:పుస్తకంలో పేజీల మధ్య విదేశీ కరెన్సీని తీసుకెళ్తున్న వ్యక్తిని ఢిల్లీ కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు . ఆ డబ్బుల్ని ఆయన నోట్ బుక్ పేజీల మధ్య పెట్టుకుని స్మగ్లింగ్ చేస్తున్నారు.

Foreign currency smuggling arrest: ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఓ వ్యక్తి స్టైల్ నడుచుకుంటూ వస్తున్నాయి. అతని చేతిలో నోట్ బుక్ ఉంది. అంతా చెక్ చేశారు కానీ ఆ నోట్ బుక్ ని చెక్ చేయకుండా చూసుకుంటున్నాడు. దాంతో అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు నోట్ బుక్ ఓపెన్ చేశారు. వాటిలో ఉన్నవి చూసి ఆశ్చర్యపోవాల్సి వచ్చింది.
ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-3లో మంగళవారం రాత్రి భారీ విదేశీ కరెన్సీ స్మగ్లింగ్‌ను కస్టమ్స్ ఏఐయూ అధికారులు అడ్డుకున్నారు. టర్కీ జాతీయుడి చెక్-ఇన్ బ్యాగేజీలోని పుస్తకాల పేజీల మధ్య దాచిపెట్టిన 23,750 యూరోలు , US $3,500 డాలర్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ. 27,74,100.
ఫ్లైట్ నంబర్ 6E-011 ద్వారా డిసెంబర్ 9, 2025 రాత్రి ఢిల్లీ నుంచి ఇస్తాంబుల్ వెళ్లాల్సి ఉన్న ఈ టర్కీ ప్రయాణికుడిని రాండమ్ రిఫరల్ ఆధారంగా ఏఐయూ బృందం అడ్డుకుంది. వ్యక్తిగత తనిఖీ మరియు బ్యాగేజీ స్కానింగ్ సమయంలో అనుమానం రావడంతో చెక్-ఇన్ బ్యాగేజీని పూర్తిగా తనిఖీ చేశారు. తనిఖీలో ఆశ్చర్యకర విషయం వెలుగులోకి వచ్చింది – ప్రయాణికుడు తన వద్ద ఉన్న సాధారణ పుస్తకాల పేజీల మధ్య యూరో . డాలర్ నోట్లను ఒక్కొక్కటిగా జాగ్రత్తగా దాచిపెట్టాడు. ఈ పద్ధతి వల్ల సాధారణ సెక్యూరిటీ స్కానర్లలో గుర్తించకుండా ఉండే అవకాశం ఉందని అతడు భావించాడు.
పట్టుబడ్డాక ఆ టర్కీ పౌరుడు కరెన్సీని విదేశానికి స్మగ్లింగ్ చేయడానికే తీసుకెళ్తున్నానని అంగీకరించాడు. అతడి పాస్‌పోర్ట్, టికెట్ వివరాలను రికార్డు చేసిన కస్టమ్స్ అధికారులు, స్వాధీనం చేసుకున్న మొత్తం ₹27,74,100 విలువైన విదేశీ కరెన్సీని పానెక్స్ రిపోర్ట్ తయారు చేశారు.
కస్టమ్స్ యాక్ట్-1962 సెక్షన్ 104 , ఫారిన్ ఎక్స్‌చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (FEMA) నిబంధనల ప్రకారం ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని మరింత విచారణ కొనసాగిస్తున్నారు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి కోసం తీసుకెళ్తున్నాడు అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది.
#DelhiCustomsAtWork@IGI
— Delhi Customs (Airport & General) (@AirportGenCus) December 9, 2025
Customs, IGI Airport Date: 09.12.2025
Operation: AIU, IGI Airport, New Delhi
Seizure: 27,74,100/-(€ 23,750 & US $3,500) Currency
The customs officers of IGI Airport, New Delhi have seized foreign currency i.e. € 23,750 & US $3,500- having total value… pic.twitter.com/snsOJTyEp8
భారతదేశంలో, ప్రయాణీకులు విదేశీ కరెన్సీని తీసుకెళ్లవచ్చు. కానీ 5,000 అమెరికన్ డాలర్లు లేదా దానికి సమానమైన నగదును మాత్రమే తీసుకెళ్లాలి. ఇంకా ఎక్కువ తీసుకెళ్లాలంటే ముందుగా తెలియచేయాలి. గుర్తింపును తప్పించుకోవడానికి బ్యాగేజీలో దాచిపెట్టడం కస్టమ్స్ చట్టం, 1962ను ఉల్లంఘిస్తుంది, ఎందుకంటే ఇది అనుమతి లేదా ప్రకటన లేకుండా అక్రమ రవాణా చేయాలనే ఉద్దేశ్యాన్ని సూచిస్తుంది, ఇది సెక్షన్ 110 కింద స్వాధీనం చేసుకోవడానికి దారితీస్తుంది.





















